Varanasi Ramabrahmam

Drama

4  

Varanasi Ramabrahmam

Drama

మానవ జీవితంలో ముఖ్యమైనది ఏమిటి

మానవ జీవితంలో ముఖ్యమైనది ఏమిటి

1 min
23.3K



మనకు వెంటనే గుర్తుకు వచ్చేది డబ్బు. 

కొందరు చాదస్తులు మానవ సంబంధాలు అంటారు.


డబ్బు లేని వారు డబ్బు ముఖ్యం అంటారు. 

మానవ సంబంధాలతో విసిగిపోయిన వారు

మానవ సంబంధాలు ముఖ్యం అంటారు.


మనిషికి డబ్బు గాలి వంటిది. మానవ సంబంధాలు నీరు వంటివి. మనిషి మనుగడకు రెండూ ముఖ్యమే. అత్యవసరమే. 


కాని ప్రస్తుతం మనందరం డబ్బు ప్రాముఖ్యతని మాత్రమే గుర్తించ గలుగుతున్నాం.


మానవ సంబంధాలు సరిగా లేక అవస్థ పడుతున్నాం. కాని మానవ సంబంధాల విషయంలో కాంప్రమైజ్ అవుతున్నాం. డబ్బు విషయంలో కాంప్రమైజ్ అవలేని స్థితిలో ఉన్నాం.


స్త్రీ పురుషుల పాత్రలు మార్చేసుకున్న నేడు

ముఖ్యంగా అవస్థల పాలయ్యేది పసికూనలు, ముసలివగ్గులు. వీరికి ఆలంబన లేదు. ఆసరా లేదు. దిక్కులేదు. దేముడూ దిక్కు కాలేకున్నాడు. దేముడి ఉనికిని మనం ఎప్పుడోనే తీసి పారేశాం.


ఇది చాలా గొప్ప ఇబ్బందే అయినా, మనం దీన్ని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. హక్కుల ముందు బాధ్యతలు వెల వెల బోతున్నాయి.


పనీ, పాటా లేని మేధావులు మన జీవితాల్ని నిర్దేశించడం చాలా ఎక్కువై పోయింది. వాళ్ళ వాళ్ళ జీవితాలు ఎలా జీవిస్తున్నారో తెలియదు గాని అడుగడుక్కి మనకి ఉచిత సలహాలివ్వడం, మనం కాదంటే అవీ ఇవీ మాట్లాడి మన నోరు నొక్కెయ్యడం ఎక్కువై

పోయింది.


ఇదివరకు ప్రతి ఇల్లూ, కుటుంబ సభ్యులు, ఇంట్లోని పెద్దవాళ్ళు చెప్పినట్లు నడుచుకునే వారు. తాత/మామ్మ, తండ్రి/తల్లి, తాత/అమ్మమ్మ, ఇలా ఇంటిలోని వారి జీవితాలను అన్ని విధాలా నడిపేవారు.


ఇప్పుడు హక్కుల పుణ్యమా అని తాతలు, మామ్మ, అమ్మమ్మలు కలిసి ఉండడం ఆగి పోయింది. కుటుంబాలలో సభ్యుల మధ్య ఆత్మీయతలే కరువయ్యాయి. 


ఇల్లాలి మరణంతో ఇల్లు మూగబోయింది. ఈ ఇంటిని పలికిద్దామని ఎవరూ అనుకోవడం లేదు. ఇల్లు నెమ్మదిగా చరిత్రలో కలిసిపోతుంది. హక్కులు, మనుషులు, వ్యథలు, వేదనలు, మానసిక సంక్లిష్టతలు మిగులుతాయి. 


ఎంత డబ్బు సంపాదించినా ఈ మానసిక వైక్లబ్యము తట్టుకోలేక సైక్రియాటిస్ట్ లని, ఆధ్యాత్మిక గురువులను సందర్శించడం ఎక్కువ అవుతుంది. 


వారెవరూ తోటి కుటుంబ సభ్యులు ఇచ్చే సాంత్వన, స్వాంతన ఈయలేరు. డబ్బున్నా, సరియైన మానవ సంబంధాలు లేక మనుషులు ఇక్కట్ల పాలవుతారు.


Rate this content
Log in

Similar telugu story from Drama