Dr.R.N.SHEELA KUMAR

Drama

4  

Dr.R.N.SHEELA KUMAR

Drama

పట్టణం పోతాము రో

పట్టణం పోతాము రో

1 min
722


ఈ సువిశాల భూ ప్రపంచములో మాది ఓ చిన్న స్వర్గభూమి, ఎక్కడ చుసిన పొలాలు, చెరువు, నది అది చూడడానికే కే ఈ రెండు కళ్ళు చాలవు. వేంకన్న వ్యవసాయ కుటుంబం నకు చెందిన వాడు ఇద్దరు కూతుర్లు. వ్యసాయం చేస్తూ పిల్లలని బాగా చదివించు కుంటున్నాడు. పెద్దమ్మాయి శృతి ఇంజినీరింగ్ ముగించుకొని పట్టణంలో ఉద్యోగం చేస్తుంది చిన్నమ్మాయి అదే పట్టణంలో C. A. coaching కి వెళుతుంది ఇద్దరు నాన్ను అమ్మని తీసుకొని నువ్వు పట్టణం వచ్చేయి. అందరం కలిసే ఉందాం అన్నారు తల్లి చాలా సంతోషంతో భర్త తో మనము వెళ్లిపోదాం అంటూ రోజు చెప్పేది. తండ్రి నేనక్కడకు వస్తే వ్యవసాయం ఎవరు చేస్తారని అడిగేడు, వెంటనే ఇద్దరామ్మాయిలు ఒకే ఖంఠ ముతో నువ్వు కష్ట పడింది చాలు భూమిని కౌలకిచ్చేద్దాం అని చెప్పి ఒప్పించి అందరు పట్టణానికి వెళ్లారు. తల్లి ఓ నెలరోజులు సంతోషం గా గడిపింది కానీ తండ్రికి ఒక్క రోజు కూడా నిద్ర పట్టలేదు. కొన్ని రోజుల తరవాత పట్టణంలో వర్షాలు లేక నీటికి చాలా ఇబ్బంది, దానికి తోడు flat కాలేచారమాయే ఇరుగు పొరుగు ఎవ్వరితోనూ మాట్లాడక పోవడంతో అమ్మకి చికాకుగా ఉండేది. తండ్రికి పాపం తన పొలాల మీద ద్యాస వెళ్ళిపోయింది. వెంటనే అది గమనించిన భార్య ఏమండీ మీరింతల భాధ పడొద్దు మనం మన ఊరికే వెళదాం. పిల్లలు మాత్రం ఇక్కడ ఉందనీయండి అంటూ సామానులు సరధేసింది అంతే 60ఏళ్ళ తండ్రి 16ఏళ్ళ కుర్రవానిలా గెంతుతూ ఇద్దరు పల్లెకు ప్రయాణమయ్యారు. వెంకయ్య తన పొలములో సంతోషముగా పనిచేస్తూ భార్య సుమ ఇంటి పనులు చేస్తూ ఇరుగు పొరుగు వాళ్లతో సంతోషంగా కాలాన్ని గడిపారు 


Rate this content
Log in

Similar telugu story from Drama