STORYMIRROR

Swarnalatha yerraballa

Horror Crime Thriller

4  

Swarnalatha yerraballa

Horror Crime Thriller

కోటలో కారుచీకట్లు 2

కోటలో కారుచీకట్లు 2

20 mins
523

జరిగిన కథ :

సునీత, గిరి చేస్తున్న పనులను కమల ద్వారా తెలుసుకున్న, విక్రమ్, ప్రశాంత్ సునీతను విచారిస్తూండగా, పార్వతమ్మ విషయం అందరికి ఆశ్చర్యం వేసింది.


విక్రమ్ అస్సలు ఎవ్వరు ఈమె. నాకు మాత్రమే  ఎందుకు కనిపించేది? ఊళ్ళో వాళ్లకు అనుమానం రాకుండా ఎవ్వరిని అడిగి కనుక్కోవ్వాలి? అని అంటాడు. సునీత నేను కనుక్కుంటాను అని అంటూండగా,అంతలోనే కమల అక్కడికి వస్తుంది.వెంటనే కమల నీ నుంచి మేము తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది సునీత. నిన్ను మేము ఎలా నమ్ముతాము. ఐదు ఏళ్ళ క్రితం ఒక డాక్టర్ ని చంపావు. గుర్తుంది కదా. ఎందుకు చంపావు. అస్సలు అందరిని ఎందుకు చంపుతున్నావు? నీ నుంచి ఎంత మంది జీవితాలు తారుమారు అయ్యాయో నీకు ఏమి తెలుసు? మీ అమ్మ మరణంకు ప్రతీకారంగా నీవు ఎంతోమందిని చంపావు. మరి నీవు నా భర్తను చంపినందుకు నేను ఏవిధంగా ప్రతీకారం తీర్చుకోవాలి? అని ఏడుస్తుంది.


వెంటనే ప్రశాంత్, కమల కామ్ డౌన్ అని ఓదారుస్తాడు. విక్రమ్ కమలతో, కమల సునీత మనకు సహాయం చేస్తానంది అని అంటాడు.


సునీత దించిన తలను ఎత్తకుండా కమలతో, కమల నేను ఆ ఊరి జనాన్ని మాత్రమే చంపడానికి సహకరించాను. మీ భర్తను నేను చంపలేదు. అయన ఎవరో కూడా నాకు తెలీదు అంటుంది కన్నీళ్ళ తో.


అయన ఆ ఉరికొచ్చిన డాక్టర్ అని కమల చెప్పగా. సునీత డాక్టర్ ని నేను కాదు కమల చంపినది. అస్సలు అయన శవాన్ని చూసి నేను కూడా ఆశ్చర్య పోయా. ఎందుకంటే డాక్టర్ వస్తువులను చూసి డాక్టర్ శవం అని అనుకోవాలి తప్ప అస్సలు గుర్తుపట్టే విధంగా లేదు. ఆరోజే గిరిని కూడా అడిగా, గిరి కూడా తన ప్రమేయం లేదన్నాడు అని చెప్తుంది.వెంటనే కమల సునీతతో, నీతో ఎవ్వరు ఇలా హత్యలు చేయిస్తున్నారు అని అడుగుతుంది.


సునీత బదులుగా,నేను ఊరొచ్చిన 2నెలలకు ఒకసారి ఎలాగైనా అమ్మ చనిపోయిన చోటుకెళ్లాలని వెళ్ళాను.చాలా సేపు నేను పసితనం నుంచి పడిన కష్టాలు, అమ్మ చనిపోతూ పడ్డ బాధ అన్ని గుర్తుకొచ్చి, నన్ను నేను నిభాయించుకోలేక చాలా ఏడుస్తున్నపుడు ఎదో అలికిడి వినపడింది. ఎదో బాధగా ఒకరి అరుపు అంతలోనే భీకరంగా నవ్వు.ఎందుకో భయమనిపించి వచ్చేసా.


వచ్చిన రోజు రాత్రి పడుకున్నప్పుడు ఇంటి తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది.భయంగా తెరిచి చూసా. ఒక కాగితం ఉంది.తెరిచి చూసా. అందులో

నీవు ఎవరివో నాకు తెలుసు. నీవు కొండ మీద మీ అమ్మ కోసం ఏడుస్తూ, ఈ ఊరి నాశనం కోసం చూస్తున్న అన్నమాట నాకు తెలుసు. నాకు ఈ ఊరి జనం అడ్డుగా ఉన్నారు. కావున ఇద్దరం ఈ ఊరి ప్రజలని అడ్డు తొలహించుకుందాం. నీవు దీనికి ఒప్పుకుంటే రేపు రాత్రి సోమనాథ గుడి వద్దరా. అని ఉంది.


నేను ఆ ఉత్తరం తీసుకొని మరుసటి రోజు గుడి వద్దకు వెళ్ళాను.అప్పుడు మారుతి పటేల్ అక్కడ కనిపించారు. ఆయన వెంట గిరి కూడా ఉన్నాడు.నేను గిరి ని అదే మొదటి సారి చూడటం. ఆయనా నా వద్దకొచ్చి "నమస్తే టీచర్.ఎలా ఉన్నారు అని అడిగి, మీరైనా ఈ ఊరి బాగుకోసం కృషి చేయండి. ఇక్కడ అందరికి చదువులేదు. ఏమి తెలీదు. కొండజాతి చెంచులు. వాళ్లకు చదువు చెప్తూ ఇక్కడే ఉండండి. ఈ ఊరికి ఆట్టా వచ్చి ఇట్టా వెళ్లిపోయే వాళ్ళే తప్ప, ఇక్కడ మనుషుల గురించి ఎవ్వరూ ఆలోచించారు. ఇదిగో ఈడు గిరి.ఈడకు కొత్తగా వచ్చినాడు.కొంచం కాలు సరిగా లేదు, కాస్త నత్తి .అందుకని పట్నం లో అవమానాలట.ఇక్కడ పనిచేసుకొని బతకడానికి వచ్చాడు.పదో తరగతి దాకా చదివాడట అమ్మ. పట్నం లో స్కూల్లో పని చేసేవాడట. ఇంక ఏపని రాదంట. ఎవ్వరితోటి మాట్టాడడు. స్కూల్ లో ఏదైనా పని ఉంటే ఇప్పిస్తావేమో అని అడుగుతున్నా అన్నాడు.


నాకు ఉత్తరం లో ఉన్నది ఒకటి, ఈయన మాట్లాడుతున్నది ఒకటి అని,ఏమి తోచక సరే అన్నాను. కాసేపు ఆ ఊరి విషయాలు ఆయన చెప్తూంటే విన్నాను. మధ్యలో మా అమ్మ నుంచే రాజు చనిపోయాడని చెంచులు అందరు కలిసి ఆమెను చంపారు అని చెప్పారు.అప్పుడు ఉత్తరంలో ఉన్న మాటలను నిజం చేయాలనిపించింది.

ఆ ఉత్తరం గురించి మారుతి పటేల్ గారితో నేను," ఈ ఉత్తరం" అని అడుగుతూండగా, గిరి నా మాటని ఆపి అయ్యోరు మీ కోసం పెద్దలు అందరు ఎదురు చూస్తున్నారు. నేను టీచర్ తో మాట్లాడుతాలెండి అని అనగా మారుతి పటేల్ గారు వెళ్లిపోయారు.


ఆ రోజు గిరి, నేను మాట్లాడుకుంటూండగా తెలిసిందేమింటంటే గిరికి డబ్బు కావాలి అందుకు ఇటువంటి పని చేయడానికి ఒప్పుకున్నాడు. నేను చాలా ఆలోచించా,కానీ అప్పుడు నా కోపం నన్ను జయించింది. నేను చంపడం మొదలుపెట్టాను.నాకు జరిగిన విషయం తెలియదు. మా నాన్న నుంచి ఒక కుటుంబం నాశనమైపోయింది, నా వాల్ల ఒక ఊరి ప్రజలు బలయ్యారు. ఇప్పుడు మీరు ఏది చెప్తే అదే చేస్తాను. మీకు సహాయపడి ఆ తరువాత శిక్ష అనుభవిస్తాను. నన్ను నమ్మండి అని అంటుంది.


