RA Padmanabharao

Drama

5.0  

RA Padmanabharao

Drama

సిమెంట్ దిగ్గజాలు

సిమెంట్ దిగ్గజాలు

2 mins
387


రఘుపతి,రామచందర్ మద్రాసు ఐ.ఐ.టిలో బి.టెక్ 1982లో చేశారు

రఘు ఆంధ్ర నుంచి, రామచందర్ మహా రాష్ట్ర నుంచి వచ్చి ఒకేరూంలో వుండి చెమ్మీలయ్యారు

రఘు కి కుశాగ్ర బుధ్ధి. తన జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన లో పట్టుదల

తండ్రి పరిశ్రమలో బాగా సంపాదించాడు. తన జీవితంలో తానూ మంచి పేరు తెచ్చుకుని పైకి రావాలి అని బలమైన కోరిక

రామచందర్ పేదకుటుంబంనుంచి వచ్చాడు. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే ఏంచేయాలో తెలుసు

కష్టపడి పని చేయడం వల్ల అది సాధ్యపడుతుంది అని నమ్మాడు

కాలేజి చదువు అయిపోగానే రఘు వాళ్ళ నాన్న పెట్టిన శ్రీరాం సిమెంట్ కంపెనీలో చేరి సంతోషంగా మెట్టు మెట్టు పైకి ఎక్కి యం.డి అయ్యాడు

కసితో, పట్టు దలతో మరో సిమెంట్ ఫ్యాక్టరీ కొనేసి సిమెంట్ దిగ్గజాలతో పోటీ పడుతున్నాడు

దూకుడుగా దూసుకొచ్చి కోట్లు సంపాదించి ప్రయోజకు డనిపించు కొన్నాడు.అతడు పట్టింది బంగారం

బిజీ బిజీగా ఫారిన్ ట్రిప్పులు. తండ్రి గతించిన తర్వాత తానే కంపెనీకి సర్వస్వం

తనకు పెళ్లి అయి 30 ఏళ్ళు. కొడుకు సుందరం కాలేజి చదువు మానేసి జులాయిగా తిరిగి డబ్బు ఫ్రెండ్స్ పార్టీ ల పేరుతో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాడు

రఘు తన హడావిడి జీవితం లో కొడుకు గురించి పట్టించుకునే అవకాశం రాలేదు

తల్లి గారాబం చేసి వాణ్ణి నిగమ శర్మ నుచేసి నెత్తి కెక్కించుకొంది

##############

రామచందర్ యర్రగుంట్ల ప్రైవేటు సిమెంట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు

ఆ కంపెనీ ఛైర్మన్ చక్రపాణి తన అమ్మాయి నిచ్చి పెళ్లి చేశారు

కంపెనీ లాభాల బాటలో నడిచింది

రామ్ తన కూతురు స్వప్న ను తాను చదివిన మద్రాసు ఐ. ఐ.టిలో చదివించాడు

రఘు చేసిన సవాల్ తనకు గుర్తుకొచ్చింది , తాను పెద్ద పేరు తెచ్చుకుని పైకి రావాలి. కోట్లు సంపాదించి ఖర్చుపెట్టడం కాక నలుగురికి సహాయపడాలి

రఘు,రామ్ చందర్ లు సిమెంట్ దిగ్గజాలు అయ్యారు

######

టి.వి 2020 ఛానల్ వాళ్ళు old friends అనే ప్రోగ్రామ్ లో రఘు, రామచందర్ ల ప్యానల్ డిస్కషన్ పెట్టారు

యాంకర్ ఉష ఉషా రైన మనిషి

వారిద్దరూ కలిసి చదువుకున్న రోజుల్లో చేసిన సవాల్ గురించి అడిగి నవ్వింది

మీ రిద్దరిలో ఎవరు గెలిచారు? అని రామచందర్ నడిగింది

అతడు వినయంగా నమస్కరించి రఘు విజయమే తన విజయం అన్నాడు

రఘు తల వంచుకొని , 'జీవితంలో నేను ఓడిపోయాను

నా కొడుకు సుందరం భవిష్యత్తు పట్టించుకోని మూర్ఖుణ్ణి -'అని కన్నీళ్లు పెట్టుకున్నాడు

రామచందర్ ఆప్యాయంగా కన్నీళ్లు తుడిచాడు



Rate this content
Log in

Similar telugu story from Drama