Kishore Semalla

Drama Others

4.7  

Kishore Semalla

Drama Others

తన కోసం

తన కోసం

4 mins
22.9K



         శ్రీజ అంటే నాకు చాలా ఇష్టం కానీ చెప్పలేని పరిస్థితి. కారణం తను వేరే అబ్బాయితో ప్రేమలో ఉండడం. కానీ తనకోసం మనసులో వున్న చాలా విషయాలు చెప్పాలి అనుకున్న ఏదో ఒకరోజు.


      

         శ్రీజ తరచు తన ప్రియుడు తో మాట్లాడడం నాకు నచ్చేది కాదు. ఆఫీస్ టైం లో తను వీడియో కాల్ మాట్లాడడం నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. తన పైన నా ప్రేమ నన్ను రోజు రోజుకి బలహీనుడ్ని చేస్తున్నాయి. కొత్త అలవాట్లు నేర్చుకున్నాను. మందు, సిగరెట్లు రెట్టింపు తాగడం అలవాటు అయిపోయింది. 


  

        ఇది సరిపోదు అన్నట్టు ఒకరోజు తన ప్రియుడు హైదరాబాద్ వస్తున్నాడని విషయం నాకు తెలిసింది. ఇంకా నాకు రాత్రంతా నిద్రపట్టలేదు. కోపం, దిగులు, పిచ్చి పట్టినట్లు ప్రవర్తించా.



        ఎంత రాత్రైనా నా గదిలో లైట్ వెలగడాన్ని గమనించిన నా స్నేహితుడు మందలించాడు కూడా నన్ను. నాకింకా ఏం చెయ్యాలో తెలియలేదు.


       రాత్రి సుమారు రెండు అయింది. ఫోన్ చేశా తనకి, నిద్ర లో ఉందేమో కాల్ లిఫ్ట్ చెయ్యాలేదు. మెసేజ్ చేద్దాం అని టైప్ చేశా,డిలీట్ చేశా......

    మళ్ళీ టైప్ చేశా,డిలీట్ చేశా......


       ఇలా చేస్తూనే ఉన్న, ఒక్కసారి ఆపి, " ఛ!తనని నేనెందుకు ముందు కలవలేదు, ఇప్పుడు ఎన్ని సార్లు చెప్పాలన్నా నాకు అవకాశం లేకుండా పోయింది" అనుకున్నాను.



       తను ఆఫీస్ కి రాలేదు. సెలవు పెట్టేసింది తన ప్రియుడ్ని కలవడానికి. ఏడుపు అపుకోలేకపోయా, బాత్రూం లో చాలా సేపు ఏడ్చాను. మళ్ళీ వచ్చి పని చేద్దాం అంటే చేత కావట్లేదు. ఎటన్న పోదాం అనిపించింది. 



       ఇంతలో ఎంత కష్టమొచ్చినా నా బాధని దూరం చేసే మందు మా అమ్మ. అమ్మకి ఫోన్ చేశా. చూడాలనిపిస్తుంది వచ్చేస్తా అని చెప్పాను. ఏంటి? శ్రీజ బాగా డిస్టర్బ్ చేస్తుందా? అని అడిగింది. అమ్మ కి అన్ని విషయాలు చెప్పేస్తా, అర్ధం చేసుకుని మంచి చెడులు చెప్తుంది. 


        సరే, వచ్చేసేయ్ అని చెప్పింది. గుర్తు పెట్టుకో, " మనం ప్రేమించిన వాళ్ళ ప్రేమని గౌరవించడం కూడా ప్రేమే అవుతుంది." 


  

        అమ్మ మాటలు నాకు నచ్చాయి. కాస్త కుదురుకున్న. ఇంటికి పోదాం అని బస్ టికెట్ బుక్ చేసుకున్న. రాత్రి పదకొండు కి బస్. 


      

       పని త్వరగా పూర్తి చేసుకుని ఇంటికి బయల్దేరాను. బస్ రావడానికి ఇంకా టైం వుంది. జ్యూస్ తాగుదామని అక్కడే వున్న షాప్ కివెళ్ళాను. ఇంతలో ఫోన్ మోగింది. జ్యూస్ ఒక చేతిలో బ్యాగ్ ఒక చేతిలో. హడావుడి లో ఫోన్ తీసే లోపు జ్యూస్ చేయి జారి కింద పడిపోయింది. ఫోన్ కట్ అయిపోయింది. "చేతికి అందింది ఏది నోటికి అందదు అంటే ఇదేనేమో" అనుకున్నాను.



       చూస్తే ఫోన్ చేసింది మా ఆఫీస్ కొలీగ్ స్వప్న. ఇంత రాత్రి వేళ ఎందుకు చేసిందని తిరిగి కాల్ చేశా.