విక్రమ్, కమలతో: కమల,సునీతను మనం నమ్మచ్చు. ఇప్పుడు మనం నలుగురమాయ్యాం. ఎలా అయినా వెళ్లి రహస్యాన్ని తెలుసుకుందాం అని అంటాడు.వెంటనే సునీత విక్రమ్ తో, విక్రమ్ మనం గిరి స్థానం లో ఎవ్వరినైనా తీసుకెళ్లాలి. లేదంటే మనకు కష్టం అవ్వచ్చు అని అంటే,కమల మొదట గిరి గురించి కనుక్కుందాం. గిరి మనకు సహాయం చేస్తే గిరిని తీసుకెళ్లడం ఉత్తమం. లేకపోతే కష్టం అనిచెప్తుంది.


అప్పుడు సునీత గిరిని మనం నమ్మలేము. తన గురించి ఏమీ తెలీదు మనకు. మీ ఆఫీసర్స్ లో ఎవరైనా ఒకరు గిరి స్థానం లో ఉంటే మేలు. గిరి పున్నమ రోజు గుడి తీర్థం లో ఊరి జనం లో ఒకరికి కలిపి ఇవ్వడానికి ఒక మందు ఇచ్చేవాడు. ఆ మందు ఇచ్చిన వాళ్ళు మాత్రమే మరణించే వారు. మరలా జోస్యం చెప్పే సమయం లో లేదా ఆ రోజు రాత్రికి నాకు ఇంకొక మందుల బాక్స్ ఇచ్చేవాడు.అందులో రెండు మందులు ఉండేవి. ఒకటి నాచే చనిపోయిన వాళ్ళ శవం కు ఇంజక్షన్ చేయమని మాత్రమే చెప్పారు. నేను ఇంజక్షన్ చేసి వచ్చేసేదాన్ని.ఆ రెండో మందు గిరి ఏమీ చేసేవాడో నాకు తెలీదు.దేవరమ్మ జోస్యం అయిన మరుసటి రోజు వారి బట్టలు మాత్రమే ఊరి జనం కు కనిపించేవి.నాకు అంత మాత్రమే తెలుసు. ఆ శవాన్ని ఏమీ చేసే వాళ్ళో నాకు తెలీదు అని చెప్తుంది.


అప్పుడు ప్రశాంత్ నేను గిరి తో మాట్లాడాను. గిరి ఏమీ చెప్పాడంటే, పున్నమ రోజు ఎవ్వరికైతే తీర్థం లో మందు కలిపి ఇస్తారో వాళ్లకు అమావాస్య రోజు దేవరమ్మ జోస్యాని కి ముందు ఎదో లా ఇంకో మందు ఇచ్చేవాడట.ఆ రెండు మెడిసిన్స్ నుంచి వాళ్ళు హార్ట్ ఆరెస్ట్ అయిపోయి మరణించేవారట. మరీ మీరు వెళ్లి చనిపోయిన వారికి మెడిసిన్ ఇచ్చేవారాని చెప్పాడు అని అంటాడు.


విక్రమ్ అయితే అక్కడ ఎదో అవయవాల వ్యాపారం జరుగుతున్నట్టు ఉంది. కానీ ఇప్పుడు మనం మనతో పాటు ఒక డాక్టర్ ని మరియు ఒక ఆఫీసర్ ని తీసుకెళ్లాలి. మనకన్నా ముందు ఏదోలా ఆఫీసర్ ని ఆ ఊరికి పంపాలి మనతో పాటు డాకర్ట్ ని తీసుకెళదాం, అది కూడా గిరి స్థానం లో. అప్పుడైతే వీలవుతుంది మెడిసిన్స్ ఏంటో తెలుసుకోవడానికి అని అంటాడు.

వెంటనే సునీత ఆ ఊరివాళ్ళు కొత్త వాళ్ళను త్వరగా నమ్మరు. పైగా అది చాలా చిన్న ఊరు ఎవరూ వెళ్లి వ్యాపారంలోనో లేదా మరే విధంగాఐన స్థిర పడాలని అనుకోరు. మనం అక్కడే ఎవ్వరైనా ఊరి వాళ్ళ బంధువులని వెళ్లి ఆ ఊరి జనంలో కలిసిపోవాలి. అలా మనకు ఎవ్వరు సహకరిస్తారు? అని అడుగుతుంది.


ప్రశాంత్ సునీత మీరు చెప్తున్నది నిజమే అంటాడు.వెంటనే విక్రమ్ మనం ముందుగా దేవరమ్మను కలుద్దాం. ఆమెతో మాట్లాడి ఆమె సహాయం అడిగి చూద్దాం అని అంటాడు.సునీత మంచి ఆలోచన విక్రమ్ అనగా, కమల దేవరమ్మ ను ఎలా కలుద్దాం అని అడుగుతుంది.


విక్రమ్ దేవరమ్మ పట్నం లో ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు కమల. ఒకసారి వెళ్లి చూస్తా అని అంటాడు. మరుసటి రోజు దేవరమ్మను కలవడానికి దేవరమ్మ పెరిగిన ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడ దేవరమ్మ గురించి అడుగగా దేవరమ్మ రావడానికి ఇంకొక 2 రోజులు అవుతుంది అని చెప్తారు. సరే అని విక్రమ్ తన మొబైల్ నెంబర్ ఇచ్చి దేవరమ్మ రాగానే ఒకసారి మొబైల్ కాల్ చేయమని తిరిగి వచ్చి, సునీత, కమల తో సునీత మీరు, కమల ఈ రోజే ఊరికెళ్లండి. ఆ ఊరిలో ఏమైనా మనకు ఉపయోగపడే వస్తువులు లభిస్తే దేవరమ్మకు ఇచ్చి, నాకు చేర్చమనండి . నేను, ప్రశాంత్ ఇక్కడ దేవరమ్మతో మాట్లాడి వస్తాము.


మీతో పాటు డాక్టర్ అయిన నా స్నేహితుడు సూర్య, గిరి స్థానంలో వస్తాడు. సునీత మీరు, సూర్య ను గిరి తమ్ముడని పరిచయం చేయండి.గిరి చేసే పనులు అన్ని చేస్తాడని చెప్పండి. ఎవ్వరికి అనుమానం రానీయకుండా అతను ఎలా మసులుకోవాలో చెప్పండి అని రండి మా ఇంటికి, సూర్యను పరిచయం చేస్తా అని ఇంటికి తీసుకెళ్తాడు.


కమల, ప్రశాంత్, సునీత అందరు విక్రమ్ తో పాటు విక్రమ్ ఇంటికి వెళ్తూండగా విక్రమ్ సూర్యకు మొబైల్ కాల్ చేసి ఇంటికి రమ్మంటాడు. అందరు విక్రమ్ ఇంటిలో కలుసుకుంటారు.


విక్రమ్ వాళ్ళ ఇంటిలో తాత ఫోటో చూడగానే సునీత చాలా బాధ పడుతుంది.అంతలో అక్కడే పక్కనే ఉన్న హారం చూసి విక్రమ్ తో, విక్రమ్ ఈ హారం మీద ఉన్న ఈ చక్రం నేను ఎక్కడో చూసాను. అది ఎక్కడ అనేది గుర్తు లేదు. కొండ మీదనో లేక సోమనాథుని గుడిలోనో ఎక్కడో చూసాను అని అంటుంది.


వెంటనే విక్రమ్ ఇది తాత కు, రాణిగారైన మా పెద్దమ్మ గారు ఇచ్చారని తాత చెప్పారు. అయితే దీని అవసరం ఉంటుందా అక్కడ? అని అనుకుంటాడు. ఇంతలో సూర్య వస్తాడు.


విక్రమ్ సూర్యతో, కమ్ సూర్య అని సూర్య కు అందరిని పరిచయం చేస్తాడు. జరిగిన సంగతి అంతా చెప్పి సూర్యను గిరి స్థానంలో ఊరికెళ్ళమని అడుగుతాడు. దేవరమ్మ ఇక్కడికి రావడానికి 2 రోజులు అవుతుందన్నారు. మీకు ఏమైనా నాకు చేరావేయాలి అంటే ఆమెతో ఇక్కడికి పంపండి అని చెప్తాడు.సూర్య కూడా సరే అని వారితో బయలుదేరుతాడు. కమల తనతో పాటు రెండు పావురలను కూడా తీసుకెళ్తుంది.


