STORYMIRROR

Thorlapati Raju

Comedy Drama Others

4.7  

Thorlapati Raju

Comedy Drama Others

ప్రేమ పావురాలు..

ప్రేమ పావురాలు..

3 mins
701



చెట్టు మీద ఉన్న పావురాల జంట ఇలా సంభాషించు కుంటున్నాయి...

వాటి పేర్లు...

ఆడ పావురం పేరు...అప్పియమ్మ!

మగ పావురం పేరు..అప్పారావు!

ముద్దుగా...

అప్పియమ్మ్మ నీ...అప్పీ..అని

అప్పారావు నీ.. మావ అని పిలుచుకుంటు ఉంటారు


అప్పియమ్మా:


మావా...నాకు నువ్వంటే... సానా ఇట్టం మావ

మనిద్దరం అలా అలా..ఆకాశం లో..కలిసి హాయిగా ఎగురుతూ ఉంటే..ఏమనిపిత్తాదో

తెలుసా...


అప్పారావు:


నాకెలా తెలుత్తాదే అప్పి...నువ్వు సెప్పి


ఆప్పి:


నాకు ఏమనిపిత్తాది అంటే..

నువ్వేమో దట్టంగా ఉన్న మేఘం అంట మావ

నేనేమో..మేఘం నుండి జారిపడే సినుకు నంట!


అప్పారావు:


ఏంటే... ఆప్పీ..నేనేమో దట్టమైన మేఘాన్న...

నువేమో .. జారిపడే సినుకువ..

ఇంకెక్కడ వుంటాదే దట్టమైన మేఘం..

నువ్వు జారి పడగానే..మేఘం మటాషు

ఆడ దానివి అనిపించుకున్నావో లప్పి!

నువ్విలా...జారిపడగా..నే...నీ ఎనాకమాలే

ఎగురుకుంటూ వచ్చేయాలి అన్న మాట...


అప్పి:


ఏంది మావ..అట్టనేసావ్ నువెక్కడుంటే నేను అక్కడ్నే కదేటి... సర్లే గానీ నీ సరసం

ఇంతకు నీకేటి అనిపిత్తాదో సెప్పు మావ!


అప్పారావు:


అప్పే...నాకు నువ్వంటే సానా ఇట్టమే

నువ్వు అడగ్తాంటే మెదడులోకి వచ్చినాదే

రేతిరి నువ్వు పండుకున్నక సాటిలైట్ సిగినల్ నుండి ఒక తెలుగు సినిమా చూసినానే


అప్పి:


అవునా మావ...ఏమ్ సినిమా ఏటి!


అప్పారావు:


మన పేరే పెట్టుకున్నరే ఆల్లు కూడా...

పేమ పావురాలు! అంట

అందులో పాట యాదికొత్తాందే...


అప్పి:


యే పాట మావ పాడు మావ..పాడు..మావ!


అప్పారావు:


పాడుతానుండవే....నా అందమైన... అప్పి!

.....నీ జత నేక..పిచ్చిది కాదా...మనసంతా.. ఆ..

   నా మనసేమో...నా మాటే...ఇనదంటా..ఆ!


అప్పి!


అబ్బ...ఏమ్ పడినవ్ మావ! మనం

పావురాలం అయినా..నువ్వు మాత్రం కోయిల లా.. పాడినవ్ లే! మావ పాటే ఇంత సక్కగా ఉందంటే గా సినిమా ఇంకెంత ముచ్చటగా ఉంటాదో ఓ పాలి..గా కతెందో చెప్పు మావ!


అప్పారావు:


ఆప్పే...యే సినిమా సూసిన ఏమున్నది గర్వకారణం..పేముకుల్ని ఇడగొట్టే దారుణం తప్ప! ఈ సినిమాలో కూడా పేమ పావురాలు రెండీ..టినీ ఇడదీయడమే!


అప్పీ:


అవునా..మావ..అయిన సినిమాలోనే కదా...మనకెందుకు లే మావ!


అప్పారావు:


సినిమా నోనే...కాదు అప్పి! బయట కూడా... అంతే ఈ మనుషులు.

కిందటి ఏడు లోనే..కదా..ఆంధ్ర పదేశ్ లో 

ఓ తండ్రి తన కూతుర్ని పేమించి పెళ్లి చేసుకున్నాడు అని..ఒక కుర్రోడుని.. అంటే ఆల అల్లుడ్ని నరికించేసాడు. పాపం ఆల కూతురు ఏమో చిన్న వయసులోనే విధవరాలు అయిపోయింది.


అప్పి:


అయ్యో మావ ఎంత పని సేసాడు . ఏమైంది రా ఆడికి అల్లుడిని సంపుకున్నాడు.ఎందుకు మావ.. అలా సేసిండు?


అప్పారావు:


అవునే..అప్ప్పి నువ్వు సెప్పింది నిజమే..వాడికి నిజంగా ఏదో అయిపోనాది . ఆల ఆల్లుడు ఆళ్ళ కులపోడు కాదని నరికేయించిండు.