       ఫోన్ మొగుతుంది. కానీ ఎత్తడం లేదు. కాల్ చేసి మళ్ళీ చేస్తే లిఫ్ట్ చెయ్యవెంటే బొండం ( తను లావుగా ఉంటుంది, ముద్దుగా బొండం అని పిలుస్తాను ) అనుకున్నాను.



       ఇక కట్ చేసేద్దాం అనుకునే లోపు లిఫ్ట్ చేసింది. "ఇందాక చేస్తే ఎక్కడ చచ్చావ్ రా???" అని ఏదో తింటూ అడిగింది. 


       ముందు ఆ నోట్లో మిక్సీ ఆపి విషయం ఏంటో చెప్పమన్నాను. ఐనా సరే అలానే మిక్సీ ఆడిస్తూ, నీ గర్ల్ ఫ్రెండ్ జంప్ అంట కదా!!!!! నీకు తెలీదా?? అని అడిగింది.



       మాటలు ఆగిపోయాయి నాకు. తను "హలో హలో" అంటుంది. నేను కాసేపు కూలిపోయాను. ఎందుకు ఇలా చేసిందో అర్ధం కాలేదు. 


    

       "రేయ్!!!! ఉన్నావా??" అని గట్టిగా అరిచింది స్వప్న. నేను మళ్ళీ ప్రస్తుతానికి వచ్చి ఎప్పుడు జరిగింది ఇదంతా అని అడిగాను.



       "ఏమో!! ఇందాక వాళ్ళ చెల్లి ఫోన్ చేసి ఏమన్నా తెలుసా????" అని అడిగింది. పొద్దున్న తన బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. ఇప్పుడు ఇది కనపడట్లేదు. నా ఊహ కరెక్ట్ ఐతే ఇద్దరు జంప్ అయిపోతుంటారు ఈపాటికి.



       నిజానిజాలు తెలియకుండా ఎలా మాట్లాడతావ్ అలా అని కోపం లో స్వప్న ని తిట్టేసి శ్రీజ చెల్లి నెంబర్ తీసుకున్నాను. 



       ఫోన్ చేసా తనకి. లిఫ్ట్ చేసింది. నేను కిషోర్, శ్రీజ ఆఫీస్ కొలీగ్ మాట్లాడుతున్న. అక్క ఏ టైం నుంచి కనిపించట్లేదు చెప్తావా అని అదిగాను.


  

       సాయంత్రం లేట్ గా ఇంటికి వచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ వచ్చాడు అని తెలుసు మాకు. నాన్న కి అక్కకి పెద్ద గొడవ జరిగింది. వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపేంది. ఎప్పుడు వెళ్లినా ఒక గంటలో మళ్ళీ వచ్చేసేది. ఈరోజు ఎంతకీ రాకపోయేసరికి అనుమానం వచ్చి స్వప్న కి కాల్ చేసి అడిగాను. నాన్న , తమ్ముడు ఇప్పుడే అక్క ని వేతకాడానికి వెళ్లారు. 



       సరే అక్క ఫ్రెండ్స్ అందరి ఫోన్ నంబర్స్ నాకు ఇవ్వు అని అడిగాను. మొత్తం తెలిసిన లిస్ట్ అంతా పంపింది.



        ఇక ఆలస్యం చెయ్యక ఒక్కో నెంబర్ కి కాల్ చేసాను. అందరికి తెలీదు అన్న విషయమే చెప్పారు. అమ్మ కి కాల్ చేశా, విషయం చెప్పాను. రాలేకపోతున్న, శ్రీజ ని కనిపెట్టాలి అని చెప్పాను. 



       ఫ్రెండ్ కి కాల్ చేసి బైక్ తెప్పించుకున్నా. మొత్తం ఫుల్ ట్యాంక్ కొట్టి తను బాధ పడితే తిరిగే ప్రతి చోటు వెతికాను. ప్రతి ఒక్కడని అడిగాను. 


   

       ఒక్కడినే వెతికితే పని కాదు అని నా ఫ్రెండ్స్ ఇద్దరికి ఫోన్ చేసి వాట్సాప్ లో తన ఫోటో పంపాను. మొత్తం బస్ స్టాండ్ లు అన్ని వెతకమన్నాను. శ్రీజ నాన్నగారికి కాల్ చేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వమన్నాను. 



       నాంపల్లి రైల్వే స్టేషన్ కి బయల్దేరాను. అక్కడ అన్ని ప్లాట్ఫామ్ లు వెతికా ఎక్కడా లేదు. ఎంక్విరీ లో అడిగాను కానీ తన జాడ దొరకలేదు.



       బేగంపేట లాస్ట్ ట్రైన్ వచ్చే టైం అయింది. అక్కడికి హుటాహుటిన చేరుకున్నాను. కానీ అప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది. అక్కడే ఉన్న లేడీ కాంస్టేబుల్ ని అడిగాను. ఆమె గుర్తు తెచ్చుకుని ఇప్పుడే ట్రైన్ మిస్ ఐతే సికింద్రాబాద్ బయల్దేరింది అని చెప్పారు.



       తనతో పాటు ఎవరన్న వున్నారా మేడమ్????  అని అడిగాను. ఆ!! ఎవరో అబ్బాయి వున్నాడు తోడుగా అని చెప్పింది ఆవిడ. థాంక్స్ చెప్పి బయల్దేరాను.



      అందరికి కాల్ చేసి స్టేషన్ కి త్వరగా రమ్మన్నాను. స్టేషన్ బయట అందరూ కలుసుకున్నాం. శ్రీజ నాన్న గారు, తమ్ముడిని లాస్ట్ ప్లాట్ఫామ్ లో వెతకమన్నాను. నా ఫ్రెండ్స్ ని మధ్య ప్లాట్ఫామ్ లో వెతకమన్నాను. నేను మొదటి రెండు ప్లాట్ఫామ్ లు వెతకడం మొదలుపెట్టాను.



      అందరూ వెతుకుతున్నారు. బ్లూ టూత్ ఆన్ లో ఉంచమని అందరితో కాన్ఫరెన్స్ లో వున్నాను. కనపడింద?? అని అడిగాను నా ఫ్రెండ్స్ ని. లేదు అన్నారు.



      వాళ్ళ నాన్నగారిని అడిగాను. లేదు అన్నారు.


     

      ఇంతలో చూసి షాక్ కి గురయ్యాను. చేతిలో ఫోను కింద పడేసాను. ఎదురుగా చూస్తే శ్రీజ, తన బాయ్ ఫ్రెండ్ వేరెవరో కాదు మా అన్నయ్య. 🙄


  

      ఇన్నాళ్లు తన బాయ్ ఫ్రెండ్ మా అన్నయ్య నా!!!!


      ఇంట్లో తను ఫోన్ మాట్లాడుతుంటే లాక్కుని ఏడిపించింది శ్రీజ నా!!! ఛ, ఇది తెలియక ఇన్నాళ్లు నేను శ్రీజ పైన మనసు పడ్డానా!!! అనుకున్నాను.



      ఐతేనెం, అన్నయ్య సంతోషం నాకు ముఖ్యం. అందరూ మొదటి ప్లాట్ఫామ్ కి చేరుకున్నారు. శ్రీజ వాళ్ళ నాన్నగారు అన్నయ్య మీదకి చెయ్యి లేపారు. తను మా అన్నయ్య అని చెప్పాను.



      ముందు కోపం తో చెయ్యి లేపారు. తరువాత నేను తనకోసం పడిన వేదన, కష్టం చూసి శాంతించారు. ఇద్దరి మనసులు అర్ధం చేసుకుని పెళ్లి చేశారు వాళ్లకి.



      కానీ అమ్మ కి తెలుసు కదా నా ప్రతి చిన్న విషయం. తనని చూసిన వెంటనే అమ్మ కి కన్నీళ్లు వచ్చేసాయి. నన్ను దగ్గరకి తీసుకుంది. "మనం ప్రేమించిన వాళ్ళ ప్రేమ ని కూడా మనం గౌరవించాలి అమ్మ ". నువ్వు చెప్పిన మాటలే నాకింకా గుర్తు ఉన్నాయ్. తనని ప్రేమించాను. తన ప్రేమని గౌరవించాను అని చెప్పి చాలా పనులు ఉన్నాయమ్మ అనుకుని తన బుగ్గలు రెండు లాగి వెళ్ళిపోయాను. అమ్మ నవ్వేసింది.



       కానీ ఇదంతా శ్రీజ వినేసింది. తనని ఇంతలా ప్రేమించిన నన్ను చూసి ఒక నవ్వు విసిరింది. హృదయం పొంగిపోయింది నాకు. బయట అన్నయ్య వచ్చాడు, అన్నయ్య భుజం పైన చెయ్యి వేసి "కొత్త పెళ్ళికొడుక" రారా అనుకుని ఇద్దరం బయట సరదాగా ఆడుకున్నాం.



       తలుపుకు అటు వైపు అమ్మ, ఇటు వైపు శ్రీజ చూసుకుని మురిసిపోయారు. నా త్యాగం, నా మంచితనం, నా ప్రేమ ఇవన్నీ చూసిన వాళ్ళ కళ్ళు అనందభాష్పలు తో నిండిపోయాయి ....😊


                 

                                                                                             

       


                                                                                    



   



         

        


       


       



        


  

         


  

        


Rate this content
Log in

Similar telugu story from Drama