అక్కడ ఊరిలో సునీత, కమల, సూర్య వెళుతుండగా మారుతి పటేల్, నారాయణరావు, శంకరశర్మ కనిపిస్తారు. సునీత వారికి నమస్తే చెప్పి, గిరికి ఉన్నట్టుండి స్పృహ తప్పిందని, ఎదో పెద్ద వ్యాధిలా అనిపించి పట్నం తీసుకెళ్లానని, అక్కడ బ్రెయిన్ లో క్లాట్స్ ఉన్నాయి అన్నారు. ఆపరేషన్ చేసేవరకు స్పృహ రాదు అని చెప్పారు అని చెప్పి, ఇతను గిరి తమ్ముడు. చాలా డబ్బు అవసరం అని అంటే మన పరిస్థితి చెప్పి గిరి స్థానంలో పనికి తీసుకొచ్చా అని చెప్తుంది. అలానే ఈమె కమల. మన విక్రమ్ సార్ అక్క. ఆయనే గిరిని పట్నం తీసుకెళ్లాడానికి సహాయం చేసారు. ఆయనకు బ్యాంకు మీటింగ్ ఉందట అందుకే నాతో పాటు ఈమెను పంపారు. ఈమె అంధురాలు అని చెప్పి వారికి పెద్దలనిపరిచయం చేస్తుంది. కమల, సూర్య వాళ్లకు నమస్కారం చెప్తారు.అంతలో మారుతి పటేల్ గిరికి ఎవరు లేడన్నాడు అనగా, సూర్య లేదయ్యా సమాజం అంటే సరిపోదు, ఎవ్వరికి సెప్పకుండా ఈడికి వచ్చేసిండు.అదృష్టం ఏందంటే ఆడ మాకు తెలిసినోళ్లు చూసి నాకు సెప్పిండ్రు. ఎప్పుడొచ్చినా ఏడ పని సేస్తున్నాడో సెప్పేటోడు కాడు. ఈరోజు ఇట్టా ఉలుకు పలుకు లేకుండా పడిపోయిండు అని ఏడుస్తాడు.


మారుతి పటేల్ అయ్యో, ఇన్ని ఏళ్ళు ఈ ఊరి బడిలో బాగా పని చేసాడు. బాగవుతుందిలే బాబు అని చెప్తాడు. వెంటనే శంకర శర్మ చూడమ్మా సునీత,మరీ సూర్యను ఒకసారి గుడికి తీసుకురా అని చెప్పి వెళ్ళిపోతారు. సునీతతో కమల, సూర్య, సునీత వస్తూండగా దేవరమ్మ అడవి పళ్ళను బ్యాంకు ముందు అమ్ముకుంటూ ఉంటుంది. అక్కడ సునీత సూర్యకు దేవరమ్మను చూపుతుంది.దేవరమ్మకూడా వారిని చూసి ఏమైంటుంది అని మనసులో అనుకుంటుంది.


కమల, సూర్య, సునీత సునీత ఇంటికి వెళ్తారు.

అక్కడ కమల సూర్యకు ఒక బటన్ కెమెరా ఇచ్చి, జాగ్రత్త సార్.ఎవ్వరి మీద అనుమానం వచ్చినా రికార్డు చేయండి అని చెప్పి, సునీతతో శంకర శర్మ ఇంతకు ముందు నీతో ఏదైనా చెప్పరా? అని అడుగుతుంది. అప్పటిలో గిరి ఉండేవాడు అందుకని నాతో మాట్లాడే అవసరం రాలేదు అని అంటుంది. కమల సరే మీరు వెళ్ళిరండి అని చెప్తుంది.


ఆ రోజు సాయంకాలం సూర్య, సునీత గుడికి వెళ్తారు. అక్కడ శంకర శర్మ ఉంటారు. శంకర శర్మ సూర్యను చూసి, చూడు సూర్య మీ అన్న గిరి మాకు నమ్మకస్తుడు. నీవు గిరిలా ఉంటే నీకు మంచిది అంటాడు. సునీత అన్ని చెప్పను స్వామి. సరే అంటేనే పిలుచుకొచ్చా. తనకు డబ్బు అవసరం ఉంది. డబ్బుకోసం చేస్తా అన్నాడు అని చెప్తుంది. మా అన్నకు ఆపరేషన్ చేయాలంటే 5లచ్చలు కావాలండి. మీరు ఏర్పాటు సేస్తే నేను మీరు సెప్పినది సేస్తా అని కాళ్ళు పట్టుకొని చెప్తాడు.సరే అయితే నేను మాట్లాడి చెప్తా అంటాడు శంకర శర్మ.


సునీత అంతలోనే కలుగచేసుకొని మీరు ఎవ్వరితో మాట్లాడాలి అని అడుగుతుంది. అవి మీకు అవసరం లేదు అని శంకర్ శర్మ చెప్తాడు. వెంటనే సూర్య అట్టా అంటే ఎట్టా అయ్యా. నాకు డబ్బు సాన అవసరం. మీరు ఎవరితో మాట్టాడుతారో సెప్పండి, ఆళ్ళను నేను ఒప్పిస్తా అని అంటాడు. సరే అయితే ఒక్కటి గుర్తు పెట్టుకో, నీవు మా వద్ద వచ్చి పని ఒప్పుకోక పోయిన నిన్ను బ్రతకనివ్వరు. కాబట్టి ఎంతో కొంత పుచ్చుకొని పని ఒప్పుకో అని సలహా ఇస్తాడు. వెంటనే సూర్య మీరు సెప్పండి సామీ ఎవరో నేను వెళ్లి ఒప్పిస్తా అని బ్రతిమలాడుతాడు.


వెంటనే శంకర శర్మ మీరు వెళ్ళండి అమ్మ. నేను సూర్యతో మాట్లాడాలి అని సునీత ను అక్కడినుండి వెళ్ళమంటాడు. సునీత కళ్ళతోనే సూర్యకు జాగ్రత్త అని చెప్పి వెళ్లి కమలకు జరిగినది అంతా చెప్తుంది. ఇద్దరు సూర్య కోసం ఎదురు చూస్తుంటారు.


ఆ రోజు రాత్రి 2 గంటలకు సూర్య ఎవ్వరు చూడకుండా సునీత ఇంటికి వచ్చి, కమల సునీతలతో జరిగింది ఇలా చెప్తాడు. "నన్ను శంకర శర్మ కొండ మీదికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక గదిలో ఎవరో ఉన్నారు. వాళ్ళ భాషను వింటే వాళ్ళు ఇండియన్స్ లా లేరు. ఇంకొక గదిలో ఒక ముసలామె ఉన్నారు. ఆమెకు ఎదో చికిత్స చేస్తున్నారు.ఎవ్వరు వీళ్ళు? ఎక్కడికొచ్చాము?అని శంకర శర్మ ను అడిగితే చెప్పిన పని మాత్రమే చేయి అన్నారు. ఇంతలో లోపలి నుంచి ఎవ్వరో మాట్లాడారు. శంకర శర్మ అప్పుడు గిరి గురించి చెప్పగా, లోపల నుంచి అజ్ఞాత వ్యక్తి బదులుగా,ఈ విషయం నాకు తెలుసు. ఎంత కావాలో చెప్పమను, కానీ మన పనికి ఆటంకం కలుగరాదు.పున్నమ రోజు ప్రసాదంను గిరి పంచలేదు. ఈ అమావాస్య కు ఎలాఐన ఒకరు ఇక్కడ చేరాలి.ఈ మధ్యలో మన పని ముగించమను ఎలాగైనా అని మాత్రమే చెప్పారు.


వెంటనే శంకర శర్మ నేను త్వరగా ఈ పని జరిగేలా చూస్తాను అని బదులు ఇచ్చాడు. ఇంతలో శంకర శర్మ తో ఆ అజ్ఞాత వ్యక్తి, ఈశ్వరుడి చెల్లెలు గుడికి చేరుతుంది, త్వరగా చేరుకొండి అని, చూడు సూర్య ఒకటి గుర్తుపెట్టుకో, నా గురించి ఎవ్వరికి తెలిసిన నీవు ఉండవు, అస్సలు ఆలోచించడం మానివేసి చెప్పిన పని మాత్రమే చేసుకుంటూ ఉండు. నిన్ను కూడా పేదరికం నుంచి బయటపడేస్తా అని చెప్పాడు. అప్పుడు నేను చిత్తం అయ్యా అనగా, శంకర శర్మ పద గుడికి వెళ్దాం అని, గుడికి తీసుకెళ్లాడు. అక్కడ నాకు ఇలా అడిగిన డబ్బు మరియు ఈ పౌడర్ ఇచ్చారు. ఇది ఇస్తూ శంకర శర్మ చేయపోయేది విన్నావు కదా ఎవ్వరికైనా ఇదిఎందులో అయినా కలిపి ఇవ్వు. ఇది ఇచ్చిన వారికే మరీ నీవు అమావాస్య రోజు నేను అనుమతి ఇచ్చినపుడు ఒక సూదితో ఇంకొ మందు గుచ్చాలి. అప్పుడు వాళ్ళ చావు సహజ మరణంలా అనిపిస్తుంది అని చెప్పారు.

ఇప్పుడు ఇది ఎలా అయిన నేను దీనిని విక్రమ్ కు చేర్చాలి అని అనుకుంటూండగా, సునీత సూర్య గారు మీరు దేవరమ్మకు ఇది అందచేయండి అనగా, సూర్య సరే అయితే ఒక ఉత్తరం వ్రాసి ఈ మెడిసిన్  కూడా పార్సెల్ చేసి ఇద్దాం అని అంటాడు. సునీత గిరి ఇల్లు నాకు తెలుసు. మీరు కొన్ని రోజులు గిరి ఇంటిలో ఉండగలరా అని అడుగగా, అయ్యో పరవాలేదు మేడం. మనం ఇక్కడికి ఒక పని మీద వచ్చాం. నాకు దేవరమ్మ ఇల్లు ఎదో చెప్పండి అని అడుగుతాడు. నేను ఇప్పుడు మీతో వచ్చి గిరి ఇల్లు చూపుతాను, అప్పుడే దేవరమ్మ ఇల్లు కూడా చూపుతా. మీరు వెళ్లి దేవరమ్మతో మాట్లాడి ఇచ్చి పంపండి అని కమల నేను వెళ్లి సూర్య గారికి ఇల్లు చూపించి వస్తాను అని అనగా, సూర్య చాలా లేట్ నైట్ అయింది మేడం, మీరు చూపాక నేను మరీ ఇక్కడ మిమ్మల్ని వదులుతాను అని చెప్పగా సునీత సరే సార్ అని, కమల జాగ్రత్త. వెళ్దామా సార్ అని కోడూరు బయలుదేరుతారు.మొదట వాళ్ల్లు గిరి ఇంటికెళ్లి సోదాలు జరిపి, అక్కడ దొరికిన మెడిసిన్స్ పార్సెల్ చేస్తారు. సునీత దూరం నుంచి దేవరమ్మ ఇల్లు చూపగా, సరే మేడం మిమ్మల్ని మీ ఇంటివద్ద దింపి వస్తాను. రండి అని చెప్పగా ఇద్దరూ సునీత ఇంటికి బయలుదే్తుతారు.


సూర్య సునీతను వదిలి దేవరమ్మ ఇంటికెళ్ళి, దేవరమ్మను పిలువగా, దేవరమ్మ అంత రాత్రి ఎవ్వరా అని తలుపు తీయడానికి భయపడుతుంది. అప్పుడు సూర్య దేవిగారు తలుపు తీయండి అని అంటాడు. దేవరమ్మ ఆశ్చర్యపోయి, పట్నంలో తన పేరు ఇక్కడ ఎవ్వరికి తెలుసు? అనుకొని, భయంగా తలుపు తీసి, అక్కడ ఉన్న సూర్యను భయంగా చూస్తుంది. వెంటనే సూర్య, దేవరమ్మతో భయపడకండి . నేను విక్రమ్ స్నేహితుడిని, విక్రమ్ కు మీరు ఇది ఇవ్వగలరా అని మెడిసిన్ ప్యాక్ ఇస్తాడు.


వెంటనే దేవరమ్మ, సూర్య చేయిపట్టుకొని లోపలికి లాగి తలుపువేసి, చిన్నగా క్షమించండి అయ్యా. బయట మాట్టాడలేను అని అంటూ, మీరు విక్రమ్ బాబు స్నేహితుల? విక్రమ్ బాబు ఎప్పుడొస్తారు?ఈ పార్సెల్ ఏమి? అని అడుగుతుంది. సూర్య దేవరమ్మతో మీరు ఈ పార్సెల్ విక్రమ్ కు ఇవ్వండి. మీకోసం విక్రమ్ పట్నం లో ఎదురుచూస్తున్నాడు అని చెప్పగా, దేవరమ్మ అయ్యా టీచర్ అమ్మ మంచిది కాదు అని చెప్తుంది. సూర్య అన్ని తెలుసు. ఇప్పుడు ఆమె మనకు సహాయం చేస్తోంది. మీరు పట్నం లో విక్రమ్ ను కలిస్తే ఏమి జరిగిందో,మీరు ఏమీ చేయాలో అన్నీ చెప్తాడు. మీరు రేపు పట్నం వెళితే మేలు అని అంటాడు . దేవరమ్మ సరే సార్. మీరు వస్తున్నప్పుడు ఎవ్వరు చూడలేదు కదా అని అడుగగా, లేదు అయినా ఇవ్వరైనా అడుగగా ఊరికి కొత్త, గిరి తమ్ముడిగా వచ్చాను. ఇది గిరి ఇల్లు అనుకొని వచ్చా అని చెప్దామానుకున్నాను . సరే మరి నేను గిరి ఇంటికెళ్తాను అని వెళ్లి పోతాడు.


మరుసటి రోజు దేవరమ్మ ఒంట్లో కులాసాగా లేదని ఊరి వాళ్లకు చెప్పి పట్నం బయలుదేరుతుంది. అక్కడ విక్రమ్ ని కలువగా, విక్రమ్ దేవరమ్మకు జరిగినది అంతా వివరించి చెప్తాడు. దేవరమ్మ సరే సార్ ఇప్పుడు మరి నాతో వచ్చే ఆఫీసర్ ఎవరు అని అడుగగా, విక్రమ్ మా సీనియర్ రామకృష్ణ మీ ఇంటిలో ఉంటారు. భయపడకమ్మ. ఆయనకు మీ అంత వయసు ఉన్న కూతురు ఉంది. మిమ్మల్ని తన కూతురులా చూస్తారు. మీరు నిశ్చింతగా ఉండచ్చు అని చెప్పగా సరే సార్ అని సూర్య ఇచ్చిన పార్సెల్, విక్రమ్ కు ఇస్తూ, సార్ సూర్య ఇది మీకు ఇవ్వమన్నారు. మీరు సరే అంటే రామకృష్ణ సార్ ని మా పిన్నయ్య అని పరిచయం చేస్తా ఊరి జనంకు అని చెప్తుంది. విక్రమ్ మంచి ఆలోచన. అలానే చెప్దాం అని అంటాడు. ఇంతలో రామకృష్ణ వస్త్తాడు. విక్రమ్ దేవరమ్మకు  రామకృష్ణను పరిచయం చేస్తాడు.


ప్రశాంత్ దేవరమ్మ ఇచ్చిన పార్సెల్ తెరిచి , అందులో ఉన్న ఉత్త్రం విక్రమ్ కు ఇస్తాడు. విక్రమ్ ఉత్తరం చదివి, రామకృష్ణతో సార్ మీరు ఇందులో ఉన్న మెడిసిన్స్ ని త్వరగా ల్యాబ్ కు పంపి, వాటిలో ఏమి కాంపౌండ్స్ ఉన్నాయో, ఎలా పని చేస్తాయో తెలుసుకొని నకు మెయిల్ చేయండి.మొదట నేను ప్రశాంత్ సోమనాథ అగ్రహారంకు వెళ్తాము. మీరు రిపోర్ట్స్ చూసుకొని రండి అని చెప్పి విక్రమ్, ప్రశాంత్ ఊరెళ్తారు. విక్రమ్ కు ఎందుకో ఆ హారం తీసుకెళ్లడం మంచిదనిపించి దానిని కూడా తన వద్ద ఉంచుకొనింటాడు.


