STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

కరుణామయి మా పార్వతి

కరుణామయి మా పార్వతి

1 min
333


-----------------------------

1.సౌభాగ్య రాశి!యీ జగతికే మూల శక్తీ!

హే!భార్గవీ!పార్వతీ!నీవే సకలలోక దివ్య దీప్తీ!


2. కారుణ్యమూర్తివే !కరుణను చూపవమ్మా!

భారంబు పోద్రోలి వాంఛితము దీర్పవమ్మా!


3. దోసంబు లన్నియు దూరంబు చేయవమ్మా!

దాసిగా కొల్చెద దారినే చూపవమ్మా!


4.శక్తిప్రదాయనీ శ్రద్దగాపూజింతు తల్లీ!

ముక్తి వరప్రదా!పుణ్యాలనీయవే తల్లీ!


5. నిత్యంబు నీ సన్నిధిలో నిల్తునో యమ్మా!

సత్యగుణదీప్తి!సౌఖ్యంబులీ యమ్మా!


6.సుందరేశుని రాణి చిన్ముద్రా!శోకంబు బాపుమా తల్లీ!

బిందు వాసిని భద్రా!ప్రేమగా చూడు కల్పవల్లీ!


7. విద్యల నిచ్చెడి విమల చరితా!శాంకరీ!

హృద్యముగ కీర్తింతు హిమగిరిసుతా!శుభంకరీ!


8. నీదు సేవలనే నిష్ఠగా సల్పుచుందుమోయమ్మా!

నీదయ కురిపించి నెమ్మి నే చూపవోయమ్మా!/


-----------------------------


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics