శ్రీలత "హృదయ స్పందన"

Tragedy

4.6  

శ్రీలత "హృదయ స్పందన"

Tragedy

మగువ స్థానం ఎక్కడ...

మగువ స్థానం ఎక్కడ...

2 mins
547



రమ్య, చందు ముచ్చటైన జంట..

రమ్య వాళ్ళది ఓ మొస్తారుగా ఉన్న కుటుంబం.

రమ్య ఇంట్లో చిన్న కూతురు.. ఆమెకు అన్నివిధాలా తగిన సంబంధం అని వాళ్లకు ఉన్నంతలో ఘనంగా రమ్యను చందు కి ఇచ్చి వివాహం చేసారు.

చందు కూడ రమ్యను చాలా ప్రేమగా చూసుకునేవాడు ఆలా ఒక సంవత్సరం గడిచింది. ఇంతలో రమ్య ప్రెగ్నెంట్ అవ్వటంతో ఇంట్లో అందరుఆనందంగా ఉన్నారు.

రమ్యకు 9వ నెల ఒచ్చింది అంత బాగానే ఉంది ఇంకో 10 రోజులలో డెలివరీ అవుతుంది అనగా ఒక రోజు ఉన్నట్టుండి రమ్యకు విపరీతంగా కడుపునొప్పి రావటంతో దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు.

డాక్టర్ సీరియస్ కండిషన్ అని హైదరాబాద్ కి తీసుకెళ్లమని చెప్పటంతో ఆమెను హైదరాబాద్ లోని ఒక పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్లారు..

అక్కడ డాక్టర్ చూసి అప్పటికే కడుపులో బిడ్డ చనిపోయింది అని అబార్షన్ చేస్తారు..

అబార్షన్ టైములో రమ్యకు కొంచెం ఆరోగ్యం దెబ్బతినటంతో కొంత కాలం పుట్టింట్లో ఉంటుంది.

అలా కొంత కాలం గడిచాక రమ్యకు రెండవ సారి ప్రెగ్నెన్సీ ఒచ్చి ఒక పాప పుట్టింది. 

అలా ఆరు నెలలు కాకుండానే రమ్య మళ్ళీ అనారోగ్యం పాలు అవటంతో హాస్పిటల్ లో చూపించారు. 

ఆమెకు కాన్సర్ అని, అది చివరి స్టేజ్ లో ఉందని డాక్టర్ చెప్పటంతో ఆమెను కొన్ని రోజులు హాస్పిటల్ లోనే ఉంచుతారు..

రమ్యతో పాటు హాస్పిటల్ లో ఆమె అమ్మ- నాన్న మాత్రం ఉన్నారు. పాప ఆమె భర్త దగ్గర ఉండేది. ఆమె భర్త అప్పుడప్పుడు వెళ్లి వచ్చేవాడు.. చివరికి ఒక రోజు డాక్టర్ రమ్య ఇంకో 24 గంటలలో చనిపోతుంది అని చెప్పటంతో వాళ్ళ నాన్న రమ్య భర్త కు విషయం చెప్తాడు. మీరు వస్తే రమ్యను ఇంటికి తీసుకెళ్దాం అని.

కాని చందు మాత్రం తనకు కుదరదని మీరే మీ ఇంటికి తీసుకెళ్లండి అని చెప్పటంతో బరువైన హృదయంతో

ఆమె తల్లిదండులే ఆమెను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు.

ఇంటికి వెళ్ళాక రమ్య నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు నేను మా ఇంటికి వెళ్తాను నా భర్త, నా పాపను ను చూడాలి అంటుంది. నా దగ్గరికి తీసుకొని రమ్మని చెప్తుంది.. ఆ సమయంలో రమ్యను చూసి ఆమె తల్లితండ్రులు ఆమెకు నిజం చెప్పలేక, మనసులో దాచుకోలేక వాళ్ళ హృదయం ద్రవించిపోయింది.

అప్పుడు రమ్య వాళ్ళ నాన్న చందుకి ఫోన్ చేశాను పాపను తీసుకొని వస్తున్నాడు అని చెప్తాడు.. కాని చందు రాలేదు. పాపం రమ్య భర్త కోసం పాప కోసం చూసి చూసి చివరి శ్వాస వదిలేసింది..

రమ్య చనిపోయింది అని తెలిసిన తర్వాత ఆమె భర్త, అత్త, మామలు వస్తారు..

చివరికి రమ్య భర్తను ఆమెకు అంతిమ సంస్కారం కూడా చేయనివ్వలేదు ఆమె అత్త మామలు.

ఆమె తండ్రి ఆమె అంతిమ సంస్కారం చేస్తాడు..

పాప కూడా వాళ్ళ దగ్గరే ఉంది.

రమ్య చనిపోయిన రెండు నెలలకే చందు రెండవ వివాహం చేసుకున్నాడు.

రమ్య జీవితం ఎక్కడ మొదలైందో చివరికి అక్కడే ఆగిపోయింది.. మరి మెట్టినింట్లో, భర్త జీవితంలో

ఆమె స్థానం ఎక్కడ..

రమ్య లాంటి భార్యలు, తల్లులు ఎందరో ఈ సమాజంలో వాళ్లకు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ...

నా ఈ కథ అంకితం..

ఒక ఆడది తల్లిగా, చెల్లిగా, స్నేహితురాలిగా, భార్యగా, కూతురుగా తన చివరి శ్వాస వరకు తన వాళ్ళకోసం బ్రతుకుతుంది..

జీవిత ప్రయాణంలో విశ్రాంతి లేకుండా పనిచేస్తుంది. కుటుంబం సంతోషం తన సంతోషం అని, వాళ్ళ గెలుపే తన గెలుపుని బావిస్తుంది..

మరి నేటి సమాజంలో ఆ మగువ స్థానం ఎక్కడ?

ఆలోచండి,,

ఈ కథ చదివి అమూల్యమైన మీ సలహాలు, సూచనలు తెలియచేయండి...

శ్రీ...

హృదయ స్పందన..



Rate this content
Log in

Similar telugu story from Tragedy