విక్రమ్ ప్రయాణిస్తున్నoతసేపు పార్వతమ్మ గురించి ఆలోచిస్తుంటాడు. అతని మనసులో ఎన్నో ప్రశ్నలు. ఎవ్వరికి కనపడని ఆమె తనకెందుకు కనిపించింది. ఇంకా ఏవేవో చెప్పేది. ఎవరామె? ఎందుకు ఆత్మీయత భావం కలిగింది ఆమెను చూడగానే? అని ఆలోచస్తూంటాడు.


విక్రమ్ ప్రశాంత్ సోమనాథ అగ్రహారం లోని ఇంటికెళ్లి ఇళ్లంతా పరిశీలిస్తుంటారు. ప్రశాంత్ విక్రమ్ తో విక్రమ్ పార్వతమ్మ గది తాళం తెరిచి చూద్దామా? అని అడుగుతాడు. విక్రమ్ నేను అదే అనుకుంటున్నా ప్రశాంత్. ఒకసారి టీచర్ ఇంటికెళ్లి తాళం అడుగుదాం,అలానే ఏమైనా విషయం తెలుసుకున్నారేమో కనుక్కొనివద్దాం అని బయలుదేరుతారు.


ప్రశాంత్, విక్రమ్ టీచర్ ఇంటికి వెళ్ళగా అక్కడ కమల తలుపు తెరిచి రండి విక్రమ్ అండ్ ప్రశాంత్ అని తలుపువేసి, చెప్పండి సమాచారం అని అడుగుతుందివిక్రమ్ వెంటనే కమల రిపోర్ట్స్ ల్యాబ్ కు పంపాము. రామకృష్ణ సార్ దేవరమ్మ ఇంటి చుట్టంగా ఇక్కడికి వస్తారు. మన సూర్య ఈ సారి మందు రామకృష్ణ సార్ కు ఇస్తాడు. ఆయన నుంచి మనకు సమాచారం రావచ్చు అని, టీచర్ స్కూల్ కు వెళ్ళారా? అని అడుగగా అవును అని కమల చెప్పి, వెంటనే విక్రమ్ తో విక్రమ్ మనం సునీతని నమ్మచ్చు కదా అని అడుగగా, విక్రమ్ లేదు కమల నాకు సునీత బాల్యం నుంచి తెలుసు. తను అందరిని పోగొట్టుకొని ఎవ్వరూలేక ఇలా ఉన్నారు. తన నుంచి మనకు ప్రమాదం ఉండదు. నేను పార్వతమ్మ గది తాళం కోసం వచ్చాను అనిచెప్తాడు. కమల ఆ తాళం గిరి వద్ద ఉందేమో టీచర్ ని అడగాలి అని చెప్తుంది.


వాళ్ళు స్కూల్ వద్దకు వెళ్లి టీచర్ ని కలువగా, టీచర్ కూడా ఆ తాళం గిరి వద్ద ఉందని చెప్తుంది. అప్పుడు విక్రమ్, సరే మరి సూర్యను పిలువరా అని చెప్పగా టీచర్ పిల్లలతో సూర్యను పిలిపిస్తుంది.


సూర్య రాగానే టీచర్, విక్రమ్, సూర్య, ప్రశాంత్ ఒకరిని ఒకరు పలకరించుకుంటారు. సూర్య ఆ రిపోర్ట్స్ వచ్చాయా అని అడుగగా, లేదు సూర్య అంటాడు ప్రశాంత్.వెంటనే విక్రమ్ సూర్య టీచర్ మా ఇంటిలోని ఒక గది తాళంమాకు ఇవ్వలేదు అది గిరివద్దే ఉందన్నారు. కాస్త ఆ తాళం వెతికి ఇవ్వగలవా అని అడుగగా సూర్య సరే విక్రమ్ ఇల్లంతా వెతుకుతా అని చెప్తాడు.విక్రమ్, ప్రశాంత్ ఇంటిక్కి తిరిగి వెళ్ళిపోతారు.


ఆ రోజు రాత్రి ఇల్లంతా వెతుకుతుండగా ఎక్కడ తాళం కనిపించదు.కానీ మంచం కింద ఒక పెద్ద పెట్టె కనిపిస్తుంది. ఆ పెట్టె తాళం కూడా ఎక్కడ కనిపించదు. ఆ పెట్టె జరగను కూడా జరగదు.విసిగి పోయిన సూర్య అలసిపోయి పడుకుంటాడు.


మరుసటి రోజు ఇదే విషయం సూర్య టీచర్ కు చెప్తాడు. టీచర్ విక్రమ్ కు చెప్తుంది. విక్రమ్ టీచర్ తో సరే టీచర్ ఈ రోజు రామకృష్ణ సార్ వస్తారు దేవరమ్మ చుట్టంగా. నేను గిరి ఇంటికి వస్తే ఎవ్వరికైనా అనుమానం రావచ్చు. ఆయన వస్తేమనం ఆ పెట్టెను తెరిపిద్దాం అని అంటాడు.


అనుకున్నట్టుగా దేవరమ్మ తో కలిసి రామకృష్ణ ఆ ఊరికి రామకృష్ణ దేవరమ్మ చుట్టంగా వస్త్తాడు. ఆరోజు వచ్చాక సూర్య ను కలిసి, విక్రమ్ చెప్పాడు గిరి ఇంటిలో ఎదో పెట్టె తాళం వేసి ఉందట కదా, ఈరోజు రాత్రి చూద్దాం అని అంటాడు.


ఆ రోజు రాత్రి ఆ పెట్టెను రామకృష్ణకు చూపగా, రామకృష్ణ ఆ పెట్టె ను చూసి ఎంతో టెక్నాలజీ ఉపయోగించి చేసిన ఒక లాక్ ఇది. దీన్ని ఎవరు ఇచ్చింటారు? అని పనిముట్లు ఉపయోగించి అతి తెరువగా అందులో ఒక మ్యాప్ మరియు ఒక ఫోన్ మరియు కొన్ని ఎలక్ట్రానిక్ థింగ్స్ ,కొన్ని తాళాలు ఉంటాయి .ఆ ఫోన్ ఓపెనింగ్ కూడా వెంటనే వీళ్లకు సాధ్యపడక అవన్నీ తీసుకొని సూర్య వెంటనే విక్రమ్ కు మొబైల్ కు కాల్ చేస్తాడు.


విక్రమ్  మొబైల్ కాల్ లిఫ్ట్ చేసి సరే ఇప్పుడు మీరు టీచర్ ఇంటికి రండి. మనం అందరం కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకుందాం.రామకృష్ణ సార్ ని దేవరమ్మ ఇంటిలో నుంచి కనెక్ట్ అవ్వమనండి. మీరు అన్ని వస్తువులను రామకృష్ణ సార్ ను ఫోటోస్ తీసుకోమని చెప్పండి . మీరు టీచర్ ఇంటికి చేరగానే నాకు కాల్ చేయండి అని చెప్తాడు.విక్రమ్ చెప్పినట్టుగా రామకృష్ణ మొబిల్ లో అన్ని ఫొటోస్ తీసుకుంటాడు.


వెంటనే విక్రమ్ కమలకు కాల్ చేసి కాన్ఫరెన్స్ కాల్ ఏర్పాటు చేయమని జరిగిన విషయం అంతా చెప్పగా కమల సరే అని సునీతకు కూడా విషయం చెప్తుంది 


సూర్య విక్రమ్ చెప్పినట్టుగా టీచర్ ఇంటికి వస్తాడు.

కమల తనవద్ద ఉన్న సాంకేతికతతో అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఉపయోగించి వీడియో కాన్ఫరెన్స్ కాల్ విక్రమ్, మరియు రామకృష్ణ కు కలుపగా,ప్రశాంత్, విక్రమ్, కమల, సునీత, సూర్య, రామకృష్ణ అందరు కాల్ లో పలకరించుకొని మాట్లాడుతుంటారు. రామకృష్ణ పక్కన దేవరమ్మ ఆ కాల్ ను ఆశ్చర్యంగా చూస్తువుంటుంది.


