Swarnalatha yerraballa

Horror Crime Thriller

4.8  

Swarnalatha yerraballa

Horror Crime Thriller

కోటలో కారుచీకట్లు

కోటలో కారుచీకట్లు

18 mins
710


ఎంతో ప్రసిద్ధి పొందిన ఉదయగిరి కోట చాలా ప్రాచీనమైనది. ఎందరెందరో రాజులు మాకంటే మాకని ఉదయగిరి కోసం యుద్ధాలు జరిపారు. అలాంటి వారిలో శ్రీకృష్ణదేవరాయలు కూడా ఒకరు. ఆయన కాలంలో ఉదయగిరి స్వర్ణ గిరి వైభవాన్ని చూసిందని చెప్పుకుంటూ ఉంటారు. ఒకప్పుడు ఉదయగిరి నలువైపులా నాలుగు చిన్న చిన్న ఊళ్ళు ఉండేవి. అందులో కోన,కోడూరు అనే రెండు చెంచుల ఊళ్ళు,మరో రెండు రామాపురం , సోమనాథ అగ్రహారం ఉండేవ. రామాపురం లో అప్పటి అగ్రకులస్తులు వ్యాపారాలు చేస్తూ కాపురాలు ఉండేవారు. సోమనాథ అగ్రహారంలో కొద్ది మంది బ్రాహ్మణ కుటుంబాలు వేదపాఠశాలలు నిర్వహిస్తూ రాజ్య సుభిక్షం కోసం యాగాలు చేస్తూ, ఆయుర్వేద వైద్యంతో రోగులకు, రోగాలను నయం చేసేవారు.ఉదయగిరి కోటను ముట్టడించడం శత్రువులకు చాలా కష్టతరం. ఎందుకంటే కోట కుడివైపు ఒక లోయ,ఉదగిరి మరియు సంజీవిని కొండలకు క్రింద ముందు భాగాన చిత్రావతి సెలయేరు కొండ వెనుక చిత్రావతి జలపాతం.

కాలక్రామేణ కోనలో చెంచులు వ్యవసాయం చేసుకుంటూ అడవి లో మాత్రమే పండే పళ్ళను, తేనెను, పూలను కోడూరు ,సోమనాథ అగ్రహారం లో అమ్ముకుంటున్నారు.కోడూరులో చెంచులు కుటుంబాలతో ఉంటున్నారు .ఉదయగిరి కొండను ఆనుకొని ఉన్న పెద్ద లోయ,లోయను ఆనుకొని సంజీవిని పర్వతం ఉంది. అది రామాయణ కాలంలో సాక్షాత్తు హనుమంతులవారు లక్ష్మమణుడు మూర్ఛ పోయినపుడు,శ్రీరాముని ఆజ్ఞ మేరకు తీసుకొచ్చిన పర్వతమని అందరూ అంటూ ఉంటారు.ఆ సంజీవిని పర్వతం లో అంతుచిక్కని ఔషధాలు ఎన్నెన్నో ఉన్నాయాని ఆయుర్వేద ప్రొఫెసర్ గోపాలరాజు గారు 1940 లో ఒక పుస్తకం కూడా వ్రాసారు.ఆ సంజీవిని పర్వతం ఆరంభం లో పర్వతాన్ని మోస్తున్న ఒక హనుమంతుని ఆలయం ఉంది. కానీ విచిత్రమేమిటంటే ఆ పర్వతం హనుమంతుని చేతిలో కాకుండా గాలిలో తేలుతూ ఉంటుంది. కానీ ఒకప్పుడు ఆ పర్వతం హనుమంతుని చేతిలోనే ఉండేదని చెప్తూ ఉంటారు.అంతే కాకుండా సంజీవిని పర్వతం ఎవరు ఎక్కడానికి ప్రయత్నించినా వారి ఆచూకి తెలియకుండా పోయేది.ఇక మన ఉదయగిరికి వస్తే,ప్రతి నాలుగు ఊళ్ల నుంచి కాస్త 30 అడుగుల కాలిబాట, ఆ తరువాత 50 మెట్లు ఎక్కితే పెద్ద సభా ప్రాంగణం, సభా ప్రాంగణం ఇరువైపులా 20 మెట్లు, అవి ఎక్కితే ఒక వైపు అశ్వశాల, మరోవైపు గజశాల వాటి మధ్యలో కారాగారం, అశ్వశాలకు కాస్త దూరం లో శిక్షాస్థలం,కారాగారం నుంచి 15 మెట్లు ఎక్కితే కోటలో ఓ వైపు పెద్ద అతిథి మందిరం, ఉంటుంది. అందులో రాజు గారి బంధువులు, మంత్రిగారు, సేనాపతి ఉండే నివాస గృహాలు ఉన్నాయి .మరో వైపు కాళీ ఆలయం మనకు కనిపిపిస్తుంది . వాటి మధ్యలో ఉద్యానవనం, అందులో ఒక చిన్న కోనేరు,అతిథి మందిరం మరియు కాళీ మాత మందిరం మధ్యలో ఒక పెద్ద బండ రాయి, ఆ రాయికి ఇరువైపులా రెండు సొరంగ మార్గాలు,రాయి ముందు రెండు సింహాలు, మరియు రాయి మీద అష్టదళ పద్మం ఉన్నాయి.ఆ సింహాలకు ఒక్కో సింహం మీద రెండు రెండు చక్రాలు ఒకటి సవ్యం మరోటి ఆపసవ్య దిశలలో ఉన్నాయి.ఆ సొరంగాలకు , సింహాలకు మధ్య ఉన్న పెద్ద రాయి మీద మలచిన, విరిసినట్టు ఉన్న రాతి పద్మం ఉంటుంది. విచిత్రం ఏమిటంటే ఇంత కోటలో రాజుగారి గది మరియు రాణి అంతఃపురం మాత్రం ఎవ్వరికి జాడ కూడా తెలియదు.కొండ ఆరంభం లో ఈశ్వరాలయం నిత్యం మోకాలిలోతు నీళ్లతో ఉంటుంది. ఆ ఆలయం లోపల ఎక్కడో రాజు గారి కోటకు దారి ఉండేది అని చెప్తూ ఉంటారు.రాజు గారు కుటుంబ సమేతంగా ఈశ్వరాలయం కు వచ్చి అక్కడ పూజలు జరిపేవారు అని చెప్పుకుంటూ ఉంటారు.


1989 వరకు విజయసింహ భూపతి రాజు గారి వారసుడైన జయసింహ భూపతి సోమనాథ అగ్రహారం లో సోమనాథనికి పూజలు జరిపేవారు. రాను రాను రాజుగారి వారసత్వం అంతరించిపోయింది. కుటుంబానికి ఏమైందో ఎవ్వరికి తెలియదు.సోమనాథుడికి కూడా పూజలు కరువైపోయాయి.అంతేకాక జయసింహ రాజుగారు దయ్యం అయ్యారని,కొండపైకి వచ్చిన వాళ్ళను చంపేస్తారానే భయం ఇప్పటి ప్రజలలో ఉంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అనేలా కొందరు రాజు గారిని చూసామని, ఆయన కత్తిపట్టి కొండమీద తిరుగుతున్నారని చెప్తూ ఉంటారు.అందరూ చెప్తున్నా వినకుండా కొండమీదికి వెళ్లి ఒక డాక్టర్ అక్కడ చనిపోయాడని ఇక్కడి ఊళ్లలో జనం చెప్తుంటారు.అంతే కాకుండా ప్రతి అమావాస్యకు ఎవ్వరో ఒకరు మరణింస్తూ ఉంటారు.

