Lahari Mahendhar Goud

Horror Tragedy Inspirational

4  

Lahari Mahendhar Goud

Horror Tragedy Inspirational

నిరీక్షణ ఫలితం ఇలా ఉండొద్దు

నిరీక్షణ ఫలితం ఇలా ఉండొద్దు

3 mins
361


 

గత వారం రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పు కారణంగా అదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రలు తీవ్రంగా పడిపోయాయి

పగటి సమయంలోనే 11 నుండి 13 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే ఇంక రాత్రుళ్ళు ఎలా ఉంటుందో చెప్పనవసంలేదు

మరీ ముఖ్యంగా తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అయితే రక్తంతో పాటు ఎముకలు కూడా గడ్డ కట్టించేంతటి చలి తీవ్రత పెరగటంతో

పాఠశాలలకు వారం పాటు అత్యవసర సెలవులు ప్రకటించారు కలెక్టర్ గారు.... అంటూ చెప్పుకుంటూ పోతోంది వార్తలు చదువుతున్న న్యూస్ రీడర్

ఆ న్యూస్ పూర్తి అవటంతోనే అపుడే ఇంట్లోకి అడుగు పెట్టాడు రితేష్

డాడీ

ఒరేయ్ రితేష్

రేపటి నుండి ఎటు తిరిగినా సాయంత్రంలోపు నువ్వు ఇంట్లో ఉండాల్సిందే

ఇప్పుడే న్యూస్ చూసా మన డిస్టిక్ లో చలి ఏ రేంజ్ లో ఉందో

రితేష్

కామన్ డాడీ న్యూస్ చూసి భయపడి నన్ను తోరగా రమ్మంటున్నారా

రక్తం సల సలా మరిగే 27 ఏళ్ల వయసులో ఉన్నాను

అలాంటి చలి గాలులు నన్ను ఏమీ చేయలేవు కానీ

మీరు ముందు ఆ న్యూస్ చూడడం ఆపేయండి

ఇంతుంటే ఇంత చెప్తారు ఈ న్యూస్ ఛానెల్స్ వాళ్ళు...

డాడీ

న్యూస్ చూసి కాదురా

నిన్ను తోరాగా రమ్మంటున్నా వస్తావా రావా అది చెప్పు

రితేష్

సరే డాడీ ఏదైనా వర్క్ ఉంటే తప్ప

మాక్సిమం మీరు చెప్పినట్లే ఈవెనింగ్ లోపు ఇంట్లో ఉండటానికి ట్రై చేస్త ఇప్పుడు హ్యాపియా

డాడీ మనసులో

నాకు తెలుసురా పుత్ర రత్నం నిన్ను ఎలా లాక్ చేయాలో అని విజయ గర్వంతో నవ్వుకున్నాడు

రెండు రోజుల తర్వాత సరిగ్గా తెల్లవారుజామున 4:10 కి రితేష్ ఫోన్ మోగడంతో రితేష్ తో పాటు వాళ్ళ డాడీ కూడా మేలుకున్నాడు

ఫోన్ మాట్లాడుతూనే రితేష్ హడావుడిగా షార్ట్ నుండి నైట్ పాంట్ కి మారటం గమనించిన వాళ్ల డాడీ

డాడీ

ఏమైందిరా

ఎవరు ఫోన్ లో

ఎక్కడికి బయలుదేరావు

రితేష్

మన ఆనంద్ గాడికి ఆక్సిడెంట్ అయిందంట డాడీ

వాడి ఫోన్ లో నా నంబర్ చూసి

దారిన పోయే వాళ్ళు కాల్ చేశారు

డాడీ

ఆక్సిడెంట్ హా ఎలా జరిగింది

అయినా నువ్వు ఇంత చలిలో వెళ్తావా

అంబులెన్స్ పంపిస్తే సరిపోతుంది కదా నాన్న

రితేష్

డాడీ మీకు ఇప్పుడు నేను ఏం చెప్పినా అర్థం కాదులే కానీ

అంటూ వెళ్తున్నాడు

అప్పటికే రితేష్ గుమ్మం వరకూ రావటంతో

రితేష్ వాళ్ళ డాడీ తన మొహానికి ఉన్న మంకీ క్యాప్ తీసి రితేష్ కి ఇచ్చి జెర్కిన్ తేవటానికి లోపలికి వెళ్ళి వచ్చే లోపున రితేష్ వెళ్లిపోవడంతో

