Saranya Dhurbhakula

Crime

4.1  

Saranya Dhurbhakula

Crime

రక్షణ

రక్షణ

3 mins
244


అనన్య సోమయాజి ఒక న్యూస్ ఛానల్ లో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తోంది. ఆమె తండ్రి ప్రకాష్ సోమయాజీ ఛార్టర్డ్ అకౌంటెంట్. తల్లి నిర్మల గృహిణి. ఆమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. అతని పేరు రితేష్. అతను బీ.టెక్ చదువుతున్నాడు. అనన్య వాళ్ళది ఒక చిన్న కుటుంబం చింత లేని కుటుంబం.


 ప్రతి రోజులాగే, అనన్య తన షిఫ్ట్ పూర్తి అయిన తరువాత, ఇంటికి బయలుదేరింది. సమయం రాత్రి పదకొండున్నర అయింది. ఆఫీస్ క్యాబ్ అప్పటికే వెళ్ళిపోయింది. ఆమె ఒక ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకోవాలని అనుకుంది. తన ఫోన్ లో ఓలా, ఉబర్ చూసింది. ఆ సమయంలో క్యాబ్‌లు ఏవీ అందుబాటులో లేవు. ఆమె ఆఫీసు నుండి బయటికి వచ్చి టాక్సీ కోసం చూసింది. ఒక్క ఆటో కానీ టాక్సీ కానీ కనిపించలేదు. మెయిన్ రోడ్డుకు వెళితే ఏదైనా ఆటో లేదా క్యాబ్ దొరుకతుందేమో అని అటు వైపు నడవడం ప్రారంభించింది. ఆ వీధి మొత్తం ఖాళీ గా ఉంది. వీధి దీపాలు కూడా సరైన స్థితిలో లేవు. ఆమెకు భయం వేసింది. మెయిన్ రోడ్ వైపుకి వేగంగా నడిచింది. 


అకస్మాత్తుగా ఆమెకు ఏదో చప్పుడు వినిపించింది. ఆమెను ఎవరో అనుసరిస్తున్నారని అనుకుంది. తన చేతిలోని బ్యాగ్ నుండి స్కార్ఫ్ తీసుకొని ముఖాన్ని కప్పుకుంది. KTM డ్యూక్ 120 బైక్‌లో ఇద్దరు కుర్రాళ్ళు ఆమె వెంట పడటం ప్రారంభించారు. వాళ్ళు గట్టి గట్టిగా అరుస్తూ అనన్య దగ్గరకి వచ్చారు. బైక్ హెడ్‌లైట్‌లను ఆపేశారు. చీకటిలో వారి ముఖాలు ఆమెకు సరిగా కనిపించలేదు.వాళ్ళు ఆమెను ముందుకు పోనివ్వకుండా అడ్డు పడ్డారు.


ఆమె చుట్టూ బైకు మీద చక్కర్లు కొడుతూ అసభ్యంగా మాట్లాడుతున్నారు. వారిలో ఒకడు ఆమె చెయ్యి పట్టుకున్నాడు, మరొకడు ఆమెను తాకడానికి ప్రయత్నించాడు. ఆమె ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని, శక్తినంతా కూడగట్టుకుని వాళ్ళని గట్టిగా త్రోసేసింది. వాళ్ళు కింద పడిపోయారు. వాళ్ళ నుండి తప్పించుకోవడానికి వేగంగా పరిగెత్తింది. మెయిన్ రోడ్డు పై ఒక ఆటోను చూసింది. వెంటనే ఆటోలో ఎక్కి అక్కడి నుండి తప్పించుకుని ఇంటికి చేరుకుంది.


తల్లిదండ్రులకు ఏమీ చెప్పలేదు. జరిగినదంతా మనసులోనే పెట్టుకుని తన గదిలోకి వెళ్లి, తలుపు వేసుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రంతా ఆ భయంకర సంఘటననే తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చుంది.