 ఇప్పుడు ఆ నాలగు ఊళ్ళు 3 ఊళ్లగా మారాయి. కోన ప్రజలు అందరూ కోడూరు చేరి కోనలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నారు.కోన మరియు కోడూరులో పండిస్తున్న అడవిలో మాత్రమే పండే పళ్ళను,కూరగాయలను, ఇంకా అడవిలో, మాత్రమే దొరికే చిన్న చిన్న అడవి సంపదను కోడూరు, సోమనాథ అగ్రహారం మరియు రామాపురం లో అమ్ముకుంటూంటుంటారు. ఇప్పుడు సోమనాథ అగ్రహారంలో ఐదు బ్రాహ్మణ కుటుంబాలు మరియు ఆ 3 ఊళ్లకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు అనగా గ్రామీణ బ్యాంకు, పాఠశాల, ఆసుపత్రి, విద్యుత్ కార్యాలయం , పోలీస్ స్టేషన్ ఉన్నాయి . ఆ ఊరిలో ఇళ్ళు వదిలి వెళ్లిపోయిన వారి ఇళ్లను గవర్నమెంట్ ఉద్యోగులకు నివాస స్థానంగా ఇస్తూంటారు.రామాపురం ప్రజలు రాంనపురం లో ఎక్కువగా వ్యాపారం చేస్తూ ఉంటారు. సోమనాథ అగ్రహారం మరియు రామాపురం కు కాలిబాట 45 నిముషాలు. సోమనాథ అగ్రహారం ప్రజలు సరుకులు కావాలంటే రామాపురం కు వెళ్లి తెచ్చుకోవాలి. కొన్ని నిత్యావసరాలు మాత్రం అగ్రహారం లో చిక్కేవి.

ప్రస్తుతం 2018 లో :

ఇప్పుడు నాలగు ఊళ్ల పెద్దలు నారాయణారావు, సంజీవ శర్మ వారసుడు శంకర శర్మ, మారుతి పటేల్,రమేష్ చౌదరి, మరియు అప్పటి సామంతరాజు వారసుడు మహేశ్వర వర్మ . వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కో ఊరి సమస్యను తీరుస్తుంటారు. కానీ అందరు మహేశ్వర వర్మ నిర్ణయాలను చాలా గౌరవించేవారు.చెంచులు కూడా మహేశ్వర వర్మ మాటను చాలా గౌరవించేవారు.పెద్దలు అందరూ మరియి పోలీసుస్టేషన్ SI, CI, కానిస్టేబుల్స్ నలుగురు, ఆ ఊరి డాక్టర్,నర్స్, అటెండర్ ,లైనమన్, ఊరికి 12సంవత్సరాల క్రితం వచ్చిన ఒక టీచరమ్మ, ఇక కొద్దిమంది ఆ ఊరి వ్యాపారస్తులు రామాపురం మరియు సోమసనాథ్ అగ్రహారం లో ఉంటూంటారు.

టీచర్ సునీత కోడూరులో ఇంటిఇంటికి తిరిగి పిల్లలను స్కూల్ కు తీసుకొచ్చి చదువు చెప్పేది.ఆమెకు సహాయంగా గిరి అని అటెండర్ ఉండేవాడు. పన్నెండు సంవత్సరాల నుంచి ఆమె ఊరిలో ఉండే పిల్లల చదువుకు కృషి చేస్తోంది.

ఆ ఊరికి కొత్తగా గ్రామీణబ్యాంక్ మేనేజర్    విక్రమ్ వస్తాడు. అతను ఆ ఊరి బ్యాంకు పరిస్థితి చూసి అశ్చర్య పోతాడు.ఆ ఊరిలో ఒక్కరికి కూడా బ్యాంకు లో ఖాతా లేదు. అతను ఎప్పుడో రిజిస్టర్ ఐన కొన్ని పత్రాలను చూసి ఆశ్చర్య పోతాడు. ఎందుకంటే అందులో చెంచులకు కాస్త భూమి కొని వారి పేరు మీద విజయసింహ రాజు రాసిచ్చింటారు. ఆ స్థలం సంజీవిని కొండ మీద ఉంది.అన్ని బీరువాలు తాళం వేసి , బ్యాంకుకు తాళం వేసి రామాపురం వెళ్లి అక్కడ పెద్దలను కలుస్తాడు. అక్కడ విక్రమ్ వారిని సంజీవిని కొండకు దారి ఎటు అని అడుగగా, అందరు అతనికి ఊరిలో జాగ్రత్తగా ఉండమని, సంజీవిని గురించి ఆలోచించకుండా ఉండమని సలహా ఇస్తారు. సరే అని విక్రమ్ బ్యాంకును శుభ్రపరిచేటందుకు పనివాళ్ళను అడుగగా,మహేశ్వర వర్మ తన ఇంటి పనివాడైన పుల్లయ్యను పంపుతాడు.

విక్రమ్ ఆ ఊళ్లను చూడ్డానికి బయలుదేరుతాడు. ముందుగా అతను సోమనాథ అగ్రహారం నుంచి కోడూరు వెళ్తాడు. అక్కడ ఎవ్వరు అతనిని పలకరించరు. ఏమడిగినా సమాధానం చెప్పరు. వాళ్ళ కళ్లలో ఏదో ఆందోళన. అలానే వెళ్తూ వెళ్తూ విక్రమ్ పిల్లలకు చదువు చెప్తున్న టీచర్ ను  చూసి నమస్తే మేడం అని పలకరిస్తాడు. ఆమె కూడా అతనిని పలకరించడంతో వారిరువురి పరిచయం మొదలవుతుంది. అప్పుడు అతను మేడం ఇక్కడి నుంచి సంజీవిని కొండకు దారి అని అడిగేలోపు, సునీత మీరు దాని గురించి ఆలోచన వదిలేస్తే చాలా మంచిది. నాకు బ్రతకాలని ఆశ ఉంది, ఎందుకంటే మా అమ్మకు ఉన్నది నేను ఒక్కదాన్ని అని అంటుంది. వెంటనే విక్రమ్ ఏమిటలా అంటున్నారు? అని అడిగాడు. వెంటనే సునీత ఇక్కడ నిజంగానే విజయసింహ రాజు దయ్యమై ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి అమావాస్యకు ఎవ్వరో ఒకరు మరణిస్తూ ఉన్నారు. (విక్రమ్ నవ్వుతూ )--మరి ఇప్పుడు మరణించటం లేదా అని అడిగాడు.

సునీత బదులుగా అప్పుడు ఊరి ప్రజలు దేవరమ్మను కలిసి దేవుడిని ప్రార్థించి ఆ ఊరిలో ఎవ్వరు మరణించిన రాజుకు ఆహారంగా  తినడానికి శవాన్ని ఇస్తామన్నారు. అప్పటి నుంచి ఎవ్వరు మరణించిన వెంటనే అది రాజు కు ఇస్తుంటారు. కానీ కూడా అప్పుడప్పుడు ఉన్నట్టుండి ఎవ్వరో ఒకరు కుప్పకూలిపోతూంటారు. అదంతా ఆ రాజు నుంచే అని చెప్పుకుంటుంటారు అని చెప్పి. ఇప్పుడు చెప్పండి విక్రమ్ సార్ ఇది విని కూడా ఆ సంజీవిని గురించి, ఈ మరణాల గురించి ఆలోచిస్తున్నారా? అని అడుగుతుంది.

విక్రమ్ ఆలోచిస్తున్నాను. కానీ వీటి గురించి కాదు నాకు వంట రాదు ఇక్కడ సిటీ లో లా హోటల్స్ లేవు, నా పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తున్నా! అంటాడు నవ్వుకుంటూ.

సునీత వెంటనే నవ్వుతూ అయ్యో మీరు మీ కుటుంబంతో రాలేదా? అని అడుగుతుంది.దానికి సమాధానంగా నాకు ఇంకా పెళ్లి కాలేదు, సిటీ లో మా తాతగారు, మా అక్క ఉంటారు అని చెప్తాడు.వెంటనే సునీత ఓహో అలానా, అయితే మీకు వంట మనిషి చాలా లేక అన్ని పనులు చేయడానికి కూడా ఒక పనామె కావాలా అని అడిగింది. అన్ని పనులు చేసుకొని బ్యాంకు కు వెళ్లడం చాలా కష్టం. మీరు చెప్పినట్టు ఇల్లు ఊడ్చి, పాత్రలు కడిగి, బట్టలు ఉతికి ఆరేసి, వంట చేసి పెట్టే మనిషి అయితే మేలు. అలాంటి వాళ్ళు ఉంటే కాస్త చూసిపెట్టండి అని అంటాడు. సునీత అందుకు ప్రయత్నిస్తాను అని చెప్తుంది.ఆ రోజు విక్రమ్ ఉన్న ఇంటికి మల్లిక అనే 15 ఏళ్ళ అమ్మాయి వచ్చి అయ్యా టీచరమ్మ మీకు పనిపిల్ల కావాలని సెప్పారు. మీరు సరే అంటే నేను సేస్తా అంటుంది. సరే టీచర్ చెప్పారు కదా అన్ని పనులు చేసిపెట్టాలని, జీతం ఎంతో చెప్పు అంటాడు. అయ్యా నాకు 200 ఇస్తే సాలయ్యా. కానీ నేను ఇక్కడే తింటా, ఇదే బయట గదిలో తొంగుంటా. నాకు ఈడ ఎవ్వరు లేరు. బేగా పక్కూరి నుంసి వచ్చి పని సేయాలంటే నాకు భయం అంటుంది. ఆలా అయితే మాకు కష్టం. ఈ ఇంటిలో ఒక గది తాళం మాకివ్వలేదు. ఇవ్వమన్నారు కూడా. పైగా నీవు చిన్నపిల్లవు. ఇక్కడ మాతో పాటు ఉండడానికి నేను ఒప్పుకోలేను అంటాడు.మల్లిక అట్టాయితే ఓ రెండు రోజులు చేసి, చూసి సెప్తా అయ్యా. మరొత్త అని వెళ్ళిపోతుంది.మరుసటి రోజు 8గంటలకు మల్లిక పనికి వస్తుంది. ఇప్పుడు వస్తే ఎలాగ, మా బ్యాంకులో నాతోపాటు పనిచేయడానికి వేరే ఆ యన కూడా ఈ ఊరికి వస్తున్నాడు. నేను వెళ్ళాలి అని వెళ్ళిపోతాడు.

విక్రమ్ రేవు వద్దకు బ్యాంకు లో తన సహద్యోగి ప్రశాంత్ ను పిలుచుకరావడానికి వెళ్తాడు. ప్రశాంత్ మరియు విక్రమ్ 5ఏళ్ళ నుంచి ఒకరికి ఒకరు బాగా తెలుసు.ప్రశాంత్ రాగానే ఇద్దరు సంతోషంగా మాట్లాడుకుంటారు.విక్రమ్ ఆ 4 ఊళ్ల విశేషాలు అన్నీ చెప్తూ ఉంటే ప్రశాంత్ వింటూ నేరుగా ఇద్దరు బ్యాంకు కు వస్తారు. అక్కడ అన్ని ఫైల్స్ చూసి ఊరిలో ప్రజలను కలవడానికి ఇద్దరు బయలుదేరుతారు. అప్పుడు విక్రమ్ టీచర్ సునీతని పరిచయం ఇలా చేస్తాడు." ఈమె ఈ ఊరిలో ఉన్న సరస్వతి దేవి. ఒకేఒక టీచర్." అప్పుడు ప్రశాంత్ ఎందుకు ఇక్కడ పోస్టింగ్ వేయించుకున్నారు? ఇంత మారు మూల గ్రామంలో ఇన్ని సంవత్సరాలు!గ్రేట్. మీరు ఎందులో B. Ed చేశారు అని అడుగుతాడు టీచర్ ని.

వెంటనే సునీత నేను కెమిస్ట్రీ ప్రొఫెసర్ ను. కానీ నాకు టీచింగ్ అంటే ఇష్టం. అందుకే మరి B. Ed కూడా చేసాను. ఇక్కడ ప్రజల గురించి తెలుసుకొని ఇక్కడ పోస్టింగ్ అడిగా, ఇంత మారుమూల ప్రాంతానికి ఎవ్వరు రావట్లేదు. అలా ఇక్కడే ఉండిపోయా అని చెప్తూ, అప్పుడు టీచర్ విక్రమ్ తో, అడగటం మరచిపోయాను.మల్లిక వస్తోంది కాదా, మంచి అమ్మాయి, బాగా పనిచేస్తుందిలెండి సార్, కానీ వంట పనికి వేరేవాళ్ళను చూస్తా,అనిచెప్పి క్లాస్ కు వెళ్ళిపోతుంది. ఆ ఊరిలో వీళ్ళు వెళ్తూ ఉంటే దేవరమ్మ కనిపిస్తుంది. అప్పుడు దేవరమ్మ గురించి కూడా ప్రశాంత్ కు విక్రమ్ చెప్తాడు. రెండు రోజుల్లో అమ్మవాస్య కదా చూద్దాం అని అనుకుంటారు.

మరుసటి రోజు పార్వతమ్మ అనే ముసలావిడ విక్రమ్ ను చూసి బాబు గారు ఎలా ఉన్నారు. వంట మనిషి కావాలన్నారట. ఓహ్ మీరు వంటామనిషా? అని అన్నాడు విక్రమ్. ఆమె నవ్వింది. ఎందుకో తెలీదు కానీ విక్రమ్ కు ఆమె చాలా ఆప్తురాలిగా అనిపించింది. ఆమె బాబు వయసు అయిపోయింది నాకు, మీకు వంట పని చేసి నేను మీతో పాటు ఉంటాను. నాకు ఎవ్వరు లేరు. ఇక్కడే ఎదో ఒక గది ఇస్తే ఉండిపోతాను అని అంటుంది. విక్రమ్ మనసులో ఎలాగో ముసలామె అనుకొని,సరే ఇంటి బయట తాళం వేసిన గదిలో ఉందువులే. కానీ తాళం టీచర్ వద్దే ఉంది అంటాడు. నాకు బ్యాంకు కు సమయం కావచ్చింది అంటే ముసలామె మీరు వెళ్ళండి బాబు,నేను టీచర్ తో మాట్లాడి తాళం తీసుకుంటాను అని అంటుంది.అప్పుడే ప్రశాంత్ గది నుంచి బయటకు వచ్చి వెళ్దామా విక్రమ్ అంటాడు. ఇద్దరు బ్యాంకు కు వెళ్ళిపోతారు.

ఇంతలో రెండు రోజులకు అమావాస్య రానే వస్తుంది. ప్రశాంత్ మరియు విక్రమ్ దేవరమ్మ జోస్యం చూడ్డానికి వెళ్తారు.

దేవరమ్మ ఊగిపోతూ ఉంటుంది.పుట్టు మూగ అని చెప్పే దేవరమ్మ మాట్లాడుతోంది.ఆమె గొంతులో ఏదో ఆద్రత, గంభీరమైన గొంతుకతో దేవరమ్మ ఏమిరా ఊరొదిలి పొమ్మన్నా కదా, పోరా? ఆ పిశాచాన్ని ఎంత కాలం ఆపేది. నేను లేనంటే అది ఊరిని మొత్తం తినేస్తుంది, అని చెప్తూవుంటుంది. అంతలోపే చెంచులు అయ్యో తల్లి నీవిట్టా మాట్లాడకు. మేము ఏడీకి పోలేము అని ఏడుస్తారు.

