మనసును వశం చేసుకోవాలని మహాత్ములు చెప్పుటకు కారణo
మనసును వశం చేసుకోవాలని మహాత్ములు చెప్పుటకు కారణo
Story Name:
మనసును వశం చేసుకోవాలని మహాత్ములు చెప్పుటకు కారణo
Duration:5 mins
వివరణ :
మనసును వశం చేసుకోవాలని, సంతు మహాత్ములు చెప్పుటకు కారణాన్ని ,
"సద్గురువు మనకు సేవ ,సత్సంగము ధ్యానము & భజన అభ్యాసంల గురించి బోధిస్తుంటే " మన మనసు ఎలా ప్రవర్తిస్తుందో చిన్న ఉదాహరణ రూపంలో , హాస్యరూపంలో వివరణ
క్యారెక్టర్ నేమ్:
యజమాని: ఆత్మ ఆనందుడు
క్యారెక్టర్ నేమ్:
పనివాడు : మన:చంచరూడు
క్యారెక్టర్ నేమ్:
డాక్టర్ : సద్గురు స్వరూప్
Skit
ఆత్మ ఆనందుడు:
అరే !! మన:చంచర... నేను అనుకోకుండా రోగం బారిన పడి ఈ కట్టే మంచంలో పడి ఉన్నాను. నాకు ఏ పని అయినా నీ ద్వారానే నెరవేరుతుంది అందుకే నాకు నీ అవసరం చాలా ఉందని నిన్ను పనిలో పెట్టుకున్నాను.
మన:చంచరూడు:
నాకు బాగా అర్థమైంది అయ్యగారు .నీవు ఎట్లా చెబితే అట్లా ఏమి చెప్పినా చేస్తాను.
నేను నీకు మంచి మిత్రుడను అయ్యగారు. ఇంకా నాకు వదిలేయండి.
ఆత్మ ఆనందుడు:
అరే !! నేను అడగకముందే కొత్త కొత్త రకాల వంటలూ ఎంతో ఉత్సాహంతో చేస్తున్నావు.
నాకు వినోదాన్ని అలాగే వింత వింత పనులు చేస్తూ నాతో చేయిస్తూ సంతోషాన్ని ఇస్తున్నావు .నీవు నిజంగా నా వాడివే రా.
మన:చంచరూడు:
అంతే కదా అయ్యగారు, నివ్వు సుఖంగా ఉండడానికె కదా నేను ఉండేది. నేను మీ బంటుని .
నీకు ఏం కావాలో నాకు తెలుసులే అయ్యగారు. నేనే- నువ్వు గా చూసుకుంటాను అయ్యగారు.
ఆత్మ ఆనందుడు:
అబ్బా!! ఎంత సంతోషంగా ఉంది .కచ్చితంగా నీలాంటి వాడు దొరకడం నా అదృష్టం రా.
నీవు నా బంధువు తో సమానం . నీవు నాకు మంచి మిత్రుడవు కూడా....................
...........................................
ఆత్మ ఆనందుడు:
అరే మన:చంచర!! ఈ రోగం వల్ల నాకు బాధ ఎక్కువ అవుతుంది .తొందరగా డాక్టర్!! సద్గురు స్వరూప్ గారి సహాయం అవసరం, వారిని కలిసి నా పరిస్థితి వివరించి ఇక్కడికి తీసుకొని రా ....
మన:చంచరూడు:
అలాగే అయ్యగారు
అని ఆగిపోయాడు (సంకోచం తో)
ఆత్మ ఆనందుడు:
ఏమైందిరా?
మన:చంచరూడు:
మరి ఏమీ లేదు ఊరికే ఆగాను ,అయినా నేను ఇప్పుడు బయటికి వెళుతున్నాను కదా!!
పెద్ద వర్షం పడితే నా పరిస్థితి ఏంటి? అని ఆలోచిస్తున్నాను.
ఆత్మ ఆనందుడు:
హ!!.. ఆ ...అసలు వర్షం వచ్చే సూచనలు లేవు కదరా? పో తొందరగా పోయి రాపో .....
మన:చంచరూడు:
అవునే అంటూ (బయటకు తొంగి చూస్తున్నాడు ). మళ్లీ సంకోచిస్తున్నాడు.
