Dr.R.N.SHEELA KUMAR

Drama

3  

Dr.R.N.SHEELA KUMAR

Drama

మోడరన్ దాంపత్యం

మోడరన్ దాంపత్యం

3 mins
305


సునీల్ ఇ. టి కంపెనీ లో పనిచేస్తున్నాడు ఐదేళ్లుగా. అమ్మ విజయ నాన్న గోవింద్ అప్పుడప్పుడు సునీల్ ని చూడడానికి పట్నం వస్తారు. గోవింద్ వాళ్ళ పల్లె లోనే పెద్ద వ్యవసాయి. ఊరిలో సగం కన్న ఎక్కువ భూములు వారివే. మంచి మనసున్న గోవింద్ ఆ పొలాలలో పనిచేసే వారికీ కొంత భూమిని ఇచ్చేసాడు. ఊరిలో అందరు ఆ దంపతులని దేవుడిలా చూస్తారు. సునీల్ కాస్త మోడరన్ బానిలోనే పెరిగాడు. అమ్మ తో ఎప్పుడు కుటుంబం కోసం కష్టపడటం తప్ప నీకంటూ ఏవి ఆశలు లెవా అమ్మ అని అడిగాడు. వెంటనే నాకు ఈ వయసులో ఆశలెంటిరా ఉంటాయి నువ్వు సుఖంగా ఉంటే అదే నాకు సంతోషం అని చెప్పింది. సునీల్ వెంటనే న పెల్లు గురించి ప్రారంభించకు అంటూ బయటకు వెళ్ళిపోయాడు.

వారంలో 5రోజులు పట్టణం, రెండు రోజులు పల్లె అని తన జీవితం చాలా హాయిగా సాగిపోతుంది.

సునీల్ వాళ్ళ మేనమామ ఓ రోజు ఇంటికి వచ్చి ఏమోయ్ మేనల్లుడు ఫోటోలు తెచ్చాను చూడు ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయి ఇంటికి పెళ్లిచూపులకు వెళ్లదాం అంటూ ఓ 100ఫోటోలు తెచ్చి టీ పాయి మీద పడేసాడు. గోవింద్ చూసి ఆ రావయ్యా వారా వారం నువ్వు ఫోటోలు తేవడమే మిగిలుతుంది. ఇక్కడ పని మాత్రం జరగటం లేదు అన్నాడు. వెంటనే రామయ్య వచ్చే ఏడాదిలోగా నీ కొడుక్కి మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేసే పూచి నాది అంటూ వంటింట్లోకి వెళ్లి అక్క ఏంటీ టిఫన్ అని అడిగేలోపే పూరిలు ప్లేటులో పెట్టి ఇచ్చింది.

సునీల్ స్నానం చేసి వచ్చి ఫోటోలు చూస్తూ నవ్వుకుంటూ, మావయ్య ఎందుకిలా కష్ట పడతావ్, నీకు టిఫన్, భోజనం కావాలంటే వచ్చి తినేసి వెళ్ళిపో అంటే గాని ఇలా ఫోటోలు తెచ్చి నాతో ఆడుకోకు అన్నాడు నవ్వుతూ. విజయ సునీల్ తో చాలు ర నీ వెటకారం ఎప్పుడు ఇలా ఒంటరిగా ఉండిపోతావా ఏంటీ నాకు వయసువుతుంది నిన్ను ఓ ఇంటివాడిని చేసేస్తే నాకు ఆనందం అన్నది. ఇంతలో ఆ ఫోటోలలో ఓ ఫొటోస్ గాలికి యెగిరి సునీల్ మీద పడింది. వెంటనే అది చూసి మైమరచిపోయాడు . ఆ అందం, చూసి అలా అవాకైపోయి నిలుచున్నాడు వెంటనే మావయ్య ఆ ఫొటోస్ చూసి ఆబ్బె ఈ అమ్మాయి మనకు సెట్టమవదు. వాలింట్లో అంత మోడరన్ గానే ఉంటారు, తరతరాలుగా భార్య భర్తలీద్దరు ఉద్యోగాలకు వెళ్ళటం పనులు ఖర్చులు సరి సమానంగా పంచుకోవటం ఇద్దరు కన్నవాళ్ళను ఒకేదగ్గర ఉంచి వాళ్ళ బాగోగులు చూడటం ఇవన్నీ మనలాంటి వాళ్ళకి సరి రావు అన్నాడు.

విజయ ఆ ఫోటోను చూసి పిల్ల చాలా బావుంది తమ్ముడు అంటూ గోవింద్ కి ఇచ్చింది. అది చుసిన వెంటనే ఈ అమ్మాయి నా ఫ్రెండ్ గోపాల్ కూతురు. నీకు గోపాల్ గుర్తున్నాడా విజయ వాడు అప్పుడే చాలా వ్యత్యాసం గ ఆలోచించే వ్యక్తి చాలా ఆధునికంగా ఉంటాడు మంచివాడు అని చెప్పేవాడిని అంటూ చాలా సంతోషంగా ఏమిరా సునీల్ ఈ అమ్మాయిని చూడడానికి వెళదామా అన్నాడు. కానీ గోపాల్ ఇంటికి వెళ్లి మేకల సంతలి లాగ పెళ్లిచూపులు వుండవు చాలా ఆప్యాయత తో ఏదో ఓ హోటల్, లేదా కోవిలు లో మనం కలుస్తాం అని చెపుతు గోపాల్ కు ఫోన్ చేసి విషయం చెప్పిన వెంటనే చాలా ఆనందంతో, సరేరా హోటల్ సవేరా లో సాయంత్ర 5గంటలకు కలుద్దాం అంటూ వచ్చేరు. అందరికి అమ్మాయి, అబ్బాయి నచ్చారు. సరేరా మంచిరోజు చూసి రిజిస్టర్ మ్యారేజ్ చేసేద్దాం అన్నాడు, వెంటనే విజయ అదేంటన్నయ్య మీకు మాకు ఒక్కగానోక్కా సంతానం పెళ్లి గ్రాండుగ చేయ్యోద్ద అని అడిగింది. అదేం వద్దు సిస్టర్ మీకేమైనా చెయ్యాలని ఉంటే పిల్లల పేరున ఫిక్సడ్ డిప్పొసిట్ చేద్దాం అది వాళ్లకు ఉపయోగపడుతుంది అంటూ సర్దిచెప్పాడు. గోవింద్ కి అది నచ్చింది. పెళ్లి అయ్యింది పట్టణంలో ఓ ఇల్లు కొనుక్కొని కొత్త కాపురం మొదలుపెట్టారు. సునీల్ భార్య సునీతకు ఐ . టి కంపెనీలో పని అందువలన ఐ టి పనులు ఇద్దరు కలిసి చేసుకునేవారు ఇల్లుతుడవటం నుండి, బట్టలుతకటం, వంట చెయ్యటం అన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీ. ఒక సిస్టమేటిక్ గ కాపురం సాగుతుంది. పండగలకి అందరు ఒకే చోట పల్లెలో కలిసే వారు సరదాగా గడిపేవారు. సునీతకు ఒకే ప్రసవంలో ఇద్దరు పిల్లలు ఒక ఆడ, ఒక మొగ బిడ్డలు పుట్టారు అప్పటినుండి గోవింద్ గోపాల్ లు పల్లెలోని ఉన్న బంగాళా ఇంటిలో కలిసి వుంటూ తాతయ్యలు ఇద్దరు మమ్మలు ఇద్దరు కలిసి మనవడిని, మనవరాలిని పెంచుతుంది సంతోషంగా జీవిస్తున్నారు.


Rate this content
Log in

Similar telugu story from Drama