Dr.R.N.SHEELA KUMAR

Drama

3  

Dr.R.N.SHEELA KUMAR

Drama

సంతృప్తి

సంతృప్తి

2 mins
273


అది ఒక ఉమ్మడి కుటుంబం. అమ్మ జయ ఎప్పుడు తండ్రి రాసప్ప ను సతాయిస్తూనే ఉండేది. నలుగురు పిల్లల్ని తిండి పెట్టె స్తొమత లేక మధ్యాహ్న భోజన పధకం ఉండటం వలన పెద్దబ్బాయిని 4ఏళ్ళకే 5ఏళ్ళని చెప్పి స్కూల్ కి పంపేసింది అమ్మ. తండ్రి ఎంతగానో చెప్పాడు వద్దని కానీ అప్పటికీ ముగ్గురు పిల్లలు మీ అమ్మ ఇంత మందిని చూసుకోవటం కష్టం అని చెప్పి బడికి వెళ్లే తీరాలని చెప్పేసింది. ఇంకో రెండేళ్లలో ఇంకో కొడుకు కూడా పుట్టాడు మొత్తం ఒక కూతురు శ్యామల, సుబ్బు, మోహన్, కిరణ్ ముగ్గురు కొడుకులు మొత్తం నలుగురు. రాసప్ప ఏదో ఒక పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వున్నాడు. భార్య జయ ఎప్పుడు అత్తగారితో తగువు పెట్టుకొని భర్త ఆఫీస్ కే వెళ్లిపోయేది. ఇలా కొంతకాలం గడిచింది. పెద్దమ్మాయి ఇంటర్ కి రావటం తో కా దుకు సుబ్బుని 10వతరగతి పరీక్షలు అయ్యిన వెంటనే ఓ పెట్రోల్ బంకు లో పనికి పంపేరు. సెలవులు అయ్యి ఇంటర్ లో చేరినప్పుడు చాలా సంతోషంగా వెళ్ళాడు సుబ్బు. 

 ఆ సంతోషంగా నిలకడగా ఉండేలేదు రెండేళ్ల లో ఇంటర్ పూర్తయ్యిన వెంటనే ఓ ప్రయివేట్ కంపెనీ లో ఉద్యోగానికి చేరాడు అది మూడు షిఫట్లు.1ఏళ్ళకే పనికి వెళ్లి తండ్రి కి చేయూతనిచ్చాడు సుబ్బు. అలానే నాన్నమ్మ పోయిన వెంటనే కూతురు శ్యామల కు 18వ ఎతనే కాలేజీ చదువు ఆపించి పెళ్లి చేసేసారు. ఎంత సంపాదించి తెచ్చి ఇచ్చిన తల్లి జయకు తృప్తి లేని జీవితమే. ఏ ఇంటికైనా వెళితే చాలు ఆ ఇంట్లో అది ఉంది ఇది ఉంది ఇక్కడ మన ఇంట్లో ఏమి లేదు. ఎప్పుడు లేదు అనే పాటే పడేది. ఈ ఏడుపుకు తోడు ఎప్పుడు చుసిన ఆత్మహత్య కు పాల్పడడం ఇదంతా రాసప్పను జీవితం మీదే విరక్తి కలిగించింది. తన 50వ ఎటకే గుండె నొప్పి వచ్చి మరణించాడు. అంతే పిల్లల కు పెళ్లిళ్లు చేసి అందరు వీరింటి కాపరాలు పెట్టుకొని తల్లికి డబ్బులు పంపిస్తు అమ్మను తృప్తి పరచడమే తమ ద్యేయంగా జీవనాన్ని సాగిస్తున్నారు. ఆ తృప్తి అనేది ఎప్పుడు అన్నది ఎవరికీ తెలియదు అది ఒక అన్వేషనే 


Rate this content
Log in

Similar telugu story from Drama