ఇంతలో అక్కడే జనం లో టీచర్ కనిపిస్తుంది. టీచర్ ను ప్రశాంత్, విక్రమ్ పలకరిస్తారు.ఇదంతా ఈ ప్రజలు ఎలా నమ్ముతున్నారో అని అంటాడు విక్రమ్. వాళ్ళే కాదు నేను కూడా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆమె మాటలో నిజం ఉంది అని అంటూండగానే ఒక ముసలాయన చనిపోతాడు. విక్రమ్ వాళ్ళ వద్దకు వచ్చి, ఎలా అయింది?ఏమైంది?అని అడుగుతుండగా,జనం చుట్టుముట్టి ముసలాయనను తీసుకెళ్లిపోతారు. దేవరమ్మ స్పృహ తప్పి పడిపోయింటుంది.విక్రమ్ ప్రశాంత్ తో, ప్రశాంత్ మనం వెళ్దామా వాళ్ళతో పాటు,అని అడుగుతుండగా, టీచర్ వొద్దు సార్ వాళ్ళ ఆచారాలు వాళ్లను చేసుకోనివ్వండి. నేను వెళ్తా మరి అని చెప్పి మీరు రండి సార్ అంటే సరే అని అందరు వెళ్ళిపోతారు.ప్రశాంత్ తన సూట్కేస్ సర్దుకోవడానికి గదిలోకి వెళ్తాడు, ఈ పిచ్చి జనం గురించి ఆలోచిస్తున్న విక్రమ్ వద్దకు ముసలామె పార్వతమ్మ వచ్చి బాబు వంట అయిపోయింది, ఎలా ఉంది మా ఊరు? ఈ ప్రజలు పిచ్చి వాళ్ళే, కానీ మంచి వాళ్ళు. రాజుకు ఈ అమాయకపు జనం అంటే చాలా ఇష్టం ఉండేది. ఏదేదో మంచి చేయాలి అని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరెవరో వీళ్ళని మోసం చేస్తున్నట్టు ఉన్నారు. ఈ లోకం లో ఎవ్వరితోటి ఏమి చెప్పకండి. ఎవ్వరిని నమ్మరాదు.నమ్మినవాళ్ళే ద్రోహులావుతారు. సరే బాబు మరి రేపు కలుస్తాను.మరి ఇప్పడు వెళ్ళనా అని వెళ్ళిపోతుంది. ప్రశాంత్ రాగానే విక్రమ్ ప్రశాంత్ తో ఏదో జరుగుతూంది. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళారు ముసలాయనని.హ్మ్మ్.......

మరుసటిరోజు ప్రశాంత్, విక్రమ్ టీ కొట్టు వద్ద టీ తాగుతుండగా టీచర్ కనిపిస్తుంది. వెంటనే టీచర్    హలో సార్ అని ఒక స్వీట్ ఉంచిన డబ్బా ఇస్తుంది. విక్రమ్ ఏమిటి మేడం స్పెషల్ అని అడుగగా, ఈరోజు మా చెల్లి పుట్టినరోజు. మా అమ్మ, మరియి చెల్లి అని ఫోటో చూపుతూ సంతోషంగా ఉంటుంది.వాళ్ళు ఎక్కడఉన్నా నాతో ఉన్నట్టే అనుకుంటాను. అందుకే నేను కొన్ని స్పెషల్ డేస్ ఇలా సెలెబ్రేట్ చేస్తుంటాను అని చిరునవ్వు నవ్వుతుంది. విక్రమ్ కూడా చిరునవ్వు నవ్వుకుంటాడు ఆమెను చూస్తూ,అయితే నాకు మీరు స్వీట్స్ బాకీ పడ్డారు మేడం. నేను ఊరేళ్తున్నా మేడం. మా తాతగారికి వొంట్లో బాగోలేదు అని బ్యాంకు కు ఫోన్ కాల్ వచ్చింది .ఏమి చేద్దాం ఇక్కడ ఒక సెల్ టవర్ కూడా సరిగా లేదు.అమ్మ నాన్న లేని నన్ను మా తాతే పెంచారు.ఏమవుతుందో అని కాస్త కంగారుగా ఉంది.అందుకే మీ స్వీట్స్ తినే అవకాశం మా ప్రశాంత్ కొట్టేసాడు .మా ప్రశాంత్ కు ఈ ఊరు కొత్త అని అంటూంటే, ప్రశాంత్ పర్లేదు విక్రమ్, యు క్యారీ ఆన్ అంటాడు. అంతలోనే రేవు వద్ద ఉన్న పిల్లాడు వచ్చి సారూ పడవ వచ్చిందండి అని అంటాడు.వెంటనే విక్రమ్ సరే మరి వెళ్ళొస్తా ప్రశాంత్, ఓకే టీచర్ అని బయలుదేరుతాడు.ప్రశాంత్ రేవు వద్దకు వెళ్తాడు విక్రమ్ తో పాటు. విక్రమ్ సరే ప్రశాంత్ అన్ని చూసుకో, అని బయలుదేరుతాడు.

 పది రోజులకు విక్రమ్ పట్నం నుంచి తిరిగి వస్త్తాడు. వస్తూన్నపుడు అతనితో పాటు ఒక యువతి నల్లటి అద్దాలు పెట్టుకొని వస్తూవుంటుంది.అప్పుడు వాళ్లకు టీచర్ కనిపించి, ఎలావుంది విక్రమ్ సార్ మీ తాత గారికి అని అడుగుతూ, ఇంతకు.....ఈమె ఎవ్వరు? అని అడుగుతుంది.అప్పుడు విక్రమ్ లేదు టీచర్ అంతా అయిపోయింది అని చెప్తూ ఈమె మా అక్క కమల అని పరిచయం చేస్తాడు. వెంటనే టీచర్ హలో అని షేక్ హ్యాండ్ ఇస్తుంది వెంటనే పలకరింపుగా ఆమె కూడా హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ టీచర్ చేయి వెతుకుతుంటే, విక్రమ్ టీచర్ చేయి కలుపుతాడు. వెంటనే టీచర్ మీరు......అని అంటూంటే విక్రమ్ అవును టీచర్ అంటాడు.కమల సారీ అండి నా కళ్ళు బావున్నాయని భగవంతుడు తనవద్దే ఉంచుకున్నాడు. నేను పుట్టుగుడ్డి అని చెప్తుంది. వెంటనే టీచర్ అయ్యో సారీ అండి మీరు ఆలా అనుకోవద్దు అని చెప్పి, సరే సార్ స్కూల్ టైం అయింది అని, బై కమల. మీట్ యు లేటర్ అని వెళ్లిపోతుంది.

విక్రమ్ కమలను ఇంటికి తీసుకెళ్తాడు. ప్రశాంత్ రండి కమల అని విక్రమ్ తో, విక్రమ్ ఇక్కడ ప్రతి పున్నమ ఈశ్వరుడి గుడిలో ఉత్సవం జరుగుతుందట. మొన్న పున్నమ రోజు ఉత్సవానికి కోడూరు ప్రజలు,రామాపురం ప్రజలు వచ్చారు.శంకర శర్మ అభిషేక జలం రెండు భాగాలుగా విభజించారు. కోడూరు ప్రజలకు గిరి పంపకం జరిపాడు అని చెప్తాడు. ఓహో అలానా చూద్దాం అంటాడు విక్రమ్. ఇంకా పట్నం లో ఏంటి సంగతులు అని అడుగుతాడు ప్రశాంత్. చాలా ఉన్నాయి అని అన్నీ చెప్తాడు.

