అభ్యుదయం
అభ్యుదయం
మోసమనే ఊయలలో..నిదురలోన అభ్యుదయం..!
వాగ్దానపు హోరుగాలి..మేడలోన అభ్యుదయం..!
ఎవ్వరినీ నిందించే..అవసరమే లేదు లెమ్ము..
నీ స్వార్థం నిస్వార్థం..నీడలోన అభ్యుదయం..!
ముళ్ళంటూ లేకుండా..గులాబీకి రక్షణేది..
మైకులకే పరిమితమై..మాటలోన అభ్యుదయం..!
నిజాయితీ ముసుగులోన..నీతి ఎంత మూల్గేనో..
ఆవేదనా భరితమై..కవితలోన అభ్యుదయం..!
అన్యాయానికి న్యాయం..ఆహుతెలా అవుతోందో..
చిత్రం ఈ నాటకాన..పాటలోన అభ్యుదయం..!
ఉద్యోగపు సంతలోన..సరుకైనది విద్యేనా..
ప్రశ్నలన్ని శలభాలే..మంటలోన అభ్యుదయం..!
