యాక్షన్ V/S రియాక్షన్
యాక్షన్ V/S రియాక్షన్
ఏ పట్టు చిరనే కట్టుకున్న కట్టుకునోల్లో కట్టుకున్నా
(మంచిపని చేసినవ్, పాత నైటీలో రోజు చూసి చూసి బోర్ కొడుతుంది నాక్కూడా)
టిక్కి బొట్టే పెట్టుకున్న పెట్టుకునోల్లో పెట్టుకున్న
(ఓహో అయితే మొహం కూడా కడుకున్నావన్నమాట)
నడుముకు వడ్డాలం చుట్టుకున్న చుట్టుకునోల్లో చుట్టుకున్న
(బంగారం ధరలు బాగా తగ్గినయ్ అంటావు, లేకుంటే నీకు వడ్డాలం చేయాలంటే భారతదేశాన్ని అంగట్లో అమ్మాలి)
దిష్టి చుక్కనే దిద్దుకున్న దిద్దుకునోల్లో దిద్దుకున్న
(నువ్వున్నాక అది ఎందుకు మళ్ళీ ఖర్చు దండగా)
పెళ్ళికూతురు ముస్తాబురో.. నువ్వు ఎడకనస్తావురో..
(నువ్వు ఏ ముస్తాబన్నా వేసుకో, నేను యాడికి రాను నీ దగ్గరకు అసలు రాను)
చెయ్యి నీ చేతికి ఇస్తానురో అడుగు నీ అడుగులో ఎస్తానురో
(ముందు శానిటైజర్ తో కడుక్కొ, ఆరడుగుల దూరంలో ఉండు అసలే కరోనా)
నేను మెచ్చి నన్నే మెచ్చే టోడ ఇట్టే వస్తరా నివెంట
(నువ్వు నాకు నచ్చలేదు, నీకు దండం పెడతా నువ్వు యాడికి రావొద్దు అక్కడే ఉండు)
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా డుగు డుగు డుగు డుగు అని
(ఓహో నా బండి సౌండ్ విని బుల్లెట్టు బండి అనుకుంటున్నావా, కాదమ్మ పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల కిరోసిన్ పోసి నడుపుతున్న అందుకే అట్లా డుగు డుగు అని వస్తుంది)
అందాల దునియానే చూపిస్తపా చిక్కు చిక్కు చిక్కు చిక్కు బుక్కు అని
(నాకు ఏ దునియా వద్దు అసలే కరోనా థర్డ్ వేవ్ టైమ్, ఆరోగ్యంగా ఉంటే చాలు ఏమన్నా అయిందంటే పాణం తుక్కు తుక్కు అయితది) - నర్ర పాండు✍️