ఆరోజు సాయంత్రం 6 గంటలకు విక్రమ్, కమల ను తీసుకొని టీచర్ ఇంటికి వెళ్తాడు.టీచర్ ఏమిటి ఇలా వచ్చారు సార్అని అడిగితే,విక్రమ్ టీచర్ ఒక సహాయం చేస్తారా అని అడుగుతాడు.టీచర్ చెప్పండి సార్ లోపలికి రండి కమల అని,కమల చేయి పట్టుకొని లోనికి తీసుకెళ్తుంది.విక్రమ్ టీచర్ తో మేడం మా అక్కను మీ ఇంట్లో ఉండనిస్తారా. నేను మీకు డబ్బులు కూడా ఇస్తాను. అక్కడ మేము ఇద్దరం మగవాళ్ళం, పైగా ప్రశాంత్ ఉంటే మా అక్కకు ఇబ్బంది మరియు ప్రశాంత్ కు ఇబ్బంది.మీరైతే ఆడవారు,మాకు ఎన్నింటికో సహాయం చేసినవారు అని చెప్తాడు. కాసేపు ఆలోచించాక టీచర్ సరే సార్, కమలకు ఇబ్బంది లేదంటే నాకు ఇబ్బంది లేదు అని చెప్పగా, కమల చాలా థాంక్స్ అండి అని చెప్పి, సరే విక్రమ్ నీవు వెళ్ళిరా అని చెప్తుంది. విక్రమ్ జాగ్రత్త అక్క అని వెళ్ళిపోతాడు. ఆ రోజు కాసేపు టీచర్, కమల మాట్లాడుకుంటారు.మాటల్లో కమల టీచర్ ని మీరు ఎక్కడినుంచి వచ్చారు, మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు అని అడుగుతుంది. మా నాన్న మా చిన్నప్పుడే చనిపోయారు. మా అమ్మ చాలా మంచిది. కానీ లోకానికి ఎప్పుడూ మంచి కనపడదు కదా అంటే కమల ఏంటి అంటుంది. వెంటనే టీచర్ నేను మా అమ్మ, మాచెల్లితోనే ఎప్పుడు ఉండేదాన్ని. నౌ ఐ ఆమ్ మిస్సింగ్  దెమ్, అని కళ్ళు తుడుచుకుంటుంది. టీచర్ కమల ను మీ అమ్మ నాన్న ఏమి చేసేవాళ్ళు అని అడుగగా కమల తెలీదు. మాకు గుర్తుకూడా లేదు. మా తాత మమ్మల్ని పెంచారు.అయన చెప్పారు వాళ్ళు ప్రమాదం లో చనిపోయారని. ఆలా ఒకరి గురించి ఒకరు తెలుసున్నారు.కమల ఆ రోజే ఇల్లంతా ఇంటి గోడలని తడిమి, సునీత తో చెప్తుంది నాకు ఇప్పుడు ఇల్లు ఎలా ఉందో అర్థమైంది. మీరు నిర్భయంగా మీ గదిలో పడుకోండి .నేను ఏ గది ఇస్తే అందులో పడుకుంటా అని చెప్పగానే సరే అని సునీత మరో గదిలోకి తీసుకెళ్తుంది. ఇద్దరు వారి గదులలో వాళ్ళు ఉంటారు.

మరుసటి ఉదయం విక్రమ్ టీచర్ ఇంటికి వస్తాడు. టీచర్ బయలుదేరుతూ, రండి విక్రమ్ అని,కమల..... విక్రమ్ వచ్చారు అని గట్టిగ పిలుస్తుంది. విక్రమ్ తో సరే సార్ మీరు మాట్లాడుకోండి, కమల వంటామె వంట చేసి టేబుల్ మీద పెట్టింది. ఏమైనా కావాలంటే ఇక్కడ టీకొట్టు అతనికి చెప్పు,నాకు వాళ్ళు చెప్తారు అని చెప్పి స్కూల్ కు వెళ్ళిపోతుంది. విక్రమ్ కమల తో ఎలావుంది? ఏమనిపిస్తోంది? అని అడుగుతాడు. చూడాలి ఇంకా ఒక్కపూటే కదా అని అంటుంది. సరే జాగ్రత్త.ఇది తీసుకో అని ఒక బాక్స్ ఇస్తాడు. కమల సరే నీవు వెళ్ళిరా అని ఈసారి అమావాస్య దేవరమ్మ జోస్యం కు నేనూ వస్తాను అని అంటుంది. తప్పకుండా వెళ్దాం. ఇంకో 9 రోజులు అంతే కదా అని వెళ్తూ,సరే మరి ఇంట్లో జాగ్రత్త . అని చెప్పి వెళ్ళిపోతాడు.

అమావాస్య రానే వస్తుంది. దేవరమ్మ జోస్యం చెప్పటం మొదలుపెడుతుంది. ఏమి రా వెళ్ళారా అని అడగగానే, విక్రమ్ కోపంతో ఆపు నీ నాటకాలు అని ఎవ్వరు ఎక్కడికి వెళ్ళరు. నీవు వెళ్ళమంటే వెళ్లిపోవాలా? అని అడుగుతాడు. వెంటనే టీచర్, గిరి, ఊరి పెద్దలు అందరు విక్రమ్ ని మీరు ఇలా మాట్లాడడం చాలా తప్పు.మీరైనా చెప్పండి మహేశ్వరవర్మ గారు అంటారు. మహేశ్వర వర్మ కోపం తో ఎక్కడి నుంచో వచ్చారు, మా ఊరి గొడవలలో మీరు తల దూర్చకండి. మా నమ్మకాలు మావి. మీరు నమ్మితే ఉండండి లేదంటే వెళ్లిపోండి అని అంటూండగా..... ఒక ఆమె పడిపోతుంది. ప్రజలందరూ ఏడుస్తూ ఆమెను కొండ మీదికి తీసుకెళ్ళడానికి వెళ్తారు. అందరు అరుస్తున్నారని విక్రమ్, ప్రశాంత్ అక్కడే ఉంటారు. కమల, టీచర్, మిగిలిన వారందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోతారు.

కాసేపయ్యాక అందరు పడుకుంటారు. ఎవ్వరో టీచర్ ఇంటికి వచ్చినట్టు అలికిడి విని కమల లేచి గది నుంచి బయటికి వచ్చి టీచర్ ని అడుగుతుంది.ఏమి సునీత ఏమి చేస్తున్నావు? ఎవ్వరైనా వచ్చారా? అని అడుగుతుంది. ఎందుకలా అడుగుతున్నావు అని అడుగుతుంది సునీత.లేదు టీ వాసన వస్తోంది. అందుకే అడిగాను అంటుంది. నాకు కొంచం స్కూల్ పని ఉంది. అందుకోసం నేను టీ చేసుకున్నాను.నీకు కావాలా అని అడుగుతుంది.వొద్దు నేను వెళ్లి పడుకుంటాను అని కమల వెళ్ళిపోతుండగా, కమల "నేను గిరి కి పుస్తకాలు ఇచ్చాను అవి తీసుకొని స్కూల్ లో పిల్లల వార్షికోత్సవానికి ఇద్దరం వెళ్లి స్కూల్ లో కొన్ని అలంకరణ చేయాలి "అని ఒక బ్యాగ్ లో కొన్ని బాక్స్ లు తీసుకొని వెళ్లిపోతూ నేను లాక్ చేసుకొని వెళ్తున్నాను. అని చెప్పగా కమల భయంగా అవునా, సరే జాగ్రత్త అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతుంది.కమల గదిలోకి వెళ్లి విక్రమ్ కు మొబైల్ కాల్ చేయగానే విక్రమ్ కు కాల్ కలవదు. సరే అని నిద్రపట్టక ఇంటిలో అటూ ఇటూ  తిరుగుతూ ఉంటుంది. కాసేపయ్యాక వెళ్లి పడుకుంటుంది.

