STORYMIRROR

Dr.R.N.SHEELA KUMAR

Drama

2  

Dr.R.N.SHEELA KUMAR

Drama

సత్యం

సత్యం

2 mins
126

అదో పెద్ద కుటుంబం. నలుగురు మొగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అమ్మ జయ నాన్న గణేష్. జయ ఎప్పుడు భర్తతో తాగువాడుతూనే ఉంటుంది పెద్దకొకుకు 4ఏళ్ళకే 5ఏళ్ళని స్కూల్ లో చేర్చారు. ప్రభుత్వ పాఠశాల లో భోజనం గడిచిపోతుంది అని తల్లి ఉద్దేశ్యం. అలానే తరవాత పుట్టిన పిల్లలను నాలుగేళ్ళకే పంపిద్దామనుకంటే స్కూల్ లో ఒప్పుకోలేదు. తండ్రి సపందనంత ఇల్లు గడవటానికి కష్టం గ ఉంటే ఇక జయ ఎక్కడికైనా బంధువుల ఇంటికెళ్లితే చాలు తిరిగి వచ్చి వాళ్ళింట్లో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని పురాణం మొదలు పెడుతుంది. ఇలా కొంత కాలం గడిచింది పెద్ద కొడుకు +2తో చదువు ఆపించి ఓ ప్రయివేటు కాంపెనీ లో చేర్చారు అబ్బాయిలు సంపాదనతో ఇద్దరు ఆడపిల్లలకు ఏదో వచ్చిన సంబంధాలు చేసారు మిగిలిన ముగ్గురు మొగపిల్లలను కాలేజీ చదువు కూడా చదివించారు.

పెద్దకొడుకు సుబ్బు ఇల్లు కొనుక్కొన్న తరవాతే పెళ్లి చేసుకోవాలని పట్టుదలతో బ్యాంకు లోన్ పెట్టిల్లు కొనుక్కున్నాడు. తండ్రి తన చేతిలో లక్ష రూపాయలు పెద్ద కొడుక్కి ఇచ్చారు, తాళ్ళి జయ అప్పుడు అడిగింది మిగిన పిల్లలకి ఇవ్వకుండా మీరు పెద్దోడికే ఏం ఇస్తున్నారు అని, అప్పుడు తండ్రి వాడి రక్తం ధార పోసి ఈ కుటుంబాన్ని గట్టేక్కించాడు, వాడికంటూ ఏమి దాచుకోలేదు నీ మిగిలిన కొడుకులాల కాదు అని చెప్పాడు. తల్లికి మాత్రం అది ఇష్టం లేదు. ఇలా కొంత కాలానికి పెద్దవాడికి పెళ్లయ్యింది పిల్లప్పుడూ ఈ ఇల్లు కొడుకుదే అని చెప్పారు. పాపం సుబ్బు భార్య సీత అది నమ్మింది. పెళ్లయ్యిన నాలుగు నెలలో నెలతప్పింది. అంతే సీత కు కష్టాలు మొదలయ్యాయి. గర్భవతి అయ్యిన దగ్గరనుండి జయ కోడలిని సాధిస్తూనే ఉంది. డెలివరీ చైత్ర మాసం అని చెప్పడం తో చైత్ర మాసం మొదటి బిడ్డ కొడుకు పుడితే ఇంటికి అరిష్టం అని రోజు కోడలిని సాధిస్తూనే ఉంటుంది. గణేష్ కి కోడలిని చూస్తే పాపం అని అనిపించినా ఏమీ చెయ్యలేక 7నెలలోనే సీమంతం చేసి పంపించేసాడు.బిడ్డ ఒక నెల ముందే పుట్టింది. ఆడపిల్ల పుట్టింది. అప్పటికే గణేష్ ఒంట్లో బాగోక పిల్ల పుట్టిన 21 రోజున చనిపోయారు. అంతే అత్తగారు ఆ పిల్లను కనీసం తొంగైన చూడలేదు సారి కద పాపం ఆ పిల్ల కి 5ఏట నుండి తాతయ్యను మింగేసావే అని తిట్టేది. అన్నీ సహించుకొన సీత కుటుంబాన్ని కాపాడుగు ముగ్గురు మరుదులకు పెళ్లిళ్లు చేసింది అందరు ఎవరి కాపరాలు వాళ్ళు చూసుకుంటూ సంతోషంగా వున్నారు జయ మాత్రం మారే లేదు ఎక్కడ ఉన్న తగువులు, ఎప్పుడు చుసిన కోడళ్ళను చూసి నాకు కడుపు మండీ పోతుంది మీరందరు సుఖంగా వున్నారు అని అంటుంది. ముగ్గురు కోడళ్లకు వయసు అవుతుంది పిల్లలు పెద్దయ్యారు, ఇకన అత్తగారిని ఇలా ఊరకనే ఉండనిస్తే మనకి కష్టకాలమే అంటూ నలుగురు కోడళ్ళు కుడబలుకుకొని పిల్లలతో సహా ఒకే రోజు బయటికి వెళ్లి తిరిగి రాలేదు.అంతే జయ పాట్లు ఎవ్వరితోనూ చెప్పలేకుండా పోయాయి. నలుగురు కొడుకులు తల్లిని ఓ మూడు నెలలు చూసుకున్నారు. ఎంత చూసుకొని మాత్రం ఏంటీ ప్రయోజనం జయ అప్పుడు తగువులే పెట్టేది. అప్పుడు నలుగురు కొడుకులు ఓ నిర్ణయం తీసుకొని తల్లిని పిచ్చాసుపత్రి లో చేర్చారు.. అప్పుడు వాళ్ళ వాళ్ళ పిల్లలు, భార్యలతో సుఖంగా వున్నారు. ఎంత మంచి పిల్లలయినా తల్లి గుణం మంచిదయి వచ్చే కోడళ్లలో తమ కూతుళ్ళను చూసుకుంటేనే జీవితం స్వర్గం. ఇదే సత్యం.


Rate this content
Log in

Similar telugu story from Drama