STORYMIRROR

Gayatri Tokachichu

Children

4  

Gayatri Tokachichu

Children

ఆడుకొందాం!

ఆడుకొందాం!

1 min
408

ఆడుకొందాం!(బాలగేయం )


ఆకాశానికి నిచ్చెన వేద్దాం!

ఆశల పల్లకి మోసుకెళ్దాం!

ఆడంబరంగా అడుగులు వేద్దాం!

ఆ జాబిలినే పట్టుకొందాం!

ఆటల నాడుతు నూగి పోదాం!

ఆ మబ్బుల్లో గూడు కడదాం!

ఆకాంక్షలన్నీ తీర్చుకొందాం!

ఆ నక్షత్రాలను మూటకడదాం!

ఆహా!అంటూ ధరణికి వద్దాం!

ఆనందంగా పంచి పెడదాం!

ఆ ముచ్చట్లే అమ్మకు చెబుదాం!

ఆ తల్లి యొడిలో నిద్దుర పోదాం!

-----------------------------


Rate this content
Log in

Similar telugu poem from Children