మరుసటి ఉదయం విక్రమ్ టీచర్ ఇంటికీవస్తాడు. అప్పటికే టీచర్ స్కూల్ కు వెళ్ళి ఉంటుంది. కమల జరిగినది చెప్పి ఇంకా ఎదో మాట్లాడుకుంటారు. సరే అని విక్రమ్ వెళ్ళిపోతాడు.ఆ రోజు కోడూరు మరియు రామాపురం లో ప్రజలని కలిసి బ్యాంకు పథకాలను వివరించడానికి ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళను కలుస్తుంటాడు. ఒక ఇద్దరి, ముగ్గురి ఇండ్లలో కొన్ని మందులని గమనిస్తాడు. వాటి గురించి అడుగగా టీచర్ అమ్మ పిల్లల కు వొంట్లో బాగాలేనపుడు ఇచ్చిందని చెప్తారు. విక్రమ్ దేవరమ్మ ఇంటికి వెళ్ళడు.

విక్రమ్ టీచర్ స్కూల్ కి వెళ్లి పిల్లల తల్లి తండ్రులను కలుస్తాడు. అలానే టీచర్ ని కూడా కలిసి మీరు చాలా గొప్పవారు, చాలామందికి అనారోగ్యం తగ్గిస్తున్నారు మందులు ఇచ్చి. మీకు మందుల గురించి జబ్బులగురించి ఎలా తెలుసు అని అడుగుతాడు. టీచర్ నేను ఆయుర్వేదం కూడా తెలుసుకున్నాను నాకు ఆలోపతి మందులు తెలుసు ఎందుకంటే నేను కెమిస్ట్రీ చదివాను. అలా ఆయుర్వేదం ఆలోపతి కలిపి వీళ్లకు ఇస్తూంటాను. తగ్గకపోతే పట్నం వెళ్ళమంటాను అని చెప్తుంది. విక్రమ్ వెంటనే ఓహో అలానా అని, ఈరోజు మా ప్రశాంత్ పుట్టినరోజు. ఎప్పుడు వాళ్ళ అమ్మగారు పుట్టినరోజు కు ఈశ్వరాభిషేకం చేయించే వారట. ఈసారి ఇక్కడ గుడిలో ఇవ్వాలనుకుంటున్నాడు. గుడి ఎప్పుడు తెరుస్తారు అని అడిగారు.గుడి తెరువరు. గుడిలో ఏదో అరిష్టం జరిగిందట అని చెప్తుంది. ఏమిటది అని అడిగాడు విక్రమ్. రాణి గారు గుడిలో మరణించారట. నాకు అంతే తెలుసు అని చెప్తుంది.

ఆ రోజు సాయంత్రం ఈ విషయాలు మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తారు విక్రమ్ మరియు ప్రశాంత్. ప్రశాంత్ కు ఇంటి నుంచి ఫోన్ కాల్ వస్తే సిగ్నల్ కోసం మేడ మీదికి వెళ్తాడు. విక్రమ్ పార్వతమ్మ కాఫీ అని అంటాడు.

పార్వతమ్మ తెస్తున్న బాబు అని తెచ్చి ఇస్తుంది.అప్పుడు పార్వతమ్మ విక్రమ్ తో బాబు ఏమనుకుంటున్నారు అని అడుగుతుంది. నేను పని మీద బయటికి వచ్చా. మీరు ఊరి ప్రజలను కలిశారని తెలిసింది. టీచరమ్మ ఏమన్నారు? 9 ఏళ్ళ కిందట కూడా ఇలా ప్రజలు చనిపోయేవారు కాదు. గిరి కూడా 11ఏళ్ళు అయింది వచ్చి. ఒక్కోసారి అనిపిస్తుంది కొత్తవాళ్ళు కూడా మోసం చేయడానికి వస్తారా అని అంటుంది. వెంటనే లేదు పార్వతమ్మ మేము ఎవ్వరిని మోసం చేయము అంటాడు. మీరు మా మనుషులండి. మాకోసం వచ్చారు. మీ ముందు ఎవ్వరెవ్వరు వచ్చారో వాళ్ళు ఎటువంటివాళ్ళో అని అనుకుంటూంటాను అని చెప్పి,మా గుడి చాలా బావుంది బాబు.

ఒకప్పుడు ఎప్పుడూ పూజలు, ఉత్సవాల తో కళకళళాడేది. ఎవ్వరికి చెప్పకండి గుడిలో కూడా సొరంగాలు ఉన్నాయి. అవి తెరుచుకుంటే మంచి జరగుతుందేమో అని నమ్మకం.ఈ విషయం గురించి ఆలోచించండి బాబు. ఊరిని కాపాడండి నేను వెళ్ళొస్తా బాబు అని వెళ్ళిపోతుంది. ప్రశాంత్ పైనుంచి వస్తాడు.

విక్రమ్, ప్రశాంత్ తో గుడి లో ఎదో జరగుతోంది ప్రశాంత్ అని అంటాడు. అస్సలు గుడిలో సొరంగాలు ఉన్నాయని మనకు ఇతకుముందు ఎవ్వరు చెప్పలేదు అని అంటాడు. ప్రశాంత్ ఇప్పుడెలా తెలిసింది అని అంటాడు. అబ్భా ..... పార్వతమ్మ అంటాడు విక్రమ్ బయటకు చేయి చూపుతూ. ఎప్పుడు? ఎక్కడ?అంటాడు ప్రశాంత్. అబ్బా ప్రశాంత్ అది కాదు మనం గుడిలోనికి ఎలా వెళ్ళాలి. అది ఆలోచించు అంటాడు. వెంటనే ప్రశాంత్ కమల అని గుర్తు చేస్తాడు. అవును అదే ఉత్తమం. కానీ కమల అంటే మనం సమయం కోసం ఆగాలి. చూద్దాం అంటాడు విక్రమ్ .

మరుసటి ఉదయం టీచర్ ఇంటికి వెళ్లి కమలను కలుస్తాడు విక్రమ్ .కమల తో కళ్ళతో కాకుండా మనో నేత్రంతో ఈశ్వర దర్శనం మరియు గుడి ప్రదక్షిణం చేసుకొనిరా.మనో నేత్రంతో దర్శనం చేసుకుంటే జ్ఞాననేత్రం వికసిస్తుంది. అని అంతే కదా టీచర్ మా తాత ఎప్పుడూ చెప్పేవాడు ఇలాంటి మంచి మాటలు. మీరు కమలను తీసుకెళ్లండి, తను చాలా బాధ పడుతోంది తాత కోసం,అని అంటాడు. టీచర్ సరే సార్ అంటుంది.

అప్పుడు, సునీత : కమల ఈ రోజు వెళ్దామా అని అడుగుతుంది . కమల వొద్దులే సునీత మనం పున్నమ రోజు వెళ్దాం. చాలా శ్రేష్టం కదా అంటుంది. సునీత పున్నమ రోజు చాలా జనం ఉంటారు. కష్టమేమో అంటుంది.పరవాలేదు టీచర్ మీకు తోడుగా నేను ప్రశాంత్ కూడా ఉంటాము అంటాడు విక్రమ్ . టీచర్ హ్మ్ సరే అంటుంది.

పున్నమ ముందు రోజు గిరి టీచర్ ఇంటికి వస్తాడు.కమల,సునీతతో ఎవ్వరు వచ్చారు?అని అడుగగా సునీత ఎవ్వరూలేదు అంటుంది. మరి నాకు టీ వాసన మరియు చుట్ట వాసన వస్తోంది అంటుంది. టీచర్ (విసుగుగా )గిరి వచ్చాడు,కొంచం పనులు ఉన్నాయి గుడి వద్ద మాకు అని వెళుతుండగా, కమల సునీత నేను వస్తాను. నీవే చెప్పావు కదా రేపు చాలా జనం వస్తారని, ఈ రోజు అయితే నేను నా చేతులతో ఈ గుడి శిల్ప కళను చూడచ్చు. కళ్ళు లేని నాకు చేతులే కదా కళ్ళు అంటుంది.గిరి ఆశ్చర్యం గా సునీత వైపు చూస్తాడు. సునీత కళ్ళతోటే గిరికి సమాధానం చెప్పి, సరే అని  కమలను తీసుకెళ్తుంది.

