STORYMIRROR

Midhun babu

Classics

3  

Midhun babu

Classics

అదే అదే

అదే అదే

1 min
4

ఈ అగ్నిది ఏ కులమో..నా కులం అదే అదే..! 

ఆ నింగిది ఏ మతమో..నా మతం అదే అదే..! 


ఎంత చదివి లాభమేమి..బుద్ధి వికాస మవకున్న.. 

మన గాలిది ఏ దేశమొ..నా దేశం అదే అదే..! 


ఎన్ని రంగులెన్ని పరిమళాలు ఈ పూలకు.. 

మరి మట్టిది ఏ హాసమొ.. నా హాసం అదే అదే..! 


ఏ కొండలు దూకేనో..నీటిబొట్టు కేమి తెలుసు.. 

ఏ మబ్బుది ఏ వర్ణమొ..నా వర్ణం అదే అదే..! 


ప్రాంతీయత భావమేమొ..సరిహద్దుల రక్షణేమొ.. 

ఏ ప్రాణిది ఏ తేజమొ..నా తేజం అదే అదే..! 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics