శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

5.0  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

తల్లి మనసు

తల్లి మనసు

1 min
272  అనీల్ అలిగి కూర్చున్నాడు...!

   

   సీత అదేపనిగా గంట నుంచి పదిహేనేళ్ల కొడుకుని అన్నం తినమని ఎంతగానో బ్రతిమాలుతుంది...!

ససేమిరా తిననంటే తిననని మొండికేశాడు అనీల్.


  "నువ్వాడిని అలాగే బుజ్జగిస్తూ...గారాభం ఎక్కువ చేసి పాడు చేసావు. వాడెప్పుడు డబ్బులడిగితే అప్పుడు నాకు తెలిసి కొంచెం తెలియక కొంచెం వాడి చేతిలో పెట్టడం వల్లే ఇలా తయారయ్యాడు".పెళ్లాంపై విరుచుకుపడ్డాడు శ్రీధర్.

   

  "చాల్లెండి ఊరుకోండి. ఒక్కగా నొక్క కొడుకై ఉండి..చిన్న చిన్న ముచ్చట్లు కూడా తీర్చకపోతే ఎలా చెప్పండి...?" కొడుకుని వెనకేసుకొచ్చింది సీత.

   

  "అంటే...నాకు వాడి మీద ప్రేమ లేదంటావు. వాడిని ఎక్సకర్షన్ కి డబ్బులివ్వలేనందుకే కదా మీబాధ. బాగా చదివించి సరైన తోవలో పెట్టే బాధ్యత నామీదుంది కాబట్టే...నేనింతలా ఆలోచిస్తున్నాను. అసలే ఇప్పుడు వాడిని కాలేజీలో జాయిన్ చేయాలి. బోలెడు ఫీజులు కడితేనే గానీ సీట్లు వచ్చి చావడం లేదు.ఇప్పటికే ఉన్నదంతా ఊడ్చి వాడిని చదివిస్తున్నాను. ఆ టూర్లకవీ పంపించే కంటే...ఆ డబ్బుతో ఏదైనా కోర్స్ చేసినా ఉపయోగం ఉంటుంది. అయినా...విహార యాత్రల్లో ఈ పిల్లకారేమైనా తిన్నగా ఉంటారనా...? నేను చస్తే నయాపైసా కూడా ఇవ్వను. ముందు బాగా చదువుకుని బాగా సంపాదించాకా...ఒక ఊరేంటి..దేశమంతా చుట్టిరావచ్చు.భార్యపై విరుచుకు పడుతున్నాడు శ్రీధర్...


  "బాబూ..ధర్మం చేయండి.." అంటూ ముష్టి వాడి కేక వినేసరికి...

   

  అదిగో... వాడూ అలాగే అడుక్కోవలసి వస్తుంది. చదివు కోవాల్సిన వయసులో సరిగా చదవకపోయినా... వెనకేమీ మనం పోగేసింది లేకపోయినా "- పళ్ళు నూరుతూ మరింతగా కేకలేస్తున్నాడు...

   

  బిక్కచచ్చిపోయి ఉన్న భార్యతో..."వాడు ఒక్కరోజు తినకపోతే...ఏమీ చిక్కిపోడు గానీ... ఆముష్టివాడికైనా పెట్టిరా ఆఅన్నం". కొంచెం పుణ్యమైనా వస్తుంది.

   

   భార్య సీత విసురుగా వెళ్లి కొడుకు కోసం కంచంలో పెట్టిన అన్నాన్ని తీసుకెళ్లి అతనికి ఇవ్వబోతుంటే...ఒక్కఅడుగు వెనక్కి వేసాడు ముష్టివాడు.

   

  'అమ్మా...నాకన్నం వొద్దమ్మా... పది రూపాయలు దానం చేయండమ్మా...అని "ముష్టివాడు అలా అడిగేసరికి...  

   

   "ఏమండోయ్...వీడికి అన్నం పెడితే వద్దంటున్నాడు.  డబ్బులే కావాలంట". పుండు మీద రోకలిపోటులా భర్తకు చురక అంటించి..రుసరుసా వంటగదిలోకి వెళ్లిపోతూ భర్త మొఖం చూసింది.

   

  ఆముదం తాగినట్టున్న ఆముఖాన్ని చూసేసరికి.

 సీతతో పాటూ...అలిగి కూర్చున్న అనీల్ కి కూడా నవ్వాగలేదు. కొడుకు నవ్వేసరికి.. ఆతల్లి మనసెంతగా తేలికపడిందో....!!*

      

         ******   *******   *******


   

   


   Rate this content
Log in

Similar telugu story from Drama