ఆత్మ ఆ
నందుడు:
మళ్లీ ఏమైంది రా?
మన:చంచరూడు:
నేను అంత దూరం పోయాక డాక్టర్ లేకపోతే ?
నేను పోయి ఏమి లాభం? అని ఆలోచిస్తున్నా.
ఆత్మ ఆనందుడు:
అబ్బా... !నాయనా!! నువ్వు ముందు పోయి చూడు.
మన:చంచరూడు:
సరే కానీ...?
ఆత్మ ఆనందుడు:
మళ్లీ కానీ ఏందిరా?
మన:చంచరూడు:
డాక్టర్ ఉన్న తన దగ్గర మందులు లేవు. నేను రాను అంటే?
ఆత్మ ఆనందుడు:
అలా ఏమీ అనడు నన్ను విసిగించకు తొందరగా పో నాయనా.
మన:చంచరూడు:
హా... ఊ...
ఆత్మ ఆనందుడు:
కదాలవేమి రా? నాకిప్పుడు సహకరించకపోతే నువ్వు ఇంతకుముందు ఎంత చేసినా ఏమి లాభం రా తొందరగా పోరా..
మన:చంచరూడు:
అది కాదు అయ్యగారు ఇప్పుడు నేను డాక్టర్ ని తీసుకొని వస్తే డాక్టర్ గారూ మందులు ఇచ్చినా నీకు రోగం తగ్గకపోతే ఎలా?
ఆత్మ ఆనందుడు:
నాకు బాగా అర్థమైంది రా నువ్వు నన్ను ఇలాగే ఉంచి నీ ఆనందాన్ని చూసుకుంటున్నావు.
నేను ఇప్పుడు గట్టిగా చెప్పుతున్నాను. ఇంకోసారి ఆగవు అంటే బాగుండదు. పోరా తొందరగా.
మన:చంచరూడు:
భయపడి పరిగెత్తుకుంటూ పోయాడు డాక్టర్ దగ్గరికి. (అలాగే డాక్టర్ని తనతోపాటు తీసుకొని మళ్ళీ వచ్చాడు.)
డాక్టర్ :
నీ బాధ అర్థమైంది ఆత్మ ఆనందుడ.!!
ఈ పద్ధతులు చెయ్యి--
-సేవ, సత్సంగ మను మాత్రలను రెండుపూటలా వేసుకొని ధ్యాన ,భజన అభ్యాసాల సహాయంతో శరీరానికి విశ్రాంతి అందించు . తొందరలోనే కోలుకుంటావు. నా సహాయము ఇంకా ఉంటుంది.
ఇంక నేను చూసుకుంటాను. అని చెప్పి వెళ్లి పోయాను.
ఆత్మ ఆనందుడు:
డాక్టర్ గారు చెప్పిన పద్ధతి ప్రకారం చేస్తే నాకు ఇప్పుడు అంతా తగ్గిపోయింది రోగం.
ఇప్పుడు నేను చాలా స్వేచ్ఛగా- సుఖంగా ఉన్నాను .
నాకు ఇప్పుడు ,మిత్రులు ఎవరో, శత్రువు ఎవరో కూడా బాగా అర్థం అయ్యింది.
ఇంకా నీ అవసరం నాకు లేదు. నాకు సద్గురు మూర్తి గారి సలహాలను వారి ఆజ్ఞలను పాటించడం నాకు ముఖ్యం. నేను సద్గురు మూర్తి గారి తోనే ఉంటాను. నేను ఇప్పుడు స్వేచ్ఛగా జీవించగలను.
ఆయనే నాకు నిజమైన మిత్రుడు.
Conclusion
చూశారుగా? మనసు ఎంత మోసకారో.?
తనకు ఏమి కావాలో ఈ ఆత్మను నిర్బంధించి తన పనులను మాత్రమే తన ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతోంది.
ఆత్మ కి ఏం కావాలో అది గట్టిగా ఆజ్ఞాపించిన అప్పుడు మాత్రమే... పనులు చేస్తోంది.
డాక్టర్ గారి సహాయము అనగా సద్గురువు సహాయము అందిన వెంటనే ఆటలు సాగవు అని
తెలుసు. అందుకే అది మనల్ని మోసం చేస్తూ ఉంటుంది.