STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

అభిసారిక

అభిసారిక

1 min
9



వయసుమాయ యేమిటో మధురమైన వేదనా
వరునిరాక కోసమే మనసుపడే యాతనా
సింధూరము కాంతులీను శిరోజాన సౌధామిని
వేణియందు మల్లియలే గుభాళించు సమ్మోహిని
ముక్కునందు ముక్కెరలా నిగారింపు సంశోభిని
కర్ణములా లోలాకుల పరివేష్టిత విదుషీమణి
బంగారము సింగారపు తలుపుముందు అభిసారిక
చిరునవ్వుల చెలికాడిని ఆదరించు మృధుహాసిని
కనుసన్నల నడయాడగ తలపులందు తరుణీమణి
ఎదురుచూపు లందుమునిగె యవ్వనాలజవ్వనిదే 
నునుబుగ్గల పాలుగారు వాలుచూపు వయ్యారము
హరితమద్ది రవికలోన ప్రకృతినీ సాక్షిజేసి
తెల్లచీర నుడిగట్టీ తెలియజేయు సంగతియిదె
సమ్మోహన నీదురాక మురియజేయు సాంగత్యమె 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics