Varanasi Ramabrahmam

Classics

4  

Varanasi Ramabrahmam

Classics

వట్టి సమయ యాపనం

వట్టి సమయ యాపనం

1 min
23.2K


భాషా సాహిత్యాలు ఇప్పుడు వాద ప్రియుల చేతిలో ఉన్నాయి. 


ప్రతి భాషా, అందులో సాహితీ సృష్టులు, వాద ప్రియులు యుద్ధాలు చేసుకోవడానికి ప్రాచీన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలను ద్వేష పూరితంగా విమర్శించడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాయి. 


దేశ, విదేశములలో ప్రాచుర్యం పొందడానికి, భారతదేశానికి పేరు తేవడానికి తెలుగు భాషలోని ప్రస్తుతం రచనా వ్యాసంగం ఏమీ ఉపయోగపడడం లేదు.


తెలుగు రాష్ట్రాలలోనే తెలుగు రచనలకు ప్రాచుర్యం, ప్రాముఖ్యత లేవు. దేశ, విదేశములలో పేరు తేవడానికి ఈ రచనలకు సత్తా లేదు. అలా జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపుకు నోచుకోని నిరర్ధక రచనలు ఎక్కువగా చేయ బడుతున్నాయి. 


వికృత రూపాలు


ప్రతి నాలుగు పదముల సరళి

ఆరు పంక్తుల అల్లికా

కవిత కాదు 

కదిలించబోదు


అరుణిమ దాల్చిన 

ప్రతి గుండ్రనిదీ 

ఉదయభానుడు కాదు

అరవిరిసిన అరవిందాలని 

వికసింప చేయలేదు


ప్రతి చల్లని వస్తువూ

హిమకరుడు కాదు

కలువ కన్నెల మానసచోరుడు కాలేదు


నాలుగు రంగుల ప్రతి కలయికా

కొన్ని గీతల సముదాయము

చిత్రంగా మారదు

కనువిందు సేయలేదు


ఎత్తులు పల్లాలు ఉన్న 

ప్రతి మగువా రమణి కాదు

రమణీయమైన రతి భావం

కలిగించ లేదు


ఇవన్నీ

ఎవరో ఒకరి చేతకానితనానికి ప్రతిరూపాలు

కొంత చెక్కబడిన శిలా వికృత రూపాలు


ఈ విధంగా నడుస్తోంది తెలుగు భాషలో సాహితీ సృష్టి. వస్తువుకి తప్ప మరే కవితా లక్షణానికి ప్రాముఖ్యత ఇచ్చి, ప్రదర్శించని 

ఈ రచనా వ్యాసంగం, కవితా సృష్టి సమయ యాపనం మాత్రమే.


Rate this content
Log in

Similar telugu story from Classics