STORYMIRROR

Narra Pandu

Comedy Romance Fantasy

4  

Narra Pandu

Comedy Romance Fantasy

ప్రేమలేఖ

ప్రేమలేఖ

1 min
304

ప్రియాతి ప్రియమైన సుగంధ ద్రవ్యాలతో ప్రతిక్షణం పరిమళింపచేసే సంతూర్ సబ్బుకి నీ యొక్క సంస్కారవంతమైన ప్రియుడు త్రిపుల్ ఎక్స్ నురగతో వ్రాయు ప్రేమలేఖ ఏమనగా


ప్రియా నిన్ను చూసిన మరుక్షణమే నేను సబ్బుగా జన్మించాను.


నువ్వు అమ్మాయిల అందాన్ని యవ్వనంలా చూపిస్తుంటే నేను దుస్తుల మాలిన్యాలను తొలగించడం నేర్చుకున్నాను.


ఓ నా ప్రియమైన సంతూర్

నురగ ఇవ్వని నేను నీ సుతిమెత్తని శరీరాన్ని తాకాలనీ నేను సంస్కారవంతమైన సబ్బుగా నీకోసం గుర్తింపు తెచ్చుకున్నాను.  


ప్రతిసారి నీ యాడ్ లో అమ్మాయిలను చూపిస్తుంటే ఎక్కువ నురగ ఇవ్వటం మొదలు పెట్టాను.


మనమిద్దరం ఒక్కసారి కూడా కలుసుకోలేకమని నాకు తెలుసు 


అయిన


నీకోసం నేను ఎన్నిసార్లైనా నీళ్లల్లో మరణించి మళ్ళీ జన్మిస్తూనే ఉంటా


ఒక్కసారైనా నీతో కలిసి నీళ్లల్లో కరిగిపోవాలని కోరుకుంటూ...


నురగతో

నీ సంస్కారవంతమైన సబ్బు

త్రిపుల్ ఎక్స్.


✍️నర్ర పాండు రావణ్ మహరాజ్ అశ్వగోష్ బుద్ధ



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Comedy