అప్ప

ి:


కులపోడా అంటే...ఏంటి మావ?


అప్పారావు:


అదొక రోగం పేరే... చాలా ఏళ్ల నుండి ఉందంట పాపం అందుకే.. అలా సేసిండు.


అప్పి:


అవునా..మావ అయ్యో..

అయినా..ఆడికి రోగం వత్తే.. ఆడు కదా సావాలా

అల్లుడిని ఎందుకు సంపిండు? చాలా ఏళ్ళ నుండి అంటున్నావ్ గంద ఇపుడొచ్చిన కరోనా లాగ నా..మావ!


అప్పారావు:


కాదే అప్పి..కరోనా ఈ మధ్యన వచ్చినాదే

ఆడికి వచ్చిన రోగం..చాలా కాలం ముందు నుండి ఈ పపంచంలో... కరోనా కైన ఒక ఏడాది లో మందు కనిపెడతారేమో గానీ...అప్పి ఈ రోగానికి మందు ..ఎప్పటికీ రాదు.


అప్పి:


ఎందుకు మావ ఆ మందు..అంత పెద్ద దా..?


అప్పారావు:


కాదే..దానికి మందు ఎవరికీ కనబడదు...ఎందుకంటే.. ఆ రోగానికి మందు..ఆళ్ళ దగ్గరే ఉందే... వాళ్ల మనసే దానికి మందు.


అప్పి:


మరి...మావ అల్లుడిని సంపిండు కదా..అతను..రోగం నయం అయిందా పోనీ


అప్పారావు:


ఒసే.. అప్పి ...

ఈ మనుషులు మా సెడ్డ మంచోల్లే

ఎందుకంటా వా...ఎవరో ఒకరు సత్తే గానీ..శాంతించరు . పాపం అల్లుడు పోయాక..కూతురి పై పేమ మళ్లీ పొంగుకొచ్చింది

కూతురేమో..రానివ్వదు

 పాపం పేమ దొరకక శాంతి లేక..అశాంతితో

అతను కూడా పైకి పోయిండే. అప్పి ఈయనే కాదే పపంచం లో గొప్ప గొప్పోల్లు అందరూ ఎంతో మంది చావు సూసాక గానీ శాంతించలేదు.. మన అశోకుడు ఉన్నాడు గందే

ఆయన కూడా అంతే..ఆయన కళ్ళెదురుగా లక్షల మంది పాణాలు పోయి రక్తం యేరు నాగ కారతా ఉంటే... అప్పుడు..ఆయన మనసు నలిగిపోయి శాంతి కావాలా అని బయలుదేరి నాడు.

  ఓలప్పి... ఈ మనుష పపంచకం భలే విడ్డూరమైనదే ..

మొదటి నుండి...తప్పులు చేసి..ఒక్కసారిగా మారిపోయి మంచి సేస్తే... అడ్ని హీరో అంటది

 పాపం మొదటి నుండి ఎంతో సక్కగా ఉండి మంచిగా ఉండి ఏదో పరిస్థితుల వల్ల తప్పు సెస్తే... ఆడ్ని జీరో సేస్తాదే.


అన్ని:


మావ...మంచి అయిన సెడు అయిన..మనిషి తను మారాలి అనుకుంటే నే...మారుతాడు మావ..అందుకే...ఆళ్ళ దగ్గర పేమా శాంతి లేకనే...


మనల్ని... పేమకి మధ్యవర్తి.గా. శాంతి కి చక్రవర్తి గా..సేసిండు.

  సరే గానీ మావ నువ్వు బయటికి ఎల్లినపుడు

నేను కూడా ఒక పాట సుసిన అలా మనం ఉందాం మావ!


అప్పారావు:


అవునా... మరి సెప్పవెం అప్పి సెప్పు అలా సేసేద్దాం.


అప్పి:


మావ నేను లారీ డ్రైవర్ .. మన బాలయ్య బాబు సినిమా సూసిన అందులో ఒక పాట...

నీకోసం మే ఉంటాది మావ...

  మావా...మంచమెక్కు ..మావా..మంచమెక్కు


అప్పారావు:


ఎందే... అప్పి నా పాణాలు తీసేస్తవా ఏంది..ఇపుడు మంచమెక్కడం ఏందే

నా బతుకు తో సెలగాటం ఆడకే..

అసలే.. నడుం జారిపోతండాది.


అప్పి:


అబ్బా...మావ...సాల్లే మావ నీ మోటు సరసం

నేను ఆ పాట సూసిన అందులో మావ ఆ అని వచ్చినాది అని సెప్తాండ..


అప్పారావు:


అప్పి...నువు దేవతవే... బతికించావే..

నేకపోతే ఇప్పటికే... కూసాలు కదిలిపోతున్నాయే...తల్లి!


          ....రాజ్.....



Rate this content
Log in

Similar telugu story from Comedy