సూర్య అందరితో చూడు విక్రమ్ ఇన్ని తాళాలు ఉన్నాయి.ఇందులో మీ ఇంటి గది తాళం ఎదో తెలియట్లేదు. ఇందులో చూడు ఈ తాల్లాలు చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి చూస్తుంటే కోటకు సంబంధించిన తాళాలలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ మ్యాప్ ఉంది అని చూపగా, రామకృష్ణ విక్రమ్ తో విక్రమ్ ఇది ఎపుడో తాళపత్ర గ్రంధాలతో తయారు చేసిన మ్యాప్. కానీ ఇందులో ఇప్పటికాలం ఇంక్ ని వాడారు.ఎదో క్యూచు (quechua ) భాషలో ఎదో వ్రాసారు. నాకు తెలిసిన ఆర్కయోలజిస్ట్ ఒకరు ఉన్నారు. మనం ఆయనకు ఈ కోడ్ ను పంపితే అతను డీకోడ్ చేసి ఇవ్వగలడు. ఆ పెద్ద తాళాలు ఎక్కడివి అని మనం మ్యాప్ లో గుర్తు పట్టగలమేమో చూడాలి. ఈ ఎలక్ట్రికల్ థింగ్స్ నుంచి అతనికి ఏవో సందేశాలు వస్తూ ఉండచ్చు.అక్కడ ఏమైనా టవర్స్ ఉన్నాయా అని మరియు ఏవేవో ఆపరేటర్స్ ఉన్నాయి అవి ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలుసుకోవాలి అని అంటాడు.


విక్రమ్, రామకృష్ణ తో,అవును సార్ మీరు మీ ఫ్రెండ్ తో ఆ మ్యాప్ లో ఉన్న విషయాన్ని ఎలా అయిన డీకోడ్ చేయించండి. కానీ మనకు ఆ కోడ్ అర్థం ఏంటో ఈ అమావాస్య లోపు మనం ఆ మ్యాప్ లో రహస్యాన్ని అర్థం చేసుకొనేసిండాలి. సూర్య మనం ఆనుకున్నట్టే నీవు రామకృష్ణ సార్ కు మెడిసిన్ ఇచ్చినట్టుగా శంకర శర్మకు తెలియజేయి.


ఇంతలోపు సునీత విక్రమ్ మీ ఇంటి గది తాళాలు నేను గుర్తు పట్టగలను. అని ఒక కీ తీసి నాకు తెలిసి ఇది మీ ఇంటి గది తాళం. నా వద్ద కీ ఒక వారం పాటు ఉండేది. అప్పుడు నాకు గుర్తుగా నేను ఒక స్టార్ గుర్తు వేసాను నైల్ పోలిష్ కీ మీద.ఇది చూడండి అని ఒక కీ చూపగా, విక్రమ్ ఓహో గుడ్. నేను రేపు ఉదయం ఇంటికి వచ్చి తీసుకుంటాను అని రామకృష్ణ సార్ మీరు మీ ఫ్రెండ్ అడ్రస్ చెప్పగలరా? నేను స్వయాన వెళ్లి ఆయన తో మాట్లాడి వస్తాను అని చెప్తాడు.


వెంటనే రామకృష్ణ అడ్రెస్స్ ఇవ్వగా, విక్రమ్ కమలతో కమల అక్కడ మన దొరికిన వడ్తువులన్నీ ఒక బ్యాగ్  లో ఉంచి ఇవ్వు. రేపు ఉదయం వచ్చి తీసుకెళ్తాను అని చెప్తాడు. అందరు మాట్లాడడం అయిపోయాక సూర్య కూడా అక్కడినుంచి వెళ్ళిపోతాడు.


మరుసటి ఉదయం విక్రమ్ టీచర్ ఇంటికెళ్లి కమల నుంచి బ్యాగ్ తీసుకొని, ఇంటికి వచ్చి ప్రశాంత్ ను పిలుస్తాడు. ప్రశాంత్ రాగ్గానే ఇద్దరు అన్ని వడ్తువులు మరియు మ్యాప్ పరిశీలిస్తూంటారు. ఇంతలో అందులో ఉన్న కీ తీసుకొని ప్రశాంత్ తో కలిసి గది తాళం తెరువగా అందులో చాలా పాత సామాన్లు ఉంటాయి. అన్ని ఒక్కొక్కటి చూస్తూండగా అక్కడ అప్పుడు సునీత చూపిన ఫోటో కనిపిస్తుంది.ఆ ఫోటో ను తీసుకొని గది తాళం వేసి వస్తాడు.


విక్రమ్ ఆ ఫొటోలో ఉన్న పార్వతమ్మ ను చూస్తూంటాడు.అందులో పార్వతమ్మ పక్కన ఉన్న వాళ్లందరిని చాలా సేపు గమనిస్తూ ఉంటాడు. ఇంతలోనే ప్రశాంత్ విక్రమ్ ఊరేళ్తానన్నావు కాదా అంటాడు. విక్రమ్ అవును ప్రశాంత్ నీవు ఒకసారి వీలైతే మన శిక్షణ అయిన పావురంతో వీడియో తీసి ఉంచు అని వెళ్ళొపోతాడు.


అలా పట్నం కు వెళ్లిన విక్రమ్ రామకృష్ణ చెప్పిన విధంగా ఆర్కయోలోజిస్ట్ అసుతోష్ మిశ్రా ని కలుస్తాడు. అక్కడ మిశ్రా గారికి ఆ మ్యాప్ ను ఇస్తాడు. మ్యాప్ చుసిన మిశ్రా విక్రమ్ తో మీకు రామకృష్ణ చెప్పినది నిజమే. ఇది అమెరికా దేశం చాలా పురాతన భాష. చూడడానికి మనకు ఏవేవో గుర్తులులా కనిపిస్తుంది.ఇప్పుడు ఇక్కడున్న లిపి ప్రకారం ఇక్కడ కొండ మీద ఈ గుర్తులు ఉన్న స్థానాలలో విషపురిత బాణాలు అనుమతి లేకుండా వచ్చేవారికి తగిలే విధంగా ఉంచ్చారు. అది ఎలా అంటే అక్కడ ఉన్న కొన్ని తీగలబంజారా మీద కాలు ఉంచితే మరీ కాలు లేపే సమయం లో అవి కాలుకు తగిలి మనిషి మూర్ఛపోతారు అని చెప్తాడు. అలానే కొండ మధ్య భాగాన ఒక గుహ ఉందట. అందులో చనిపోయిన వారి అవయవాలు దాచి ఉంచుతారారట. అవి పట్నం కు చేర్చే బాధ్యత మిస్టర్ N ర్ అని ఉన్నాది. ఆ డబ్బుతో ప్రజలకు అనుమానం రాకుండా కోట తలుపు తెరచి అక్కడున్న సంపద మరియు సంజీవిని కొండలో దాచిన వజ్రల నిధిని దక్కించుకోవచ్చు అని వ్రాసి ఉంది అని చెప్తాడు.


వెంటనే విక్రమ్ ఇలా అమెరికా భాషలో వ్రాసినది ఎవ్వరు ఏమైనానా కనుక్కోవచ్చా. ఎక్కడైనా పొరపాటుగా గుర్తులలో చెప్పాడా అని అడుగగా కాసేపు అంతా లిపి గమనిస్తూ హ ఇక్కడ పీటర్ అని ఉంది అని చెప్తాడు. విక్రమ్ చాలా చాలా ధన్యవాదములు మిశ్రా గారు అని తన ఆఫీస్ కు వెళ్తాడు. అక్కడ మైన్స్ లో పని చేస్తున్న ఆఫీసర్స్ ను కలిసి ఆ ఎలక్టికల్ వడ్తువులు ఏమిటి ఇందూజ ఉపయోగిస్తారు అని అడుగగా. వాళ్ళు వాటిని పరీక్షించి ఇవి మైన్స్ లో ఉపయోగించేవి కావు. పెద్ద పవర్ ఫుల్ బ్లాస్ట్ కు ఉపయోగించేవి కావు . ఎదో చిన్న చిన్న పరికరాలు పనిచేయడానికి ఉపయోగిస్తుంటారు. ఇంక ఇవి మీకు సిగ్నల్స్ ను మరియు వాయిస్ మెసేజ్  ను పంపడానికి ఉపయోగిస్తారు అని చెప్తారు. విక్రమ్ వారికీ థాంక్స్ చెప్పి, వాళ్ళు వెళ్ళాక ప్రశాంత్ కు కాల్ చేసి పావురనికి కెమెరా అమరచింత వీడియో తీమ్మని చెప్తాడు.