మరుసటి రోజు ఉత్సవంలో కొద్దిమంది ఎవ్వరో గుర్తు తెలియని వాళ్ళు వచ్చి సునీతను, గిరిని రేవు వద్దకు లాక్కెళ్ళి, మత్తుమందు ఇచ్చి,పడవలో రేవు దాటుకొని పట్నం తీసుకెళ్తారు.

అక్కడ సునీత, గిరిని ఒక్కొక్కరిని ఒక్కో గదిలో ఉంచింటారు.ఎవ్వరు మీరు, ఎందుకిలా అని అడుగుతుండగా, విక్రమ్, ప్రశాంత్ వస్తారు.వాళ్ళు సునీత తో ఏమిటి టీచర్ ఎలా ఉన్నారు. మీలాగా మాకు మెడిసిన్స్ ఇచ్చే నాలెడ్జ్ లేదు మేడం, అందుకే అనస్తేషియా ఇచ్చాము అని అంటాడు.సునీత మీరు ఇక్కడ అంటూ ..... (అని ఆశ్చర్యంగా చూస్తుంది ). ఎవ్వరు మీరు అని అడుగుతుంది. వెంటనే విక్రమ్, తన మొబైల్ లో ఉన్న ఆఫీస్ డ్రెస్ లో ఉన్న ఫోటో చూపుతాడు.విక్రమ్ సిబిఐ ఆఫీసర్. ప్రశాంత్ కూడా విక్రమ్ బ్యాచ్ అని తెలుసుకొని సునీత తల దించుకుంటుంది.

విక్రమ్ చెప్పండి సునీత. ఎందుకు చంపుతున్నారు? అని అడుగుతాడు. నేను న్యాయం చేస్తున్న. చంపటం లేదు అని అంటుంది. ఏమి న్యాయం మీ అమ్మను ఊరి జనం చంపారని ప్రతీకారం అంతే కదా అంటాడు.

సునీత ఆశ్చర్యంగా మా అమ్మ విషయం మీకెలా తెలుసు అని అడుగుతుంది. విక్రమ్ వెంటనే ఒక ఫోటో చూపుతాడు. ఈయన ఎక్కడున్నారు?. అని సునీత ఏడుస్తుంది. ఈయన నన్ను పెంచిన తాత.మీ అమ్మ ఆయన కూతురు. ఆయన ఎప్పుడు చెప్పేవాడు మీ అమ్మ చాలా గొప్ప ఆమె అని. వెంటనే సునీత అవును. అటువంటి ఆమెను ఆ ఊరు పొట్టన పెట్టుకుంది అని ఏడుస్తుంది. తప్పు సునీత. ఊరి ప్రజలు ఆలా చేయడానికి కారణం ఎవ్వరో వారిని తెలుసుకో. వాళ్లకు శిక్ష పడేలా చూడు.జరిగినది తెలుసుకో అని అంటాడు. సునీత ఇంతకు మీరు ఎలా మా తాతాను కలిసారు అని అడుగగా, విక్రమ్ సునీతతో నా పూర్తిపేరు విక్రమసింహ భూపతి అనగా సునీత విక్కీ.....అని ఏడుస్తుంది. అవును గుర్తుందా? పరవాలేదే అంటాడు . సునీత సరే అన్ని చెప్తాను. కానీ ముందు మీరు ఇది చెప్పండి. మీరు ఎలా తెలుసుకున్నారు మా గురించి? అని అడుగుతుంది.

నేను వచ్చిన రోజు ఊరంతా తిరిగాను. ముందు 18 ఏళ్ళ దేవరమ్మ మీద అనుమానం వచ్చింది. మా తాతకు బాగోలేదని ఇక్కడికి వచ్చినపుడు అనుకోకుండా దేవరమ్మను కలిశాను. తను పుట్టుమూగ కాదు అని అర్థమైంది. నిలదీసాను తనని. నేను సిబిఐ ఆఫీసర్ ని అని చెప్పాక తను సార్ ఊరిని కాపాడండి అని ఏడుస్తూ,అందరూ అమాయకులు. చదువు లేని వారు.

నేను 11ఏళ్ళ చిన్న పిల్లని. మా అమ్మమ్మ ఒకరోజు చనిపోయింది. ఆచారం ప్రకారం ఊరివాళ్ళు కొండ మీద వదిలారు.మా అమ్మమ్మ ఎప్పుడు చెప్పేది దేవుడు మనసారా మొక్కితే కాదనకుండా ఇస్తాడని. అందుకే నేను బాధ ఎక్కువై అమ్మమ్మకు ఇష్టమైన దేవుడి బొమ్మ తీసుకొని అమ్మమ్మ వద్దకు వెళ్ళాను. అప్పుడు టీచర్, గిరి, ఇంకా ఎవరెవ్వరినో చూసాను.ఇది మనుషులపని అని భయం తో పారి పోయి, పడవలో దాక్కొని ఇక్కడికి వచ్చేసా. నన్ను ఇక్కడ ఒక దేవుడు లాంటి మనిషి చేరదీసి తన ఆశ్రమం లో చేర్చుకొని చదువు నేర్పించాడు.ఆ తరువాత నేను ఊరిని కాపాడాలి అని అలోచించి ఊరి జనం మూఢ నమ్మకాలతో, ఎలా ఐన వాళ్లను ఊరినుంచి పంపించేయాలి అని అనుకున్నాను.అందుకని ఊరికెళ్లి మాటలు రానిదానిలా మసలుకుంటూ ఉండేదాన్ని.

 ఒకరోజు నేనే ఎవ్వరు చూడకుండా అమ్మవారి విగ్రహం కోనలో చెట్టు కింద దాచి, మరుసటి ఉదయం పూనకం వచ్చినట్టు ఊగుతూ, ఊరి ప్రజలను ఆ ఊరినుంచి వెళ్ళమని చెప్పాను.కొన్ని నెలలకు ఒక కుటుంబం వెళ్ళిపోయింది.ఇలానే అన్ని కుటుంబాలను కాపాడాలి అని అనుకున్న.మీరు ఎలాగైనా ఆ ఊరి ప్రజలను కాపాడండి అని చెప్పింది.

అప్పుడు అర్థమైంది నీవేంటో అని. అందుకే మా బ్యాచ్ కమలని గుడ్డి ఆమెలా, నాకు అక్కలా పరిచయం చేసి, నీవు, గిరి చేసిన పనులు వీడియో తీసాము అంటాడు.

విక్రమ్ ఇంకా సునీతతో మా తాత చనిపోతూ నాకు కొన్ని జరిగినవి చెప్పాలి అని,ఆయన తను రాజుగారితో కలిసి ఉన్న ఫోటో చూపారు. అందులో నేను,నీవు కూడా ఉన్నాము మరియు నాకు నీవు ఫోటోలో చూపిన మీ అమ్మ కూడా ఉంది.నేను తాతాను అడిగాను.ఈమె ఎవ్వరు. జరిగినది చెప్పమని అడిగాను.

తాత ఇలా చెప్పారు.

"మీరు మాకు దేవుడిలాంటి వాళ్లు. నేను మీ ఆస్థాన అధికారిని. మాకుటుంబం అంతా మీ కోటలో అన్ని అవసరాలు సక్రమంగా జరిగేలా చూసేవాళ్ళం. నాకు ఒక కూతురు.నా కూతురి పెళ్లి కూడా మీ కుటుంబం దయవల్లే జరిగింది. కానీ కొన్నిరోజులకు మా అల్లుడు కాంతయ్య రేవులో మునిగిపోయాడు. అప్పటి నుంచి మా కూతురు నాతో పాటు మీ కోటలో ఉంటూ ఉండేది."

