నీ జీవితంలో..
నీ జీవితంలో..
విజయ్ "హీరో" అనే అంశం మీద వ్యాసం వ్రాస్తున్నాడు.
ఎప్పుడూ హీరోల కోసం వెతకడంతోనే సరిపోయింది. అమ్మాయి పైట లాగి చెట్టు చుట్టూ తిరుగుతూ పాటలు పాడే వాళ్ళను మాత్రమే హీరోలనే అనుకున్నాడు.
సైడ్ కాలువలో దిగి మురికిని శుభ్రం చేసే వాళ్ళను హీరోలని తరువాత తెలుసుకున్నాడు. కేవలం ఫాంటసీలు తృప్తి పరిచే హీరోలు కాదు.
సాహసంతో అడుగు ముందుకు వేసే హీరోలు ఎందరో. ఎవరూ తక్కువ కాదు. సరిహద్దును కాపు కాసే సైనికుడు హీరో అని వేరే చెప్పాలా అనుకున్నాడు.
అన్నం పెట్టే రైతయినా, రేపటి తరానికి నిర్మించే ఉపాధ్యాయుడయినా.. ఇక్కడ హీరో కానిదెవ్వరు.
నాన్న, అమ్మ అందరూ కూడా.. ఇక్కడ పోరాటం చేయనిదెవ్వరు. ధైర్యంగా ముందుకు వెళ్లే వాళ్లే ఎక్కువ. ఇవన్నీ హీరో లక్షణాలే కదా..
అతనికి ఒకటి అర్థం అయ్యింది. తన జీవితానికి తనే హీరోగా ఉండాలి. రిస్క్ అయినా పర్లేదు. అదే వ్రాసుకున్నాడు విజయ్..