ప్రశాంత్ వెంటనే కమలకు కాల్ చేసి విక్రమ్ చెప్పిన మాటను కమలకు తెలుపగా కమల కెమెరాలను పావురం కాలుకు మరో కెమెరాను మరో పావురం మెడకు వేసి పంపుతుంది. అవి ఆ రెండు కొండల మీద ఉన్న అని పరిసరాలని వీడియో తీసుకొని మరి కమల వద్ద వస్తాయి.వెంటనే కమల ఆ కెనరాలు తీసి తన పెన్ డ్రైవ్ లో డేటా వేసుకొని లాప్టాప్ నుంచి విక్రమ్, ప్రశాంత్, రామకృష్ణ మరియు సూర్య మెయిల్ ఐడి కి పంపుతుంది. ఎందుకైనా మంచిది అని ఆఫీస్ కు కూడా ఒకటి పంపుతుంది.


విక్రమ్, ప్రశాంత్, సూర్య, రామకృష్ణ అందరు ఆ వీడియో ని చూస్తారు. విక్రమ్ మరుసటిరోజు ఉదయం ఊరు చేరుతాడు. ఆ రోజు కమల ను కలిసి రాత్రికి కాన్ఫరెన్స్ కాల్ లో కలుద్దాం. నేను రామకృష్ణ సార్ కు కూడా మెసేజ్ చేసాను అని చెప్పి రామాపురం వెళ్ళిపోతాడు. రామాపురం లో మహేంద్ర వర్మ ను కలిసి ఇక్కడ ఏమైనా చర్చి ఉందా అని అడుగుతాడు. తాను క్రిస్టియన్ అని తన నాన్నమ్మ కు బాగోలేదు అని వాపోతాడు. ఈ ఊరిలో చర్చి లేదు కానీ ఊరి బయట హనుమంతుని విగ్రహం ఉందికదా అదే రాములోరి గుడి వద్ద అక్కడ ఒకటి ఉంది. ఫాదర్ కూడా చాలా మంచి ఆయన. ఎంతో మందికి సహాయం చేసినాడు. పోలీస్ సార్ ఉన్నారు కదా జోసెఫ్ ఆయనకు కూడా బాగా తెలుసు ఫాదర్. ఆయన ఇక్కడ వాళ్ళకే కాదు ప్రతి నెలా ఏరు దాటి వెళ్లి పక్కన వేరే ఊళ్లకు కూడా సహాయం చేస్తూంటాడు.ఆయనకు మన మారుతిపటేల్ బాగా తెలుసు. ఎప్పుడైనా నేను కోడూరు ప్రజల కోసం అడుగగా వాళ్ళు భగవతుడి ప్రేయర్స్ అని జరిపించి అందరికి కొంత డబ్బు మరియు పిల్లలకు బట్టలు ఇచ్చేవారు అని చెప్తాడు.


విక్రమ్ వెంటనే అబ్బా అంత మంచి ఫాదర్ అంటున్నారు ఆయన పేరు చెప్పగలరా అని అడుగగా మహేంద్ర వర్మ, పాల్ అని చెప్తారు. విక్రమ్ నేను వెళ్లి వారిని కలుస్తాను అని వెళుతుండగా అతను ఎవ్వరిని కలవరు.మీరు మారుతి పటేల్ ద్వారా వెళ్లడం మంచిది అని చెప్తాడు.విక్రమ్ థాంక్స్ చెప్పి బయలుదేరుతాడు.


మారుతి పటేల్ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళగా అతను కోడూరు ప్రజలతో మాట్లాడడానికి వెళ్లాడని చెప్తారు. ఇంతలో రమేష్ చౌదరి కనిపిస్తాడు.చౌదరి విక్రమ్ తో మీరు బ్యాంక్ ఆఫీసర్ కాదా అని పలకరించి మాట కలుపుతాడు. వెంటనే విక్రమ్ అవును మరి మీరు అని అడుగగా నేను రమేష్ చౌదరిని. మారుతి మరియు నారాయణరావు నా స్నేహితులు. మహేంద్ర చాలా చిన్నవాడు. వాళ్ళ నాన్న కార్తికేయ నాకు స్నేహితుడు. కార్తికేయ ఈ ఊరి రాజుకు దూరపు చుట్టం. ఊరికోసం చాలా పాటు బడ్డారు రాజుతో కలిసి. అందుకే ఊరి ప్రజలకు మహేంద్ర వర్మ అంటే చాలా గౌరవం అని చెప్తూండగా విక్రమ్ చౌదరితో

"ఓహో మీరు వారి నాన్న గారి స్నేహితులా. చాలా సంతోషంగా ఉంది. నేను సమస్యలలో ఉన్నాను. మా నాన్నమ్మ గారికి బాగోలేదు. నేను క్రిస్టియన్ ని. ఇక్కడ చర్చి ఉంటే ప్రేయర్స్ చేపించాలనుకుంటున్నాను అని, ఇప్పుడే వర్మ గారిని కలిసాను ఆయన చర్చి ఫాదర్ మారుతి పటేల్ గారికి తెలుసు అని చెప్పారు.


అయిన ఫాదర్ ఎంతో గొప్పవారన్నారు. మా నాన్నమ్మ కు బాగవుతే నేను నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరితో విరాళాలు ఇప్పిద్దామనుకున్న అని చెప్తాడు.


వెంటనే చౌదరి అయ్యో ఫాదర్ ను మారుతికి పరిచయం చేసినది నేనే. ఆయన బ్రిటిషర్. ఎవ్వరితోనూ మాట్లాడరు. రండి అని చర్చి కి తీసుకెళ్తాడు. అక్కడ మూడు గంటలు కొట్టగా ఒకరు వచ్చి ఫాదర్ వస్తారు కూర్చోండి అని వెళ్ళిపోతారు. విక్రమ్ కు అతనిని ఎక్కడో చుసినట్టు అనిపిస్తుంది.

ఇంతలో ఫాదర్ రాగానే విక్రమ్ ఆయనకు నమస్కరించి ఫాదర్ మా నాన్నమ్మ కోసం ప్రేయర్ చేయాలి.మీకు నేను నా స్నేహితులతో కూడా విరాళాలు ఇప్పిస్తాను. ఆ ప్రభువును మీరు నా తరపున వేడుకోవాలి అని చెప్పగా ఫాదర్ సరే అని చెప్తాడు.అమెరికా లో నా స్నేహితుడు ఉన్నాడు అతను మన ప్రభువు కు బంటు. అతను ప్రజా సేవకు 3కోట్లు ఇస్తానంటున్నాడు. మీరు మీ ఫోన్ నెంబర్ చెప్పితే అతను మీతో మాట్లాడుతాడు అని చెప్పగా ఫాదర్ ఫోన్ నెంబర్ ఇస్తాడు.విక్రమ్ ఫాదర్ కు థాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు.


విక్రమ్ వెళ్లి ప్రశాంత్ ను కలిసి మారుతి పటేల్ ను కలువగా అతను విక్రమ్ తో తనకు ఫాదర్ ను పరిచయం చౌదరి చేసారని, చౌదరికి ఫాదర్ చాలా ఆప్తుడని చెప్పి, తను ఊరి ప్రజలకోసం చౌదరితో ఫాదర్ ను కలవడానికి వెళ్లే వాడని చెప్తాడు .

విక్రమ్, ప్రశాంత్ ఇంటికి చేరుకున్నాక విక్రమ్ ప్రశాంత్ తో తను కలిసిన వారందరివాద్ద సేకరించిన సమాచారాన్ని చెప్పి, సూర్య, రామకృష్ణ, కమలతో సీక్రెట్ కాన్ఫరెన్స్ కాల్ ఏర్పాటు చేయమని చెప్తాడు.


