Parimala Pari

Tragedy

4.5  

Parimala Pari

Tragedy

ప్రేమ ఇచ్చిన స్ఫూర్తి తో

ప్రేమ ఇచ్చిన స్ఫూర్తి తో

2 mins
694నా జీవితంలో కలిగిన చేదు అనుభవం ఈరోజు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నా పేరు అశోక్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే దాని మీద నమ్మకం లేదు నాకు ఎప్పుడూ.


అసలు ప్రేమ అంటేనే నమ్మకం లేదు. అలాంటి నా జీవితంలోకి అడుగు పెట్టింది అర్పిత. ఆరేళ్లుగా మా ఇంటి దగ్గర్లోనే ఉంటున్నా, తనని రోజు చూస్తూనే ఉన్నా ఆ భావన ఎప్పుడు కలగలేదు.


నేను జాబ్ సెర్చింగ్ చేస్తూ పనిలో పనిగా NGO లోనూ పని చేస్తున్నా. NGO తరపున ఒకసారి వృద్దఆశ్రమానికి వెళ్ళాను. ఆశ్చర్యం తను నా కన్న ముందే ఉంది అక్కడ.


పిల్లలు లేని, వదిలేసిన ఆ తల్లి తండ్రుల గురించి మంచి చెడ్డలు కనుక్కుంటూ, వారికి తన చేత్తో సాయం చేస్తూ ఉంది. మంచం లో ఉన్న ఒక ఆవిడ కి అయితే తన చేత్తో కలిపి నోట్లో పెట్టింది అన్నం.

అలా తనని చూడగానే మనసులో ఆమె పట్ల ఆరాధన కలిగింది. నిజంగా అలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది నాకే. అక్కడ తను నన్ను చూసి పలకరించింది. ఆమెని తదేకంగా చూసాను నేను.


నా కళ్ళల్లో ఆమె పట్ల గౌరవం, ఇష్టం కనిపించాయి తనకి ఆ చూపులో..


ఇలా ఉంటే నీకు ఇష్టమే కదా అని అడిగింది. మాకు అర్థం కాలేదు ఒక్క క్షణం. మళ్లీ తనే నీకు ఇష్టం అనిపించేలా చేయటానికి ఇంత చేశాను, ఇన్నాళ్లు చూసాను అంది.


అప్పుడు అర్ధం అయ్యింది. అంటే తను ముందు నుంచే నన్ను ఇష్టపడుతుంది. నేను అందరిలాంటి వాడిని కాదు అని తెలిసి, నాకోసం నాతో పాటు న్జీవో లో చేరి ఇలా సేవలు చేస్తోంది అందరికీ. అది తెలిసిన మరు క్షణమే తను నా ప్రాణం అయిపోయింది.


అలా ఇద్దరం కలిసి ఎన్నో ఆశ్రమాలు, ఆర్ఫానేజ్ లకి వెళ్లే వాళ్ళం, అక్కడ అందరితో సరదాగా మాట్లడు తూ వాళ్ళ మంచి చెడులు చూసేది అర్పిత. తన పట్లఅంకితభావం రాను రానూ పోరిగిపోయింది నాకు.


అలా మా ప్రయాణం ఒక 4 సంవత్సరాలు సాగింది. మేము ఇద్దరం ఒకరితో ఒకరు ఐ లవ్ యూ ఎప్పుడు చెప్పుకోలేదు. కానీ ఒకరికి ఒకరుగా ఉన్నాం. ఎక్కువగా ఎన్జీవో లోనే కలుసుకునే వాళ్ళం.

అందరి ప్రేమికుల లాగా పార్క్ కి, సినిమాలు, షికార్లు అంటూ తిరిగింది లేదు.


ఒకరోజు తను నన్ను అడిగింది మనం పెళ్ళి చేసుకుందామా అని.


ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాం అనుకున్నాను. ఆరోజు ఎన్జీవో నుంచి తిరిగి వస్తూ ఉండగా తనకి ఏక్సిడెంట్ అయ్యింది. తీవ్రంగా తలకి గాయలవటం తో తను అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అది చూసిన నేను తట్టుకోలేక పోయాను. తనతో పాటు నేను ఉంటే బాగుండేది అనిపించింది.


తనని ఒంటరిగా వెళ్ళనిచ్చి నందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. కానీ ఎన్ని అనుకున్నా ఏం లాభం? తను తిరిగిరాదు ఇక.


నా జీవితంలో తను ఇంక లేదు అన్న చేదు నిజం నేను నమ్మలేకపోయాను. కానీ కాలక్రమేణా ఆ చేదు నిజం నాలో పాతుకు పోయింది. అప్పటి నుంచి ఎన్జీవో లకై వెళ్ళటం మానేశాను. ఒంటరిగా ఉండే వాడిని. తనని నాకు దూరం చేసిన ఆ భగవంతుడి పట్ల కోపం పెరిగింది, అయిష్టత ఏర్పడింది..


కోపం ఎవరి మీద చూపించాలో తెలిసేది కాదు. నాలో నేనే కుమిలిపోతూ ఉండేవాడిని. ఇది జరిగి ఇప్పటికీ 2 సంవత్సరాలు దాటింది. కానీ ఇప్పటికీ తన రూపం నా గుండెల్లో ఉంది, తను నాకు లేదు అన్న ఆ చేదు నిజం మా నరనరాల్లో జీర్ణించుకుపోయింది.


ఇక ఈ జీవితానికి తను మిగిల్చిన జ్ఞాపకాలు చాలు, తను వదిలి వెళ్ళిన అడుగుల సడి నా మనసుకి ఇంకా వినిపిస్తూనే ఉంది. అదే ఆలోచనలతో, అవే జ్ఞాపకాలతో ఈ జీవితం గడిపేయాలి అని నిర్ణయించుకున్నాను.


నా నిర్ణయాన్ని చాలా మంది మార్చుకోమని చెప్పారు, కానీ నేను మాత్రం తనకి అంకితం చేసిన నా జీవితం లో వేరొకరికి స్థానం ఇవ్వలేను. ఇక ఈ జీవితానికి ప్రేమ ఇచ్చిన స్ఫూర్తి తో ఇలా గడిపేస్తాను...


శెలవు.


Rate this content
Log in

Similar telugu story from Tragedy