బిక్కు బిక్కుమంటూ రితేష్ కోసం వెయిట్ చేస్తూ వాళ్ళ డాడీ అక్కడే సోఫాలో కూర్చుండిపోయారు

ఫ్రెండ్ కి ఏమవుతుందో అనే కంగారులో రితేష్ చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నాడు

స్పోర్ట్స్ బైక్ అవటంతో వెంగంగా వీస్తున్న గాలిని చీల్చుకుంటూ దూసుకుపోతుంది బైక్

కొద్ది దూరం వెళ్ళాక గేర్ చైంజ్ చేయాలి అని ఎంత ప్రయత్నించినా రితేష్ వల్ల కాకపోవడంతో

బైక్ ని అలాగే ఆపేసి దిగడానికి ప్రయత్నించగా అతని బాడీ మొత్తం చలికి ఫ్రీజ్ అయి రితేష్ ఎటూ కదిలించలేని పరిస్థితికి వచ్చేశాడు

అలా

క్షణాలు నిమషాలు అయ్యాయి

నిమిషాలు గంటలుగా మారుతుండటంతో

ఇప్పుడు అతని గొంతులో నుండి మాట కూడా చాలా చిన్నగా వస్తుంది

పాల క్యాన్స్ తో ఎన్నో బైక్స్ పోవటం రితేష్ కి తెలుస్తోంది కాని

అతను పిలిచే పిలుపు వాళ్ళను చేరటం లేదు

అలా ఒక పాల బైక్ అతను వెళ్లేప్పుడు చూసినా అతని పని తొందరలో అప్పుడు చూస్తూ వెళ్ళిపోయినా

తిరుగు ప్రయాణంలో బైక్ లో పెట్రోల్ కానీ అయిపోయిందా అని పలకరించగా

చాలా చిన్నగా రితేష్ మాటలు వినపడటంతో

వెంటనే అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకెళ్లగా

డాక్టర్స్ పరిశీలించిన తర్వాత

రితేష్ వాళ్ళ డాడీని పిలచి

తీవ్రమైన చలి వల్ల మీ అబ్బాయి నర్వస్ సిస్టం దెబ్బతిన్నది

మూడు రోజులు గడుస్తే గానీ ఏమీ చెప్పలేం...

ప్రస్తుతానికి మీ మాటలు అన్నీ అతనికి వినిపిస్తాయి కానీ అతను స్పందించలేడు

మీరు వెళ్లి అతన్ని చూడొచ్చు అని చెప్పటంతో

అక్కడ రితేష్ ఏమో కానీ ఇక్కడ వాళ్ల డాడీ మాత్రం

ప్రాణం ఉన్న శిలలా అడుగులో అడుగేసుకుంటూ రితేష్ రూమ్ చేరుకొని

చెట్టంత కొడుకు అలా అచేతనంగా పడిఉండటం భరించలేని ఆయన బోరున విలపిస్తూ రితేష్ చేతిని గట్టిగా అదిమి పట్టుకున్నారు

3 రోజులు ప్రతీ క్షణం మృత్యువుతో పోరాడిన రితేష్ని

ఆ మృత్యు దేవత ఓడించింది

ఇప్పుడు ఆ తండ్రి జీవిత కాలం నిరీక్షించినా కన్న కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు

ప్రకృతి వైపరీత్యాలను ఎవరం కూడా ఖచ్చితంగా అంచానా వేయలేం అనటానికి రితేష్ ఒక మంచి ఎక్షాంపుల్గా నిలిచిపోయాడు

ఎప్పుడూ కాకున్నా కొన్ని కొన్ని సార్లు అయినా

అనుభవంతో కూడిన పెద్దవాళ్ల మాటలు పెడచెవిన పెట్టొద్దని స్టోరీ మిర్రర్ వేదికగా అందరికీ విన్నవిస్తున్నాను


Rate this content
Log in

Similar telugu story from Horror