మరునాడు ఉదయం రితేష్ ని పిలిచి రాత్రి జరిగినదంతా చెప్పి బోరున ఏడ్చింది. "నువ్వేం భయపడకు. ఈ రోజు నీకు తోడుగా నేను వస్తాను. వాళ్ల సంగతి చూస్తాను. నువ్వు భయపడకుండా ఆఫీసుకు వెళ్ళిరా", అని దైర్యం చెప్పాడు రితేష్. కొంతసేపటికి కాలింగ్ బెల్ మ్రోగింది. నిర్మల తలుపు తెరిచి చూస్తే, బయట పోలీసులు నిలబడ్డారు. ప్రకాష్, నిర్మల ఒక్కసారిగా షాక్ అయ్యారు.  


సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బైకుని ట్రేస్ చేసి ఒక అబ్బాయిని అరెస్టు చేశామని, మరొక వ్యక్తి ఎవరో కాదు రితేష్ అని పోలీస్ ఇన్స్పెక్టర్ అనన్యకు చెప్పాడు. అతన్ని అరెస్టు చేయడానికి వచ్చామని చెప్పాడు. ఆ మాట విని అనన్య షాక్ అయింది.ఆమె మనసు ముక్కలైంది. ఏమి జరుగుతుందో ఆమె తల్లదండ్రులకు అర్థం కాలేదు. రితేష్‌ను వెతుక్కుంటూ పోలీసులు ఇంటి లోనికి వెళ్ళారు. అతని గది లోపలి నుండి లాక్ చేసి ఉంది. వారు తలుపులు పగలగొట్టారు, చేతిలో కొన్ని మాత్రలతో రితేష్ నేలమీద పడి ఉన్నాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతను ప్రాణాలతో బయటపడ్డాడు.



ఆ రోజు సాయకాలం ఆసుపత్రిలో, రితేష్ మంచం మీద పడుకున్నాడు, అనన్య , ప్రకాష్ , నిర్మల అతని పక్కన నిలబడి ఉన్నారు. రితేష్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. "అది నువ్వేనా రితేష్?" ఏడుస్తూ అడిగింది అనన్య . "ఉదయం ఆ సంఘటన గురించి నువ్వు చెప్పినపుడు అది నువ్వే అని నాకు తెలిసింది. నేను చాలా భయపడ్డాను. నన్ను క్షమించు అక్కా. అది నువ్వని నాకు తెలిసుంటే అలా జరిగేది కాదు" అని ఏడుస్తూ సిగ్గుతో తల దించుకున్నాడు. "నా స్థానంలో వేరే అమ్మాయి ఉంటే ఇలా చేస్తావా, ఆ అమ్మాయికి ఒక కుటుంబం, పరువు ఉంటాయి కదా?" కోపంగా అడిగింది అనన్య. ఆ ప్రశ్నకు రితేష్ దగ్గర సమాధానం లేదు. నిర్మలా, ప్రకాష్ కొడుకుని సరిగా పెంచలేదని బాధతో కుమిలిపోయారు. అనన్య తన తమ్ముడు ఆడపిల్లలని వేధించే ఒక ఆకతాయి అని తెలిసి అసహ్యంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. అతడి ఆలోచనా విధానం చాలా చెడిపోయింది. అతను తన తల్లిని గౌరవిస్తాడు తన సోదరిని ప్రేమిస్తాడు. కానీ ప్రతి అమ్మాయి మరొకరి కూతురు, సోదరి లేదా స్నేహితురాలు అన్న విషయం అతను మరచిపోయాడు. నిజానికి రితేష్ లాంటి వాళ్ళు సమాజం లో చాలా మంది ఉన్నారు. వారి ఆలోచనా విధానం మారాలి. అంతవరకు మనం ఇంకా ఎందరో నిర్భయలను, దిశలను చూడక తప్పదు.


మీరు మీ తల్లి, సోదరి మరియు కుమార్తెలను ప్రేమించే ముందు ప్రతి అమ్మాయిని గౌరవించండి. వారి ఆత్మ గౌరవాన్ని రక్షించండి.


Rate this content
Log in

More telugu story from Saranya Dhurbhakula

Similar telugu story from Crime