STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

కనకదుర్గమ్మ కరుణ

కనకదుర్గమ్మ కరుణ

1 min
395


తేటగీతి మాలిక

-------------------------

భవిత నిల్పెడి నామము పల్కు చుండి 

ప్రవిమలంబగు మదితోడ భక్తి మీర

విజయవాటిక దుర్గ నే వేడు కొంచు

భజనలన్ సల్పి నిరతము ప్రణతి చేసి,


నియతిగా తల్లి సన్నిధిన్ నిల్చి యుండి

భయము బాపెడి దర్గను పాహి యనుచు 

నాదరమ్మును కోరగ నమ్మ మనకు 

ముదముతో నిచ్చు వరములు ముందు గానె.


దిశల వెల్గెడి దేవి యే దిక్కు చూప

నాశ వీడక బ్రతకిన

యలసి పోక

కామి తంబులు తీర్చెడి కనక దుర్గ

స్వామితోకూడి కాచును సకల జనుల.

---------------------------------



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics