STORYMIRROR

Dr.R.N.SHEELA KUMAR

Drama

4  

Dr.R.N.SHEELA KUMAR

Drama

మొఘమాటం

మొఘమాటం

1 min
274

అవి కాలేజీ రోజులు. అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి చదుకునే కాలేజీ అవ్వటం వలన నేహా వాళ్ళ అమ్మ ఎప్పుడుచుసినా జాగ్రత్తలు చెపుతూనే ఉంటుంది. నేహా చిన్నప్పటి నుండి హడావిడి అయిన నైజం గలది. తన స్నేహితురాలు స్మిత చాలా మొహమాటం గలది. వాళ్ళ అమ్మ నేహా తో మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అమ్మ అనేవారు. ఇద్దరు ఎక్కడకి వెళ్లిన మిగిలిన వాళ్ళు వీళ్ళని చూసి మనకి ఇలాంటి స్నేహితులు లేరే అని అనుకునే వారు చదువు పూర్తి అయి నేహా కి వివాహం అయ్యింది. స్మిత ప్రభుత్వ కళాశాల లో ప్రిన్సిపాల్ అయ్యింది నేహా ఓకే ప్రయివేట్ స్కూల్ లో పనిచేస్తుంది. స్మితకి వివాహమయ్యి ఇద్దరు కూతుర్లు నేహా కి ఒక కొడుకు.20 ఏళ్ళ తరవాత కలాశాల స్నేహితుల కలయిక జరిగింది. నేహా తో అందరు చాలా బాగా మాట్లాడి నీ పట్టుదల వలనే అందరమూ కలిసాము అని మెచ్చుకున్నారు. స్మిత మాత్రం ఏదో అంట నట్లు ప్రవర్తించింది. అది అందరినీ ఆశ్చర్య చకితులని చేసింది. బుజ్జి అనే స్నేహితురాలు నేహా తో ఏంటీ స్మిత గర్వం తో అలా ప్రవర్తిస్తుంది. నిన్ను మరిచిపోయిందే. మీరిద్దరూ కాలేజీ రోజుల్లో ఎలా ఉండే వాళ్ళు అని అంటూ, సరేలే నీకు మేమున్నాం ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉండు అంటూ అందరు ఎవరికీ వారు విడిపోయారు. కానీ నేహా మనసులో ఏదో ఒక వెలితి ఎవరినో వెతుకుతునే ఉన్నాయా కళ్ళు. అప్పుడే నిహాల్ వచ్చి అయ్యో నేహా క్షమించు ఇంట్లో మా అబ్బాయికి ఒంట్లో బాగోలేదు నలుగురు రోజులుగా హాస్పిటల్ లోనే వున్నాం. అన్నాడు. సరే ఇక నేను బయలుదేరుతాను ట్రైన్ కి టైం అవుతుంది అంటూ ఎవరికీ తెలియకూడదానేటటు ఏడుస్తూ, నవ్వుతూ అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఈ 25ఏళ్ళ తరవాత మన కలయిక మళ్ళీ ఎప్పుడు కలుస్తామనే ఓ సంతోషం తో ఎదురుచూపులతో ఆ స్నేహితులు కాలాన్ని గడుపుతున్నారు. ఇదే నిజమైన స్నేహం. స్మిత గర్వం తో కాదు మొహామాటం తో ఎవరితోనూ మాట్లాడక ఇంటికి వెళుతూ ఏడుస్తూనే ఉంది.


Rate this content
Log in

Similar telugu story from Drama