STORYMIRROR

Gayatri Tokachichu

Children

4  

Gayatri Tokachichu

Children

అ -అః :అచ్చుల గేయం

అ -అః :అచ్చుల గేయం

1 min
288

అమ్మకు తోడు నీడగా చరించి యానందముగా జీవించుమోయి!


ఆవులను పెంచి, పూజించి 

పోషించుట మేలని నమ్ము మోయి!


 ఇటుకలతో కట్టిన భవంతి కంటే కుటుంబ బంధాలు స్థిరమైనవోయి!


ఈత, వేప, మామిడి,జామ,పనస

వంటి చెట్లు పెంచుమోయి!


ఉడతలు చెట్లపై యాటలాడగా మనసు కెంతో హాయి హాయి!


 ఊడలతో నూయలను కట్టి మిత్రులతో నూగుమోయి!


ఋణము తెచ్చుకొనుట హీనతనమని తల్చుమోయి!


ఎడము చూపక పదుగురితో చెలిమిని చేయుమోయి!


ఏరులలో , చెరువులలో, నదులలో ముఱికి కలపకోయి!


ఐదుభూతముల

సమాహార ప్రకృతిని పూజించుమోయి !


ఒకటిగానుండునా పరబ్రహ్మమునకు మ్రొక్కుమోయి!


ఓడచందము సంసారాబ్ధిని దాటుమోయి!


ఔరా!

అనునట్లున్నతముగా నీవు జీవించుమోయి!


అందెలుకట్టి నాట్యమాడు బాల కృష్ణుని మదిలో భావించుమోయి!


******************


Rate this content
Log in

Similar telugu poem from Children