STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

3  

Midhun babu

Classics Fantasy Inspirational

అందేనా

అందేనా

1 min
5


మనసు సరిగ ఆగకుండ..సత్యమేదొ అందేనా..! 

ప్రేమగుట్టు పట్టకుండ..హృదయమేదొ విరిసేనా..! 


కరుణంటే అర్థమైన..మనిషికదా దైవమనగ.. 

సమాధిలో చేరకుండ..జ్ఞానమేదొ కలిగేనా..! 


జీవకోటి ఆవేదన..గుర్తెరిగన వాడె గురువు.. 

తననన్నిట చూడకుండ..స్నేహమేదొ నిలిచేనా..! 


రుచులన్నీ హింసాత్మక..గుణసంపద ఫలితము కద.. 

వాసనలే రాలకుండ..ఖేదమేదొ తొలగేనా..! 


ప్రశ్నించే హక్కు సరే..అహంకారం ప్రశ్న కద.. 

'నేను-నాది' వదలకుండ..వాదమేదొ జరిగేనా..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics