అద్ధమేనా
అద్ధమేనా
బ్రతుకంతా యాంత్రికతకు అందమైన అద్ద'మేనా..!?
శ్వాసమాటు కావ్యాలకు అడ్డమైన అద్ద'మేనా..!?
స్కూృలు పీకి పడవేసే పనికి బదులు బిగింపాయె..!
గాస్ ట్రబుల్ను పోషించగ దత్తమైన అద్ద'మేనా..!?
పూలపాన్పులో కూడా ఇనుపముళ్ళ శకలాలా..!
గుండెపోటు కానుకవగ శాపమైన అద్ద'మేనా..!?
బాటలన్ని బాంబు పూల వంతెనలకు ని'లయమాయె..!
అరాచకపు మీటపాల మేషమైన అద్ద'మేనా..!?
స్టీలు ఉచ్చు కౌగిలిలో మురుస్తున్న మంత్రాంగం..!
చలువ గదుల భోగాలకు రాగమైన అద్ద'మేనా..!?