ఆయన (తాత )నాతో బాబు "నీవు జయసింహ భూపతి రాజు గారి సొంత తమ్ముడైన ప్రతాప సింహ భూపతి కొడుకువి. జయసింహ భూపతికి పిల్లలు లేరు. అయన తన స్నేహితుడు మరియు సామంత రాజైన రాజగోపాలవర్మ కొడుకైన కార్తికేయ వర్మను చేరదీశారు. రాజగోపాల వర్మ తన ఆస్తిని మొత్తం పోగొట్టుకొని, రాజు చేరదీసినందుకు రాజువద్ద నమ్మిన బంటులా ఉంటూండేవాడు.మీ నాన్న గారు అప్పటికే లండన్ లో లా చదివారు. అక్కడే లాయర్ గా స్థిరపడ్డారు. ఒకసారి నిన్ను తీసుకొని కోటకు వచ్చారు. నీకు మీ పెద్దనాన్న గారితో చాలా అనుబంధం ఏర్పడింది. మీ పెద్దమ్మ గారికి, అంటే రాణి గారికి కూడా మీరు అంటే చాలా ఇష్టం. వాళ్ళు మిమ్మల్ని వదిలి ఉండలేక పోయేవాళ్లు.ఇది చూస్తున్న మీ అమ్మగారికి అంటే శశికళ భూపతికి కాస్త అసూయ కలిగేది."

"శశికళమ్మ మీ నాన్న గారితో మనము లండన్ వెళ్ళిపోదాము అని పట్టుబట్టేది. ఒకరోజు కార్తికేయ వర్మ పనిమీద ఊరికెళ్లారు.నేను నా చిన్న మనమరాలుకు వొంట్లో కులాసాగ లేదని పట్నం వెళ్లి వచ్చాను. తిరిగి వచ్చే సమయానికి రాజు గారి గది మూతబడి ఉంది.రాజు గారు అతిథి గృహంలో చనిపోయి రక్తపు మడుగులో పడి ఉన్నారు .మీ పెద్దమ్మ గారు నాకు ఒక హారం ఇచ్చి నీకు ఇది అందజేయమని, మరియు మీ నాన్న అమ్మను కాపాడమన్నారు. నేను సరే అని బయటికి వస్తుండగా అంతలోనే చాలా మంది జనం నా కూతురు హంతకురాలని రాళ్లతో కొట్టారు. అందరిని ఎదిరించి నేను తనని లోనికి తీసుకెళ్లే సమయం లో ఆమె తుదిశ్వాస విడుస్తూ, నేను హత్య చేయలేదు అని,సునీత, వనిత లను నాకు అప్పాజెప్తూ తెలియక మనం తప్పు చేసాము. ముందు ప్రతాప సింహ గారిని కాపాడు నాన్న.కళ అమ్మ.......అంటూ చనిపోయింది. నేను ఇద్దరి పిల్లల్ని తీసుకొని, పడవ ఎక్కాను . ప్రతాపసింహ గారు నిన్ను తీసుకెళ్తూ వేరే పడవలో కనిపించారు.నేను చాలా వేగంగా ఆయన వద్దకు చేరుకున్నాను. ఆయనకు అప్పటికే ఎన్నో గాయాలయ్యాయి. ఆయన నాకు నిన్ను అప్పగించి, స్పృహ కోల్పోయారు. అంతలోనే పడవకు ఏదో తగిలింది. చిన్నగా పడవలో నీళ్లు చేరాయి. వనిత, సునీత ఆ ప్రమాదం లో కొట్టుకుపోయారు. బహుశా మరణించారేమో అని ఏడుస్తూ, ఆయనను పట్నం ఆసుపత్రికి తీసుకొచ్చా. అక్కడ తెలిసింది ఏమిటంటే నా అల్లుడు కాంతయ్య ఇంతటి ఘాతుకం చేశాడు.ఇంకా ఇందులో ఎవ్వరో తెలిసినవాళ్ళే ఉండవచ్చు అని చెప్పి మరణించారు.ఇదిగో బాబు, మీ పెద్దమ్మ గారు ఇచ్చిన తరాల నాటి హారం ఇది" అని ఇచ్చి కన్ను మూసారు.

నేను అడిగి మరి ఆ ఊరికి పోస్టింగ్ వేయించుకున్నాను.నీవు మీ అమ్మగారి ఫోటో చూపి, మీ కుటుంబం గురించి చెప్పిన రోజు అర్థమైంది. నీవు ఎవరివని. తప్పు చేసినది మీ నాన్న. ఆయనతో చేయించిన వాళ్ళతో నీవు చేయి కలిపావు అంటాడు.అందుకే మా పనామె పార్వతమ్మ నిన్ను నమ్మద్దని చెప్తూ ఉంటుంది. అంటాడు. 

వెంటనే సునీత లేదు విక్రమ్ సార్,నేను చేసిన తప్పును సరిచేసుకుంటాను. మీకు సహాయం చేస్తాను అని చెప్తుంది.కానీ ఈ పార్వతమ్మ ఎవ్వరు. మీకోసం మల్లికను మాత్రమే మాట్లాడాను. మల్లికనే మీకు రోజు వండి పెట్టేది అని చెప్తుంది.

వెంటనే ప్రశాంత్, అవును విక్రమ్ చాలా సార్లు నేను కూడా అడుగుదామనుకున్న. ఎవ్వరు ఈ పార్వతమ్మ?అని. వెంటనే విక్రమ్ ఏంటి ప్రశాంత్, ఎప్పుడు నీవు మనం ఉన్న ఇంటిలో పార్వతమ్మను చూడలేదా? అయినా అలా అంటావేంటి ప్రశాంత్, అక్కడే మొదట మనం వెళ్ళినపుడుతాళం వేసి ఉంచిన గదిని శుభ్రం చేసుకొని ఉండమన్నాను నేను. రోజు ఆ గదిలోనే ఉండేది కదా అంటాడు.

వెంటనే సునీత ఆ గదిలో పూర్తిగా ఆ ఇంటి వాళ్ళ సామాన్లు ఉంచి తాళం వేసి మీరు వస్తారని మిగితా ఇల్లు శుభ్రం చేసి ఉంచమని గిరికి చెప్పాను.గిరి కూడా అలానే చేసాడు. చేసి నాకు ఫోటో కూడా పంపాడు అని, సామాన్లు ఉన్న గది ఫోటో చూపుతుంది.

వెంటనే విక్రమ్ ఆశ్చర్యంగా ఒక్క నిమిషం అని, ప్రశాంత్ వెళ్లి ఆర్టిస్ట్ పక్కనే ఉన్నారు తీసుకురా అంటాడు. ఫోటోనే చాలా సేపు చూస్తూ ఉంటాడు.

ఇంతలో ఆర్టిస్ట్ వస్తాడు. వెంటనే విక్రమ్ చూడు ఈ ఫొటోలో ఉన్న ఈమెను 80 ఏళ్ళ ముసలామెలా వేసి చూపించు అంటాడు. ఆర్టిస్ట్ అలానే అని వేసి చూపగా. విక్రమ్ పర్ఫెక్ట్ అని, చూడండి ప్రశాంత్ అండ్ సునీత.ఈమె గురించే చెప్తున్నా అంటాడు. సునీత ఈమె ఫోటో ఆ ఇంట్లో ఉంది అంటే ఈమె ఆ ఇంటికి సంబంధిన ఆమె అనుకుంటా. కానీ ఆ ఇంట్లో వాళ్ళు అందరు మరణించి చాలా కాలం అయింది అనగా విక్రమ్, ప్రశాంత్ ఆశ్చర్య పోతారు.

ఆ ఊరిలో జరుగుతున్న సంఘటనలు, వాటి మూలాలు వచ్చే భాగం లో తెలుపుతాను.



Rate this content
Log in

Similar telugu story from Horror