ప్రశాంత్ విక్రమ్ చెప్పినట్టుగా కాల్ ఏర్పాటు చేయగా విక్రమ్ అందరికి సేకరించిన సమాచారన్ని చెప్పి,బ్యాంకును శుభ్రం చేసేందుకు వచ్చిన పుల్లయ్య ను మొదట విచారించాలి అని చెప్పి, ప్రశాంత్ రేపు మనం పుల్లయ్యను తీసుకెళదాం. టీచర్ పుల్లయ్య ఇల్లు ఇక్కడే కోడూరు లో ఉంది. మీరు పుల్లయ్యను ఇప్పుడే విచారించవచ్చు అని చెప్పగా అయితే సూర్య మీరు పుల్లయ్య ను బయటికి తీసుకొచ్చి క్లో్రొఫాం ఇవ్వండి.ఏరు దాటించి విచారణ కానిద్దాం అని చెప్పగా, సూర్య సరే అని పుల్లయ్య ఇంటికి వెళ్లి పుల్లయ్య తో మాట కలుపుతూ మత్తు ఇవ్వగా, రామకృష్ణ పుల్లయ్యను తీసుకొని దేవరమ్మ సహాయం తో ఆడదానిలా ముస్తాబు చేసి ఏరు దాటుకొని ఇంటరగేషన్ ఆఫీస్ కు తీసుకెళ్లి విచారించగా పుల్లయ్య చర్చి ఫాదర్ తనకు అవయవాలు ఇచ్చి పంపేవారని ఇక్కడ దీప ఫౌండేషన్ కు అవయవాలు చేర్చేవాడిని, నాకు ఫాదర్ డబ్బు ఇచ్చేవారు అని చెప్తాడు. అక్కడ సంజీవిని కొండ మీద కొండలో దొరికే  మూలికలతో విషాన్ని తయారు చేసి అక్కడ కొన్ని పరికరాలు ఉపయోగించి కాలు పెట్టిన వారికి విషబాణాలు గుచ్చుకొనేలా చేసేవాడిని అని చెప్తాడు.పోలీస్ వాళ్ళు దీప ఫౌండేషన్ ని గస్తీ కాస్తూ ఉంటారు.


రామకృష్ణ  తెల్లవారే లోపు తిరిగివచ్చేస్తాడు. ఆ రోజు అమావాస్య. అందరు అనుకున్నట్టుగా దేవరమ్మ జోస్యం చెప్పడం మొదలు పెట్టగా రామకృష్ణ పడిపోతాడు. మారుతి పటేల్ అక్కడే ఉండి అయ్యో అని బాధపడుతుండగా,విక్రమ్ పటేల్ గారు మీరు ఒకసారి మాతో రాగలరా అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లగా, మారుతి చెప్పండి బాబు అని అడుగుతాడు.


విక్రమ్ జరిగిన వాటిలో మీ ప్రమేయం లేదు అని నిర్దారణ కు వచ్చి మీతో మాట్లాడుతున్నాము అని చెప్పగా , నాకు అర్థమవ్వడం లేదు,ఎవరు మీరు అని మారుతి అడుగగా జరిగిన సంగతులు అన్ని చెప్తాడు. అప్పుడు మారుతి పాల్ ఒక్కరే నారాయణ రావు ను N. R అని అంటారు. చౌదరి, శంకర శర్మ ఏవో ఇచ్చి పుచ్చుకోవడం చూసాను, అడిగితే ఎదో ప్రసాదం అన్నారు. మా పూర్వీకులు రాజు గారి వద్ద సేనాపతులు.ఈ ఊరి ప్రజలు నావాళ్లు. వీళ్ళను కాపాడండి అనగా నేను మీఇంటికెళ్ళాను, అక్కడ మీరు రాజుగారి కుటుంబం ఫోటో చూసాను. ఇక్కడ ప్రజలతో మీ అనుబంధం చూసాను. మీ కొడుకు పట్నం లో ఒక చిన్న ఉద్యోగి. అన్ని తెలుసుకొని ఇప్పుడు మీకు చెప్తున్నాను నేను ఆ రాజ కుటుంబం వారసుడిని అని చెప్పగా మారుతి చాలా సంతోష పడుతాడు. కావలసిన సహాయం అందిస్తా అని చెప్తాడు.



ఊరిజనం రామకృష్ణ ను కొండ మీదికి తీసుకెళ్లారు అని ప్రశాంత్ విక్రమ్ తో చెప్పగా, విక్రమ్ సూర్యకు కాల్ చేసి ఆ మెషిన్స్ ఉపయోగించి బాణాలు తగలకుండా చేయాలి అని చెప్తాడు. కమలకు సూర్య ఇంటికెళ్లి సూర్యకు సహాయం చేయమంటాడు. ప్రశాంత్, విక్రమ్ మ్యాప్ తీసుకొని కొండమీదికి వెళుతుండగా , మారుతి పటేల్, విక్రమ్ తో బాబు నేను మీతో వస్తా అని చెప్తూండగా, సునీత విక్రమ్ నేను వస్తాను. నా చేతనైనా సహాయం చేస్తాను అని చెప్పగా అందరు బయలుదేరుతారు.


సూర్య,కమల ఆపరేటర్స్ అన్ని ఆఫ్ చేయగా ఒక్క పరికరం కూడా కొండమీద పని చేయదు . అన్నీ ఆఫ్ చేసి సూర్య, కమల కూడా ఆ పెద్ద కీ తీసుకొని కొండమీదకు వెళ్తారు. విక్రమ్ వాళ్ళు సంజీవిని కొండ మీద నుంచి వెళ్తూ ఉంటారు. సూర్య, కమల ఉదయగిరి కొండ మీద నుంచి బయలుదేరుతారు.


విక్రమ్ వాళ్ళు వస్తూ ఉండగా ఒక చిన్న గుహలో హాస్పిటల్ వస్తువులన్నీ ఉండడం చూస్తారు. అలానే వాళ్ళు సంజీవిని నుంచి ఉదయగిరి కి వస్తారు. అంతలోనే సూర్య వాళ్ళను చూసి పలకరించగా ఉన్నట్టు ఉండి పై నుంచి తుపాకి కాల్పులు జరుగుతాయి. కమల విక్రమ్ కు కీ ఇవాగా విక్రమ్ అతిథి మందిరం తలుపు తెరువగా అక్కడ ఫాదర్ రండి విక్రమ్. ఇన్ని రోజులు ఇక్కడికి ఎవ్వరు రాలేదు. ఇక్కడ ఏమీ జరుగుతోందో తెలుసుకొన్నారుగా అని చెప్పి, మాతో చేయి కలపండి ఇక్కడ ఉన్న సంపద అనుభవిస్తాం. ఇక్కడ రాణి ఇంకా బ్రతికే ఉంది.ఆమెకు మీ వయసు కొడుకు ఉండేవాడు. మీరు మాతో చేయి కలపండి.ఆమెతో ఎలాగైనా తలుపు తెరవనిద్దాం అని అనగా, విక్రమ్ sampad అంటే ఎంత అని అడుగగా, వెళ్లకట్టలేము అని చెప్తాడు. విక్రమ్ సరే అనగా, మారుతి పటేల్ బాధపడి విక్రమ్ ని తిడతాడు.ఫాదర్ సంజీవిని గుహలో లోపలకి తీసుకెళ్లాగా అక్కడ నారాయణ రావు రాణి వద్ద ఉంటాడు. ఫాదర్ రావు ని పిలిచి అంతా చెప్పగా రావు విక్రమ్ ని లోనికి తీసుకెళ్తాడు. విక్రకు రాణిని చూపి, రాణి తో చూడండి శశికళ దేవి ఇతను మీ కొడుకు. ఇప్పటికైనా రాజుగది రహస్యం చెప్పండి లేదంటే మీ కొడుకును బ్రతకానివ్వం అని అనగా సరే చెప్తాను కానీ ముందు నేను నా కొడుకుతో మాట్లాడాలి. అప్పుడే చెప్పగలను అని చెప్తుంది.


సరే అని విక్రమ్ ను వదిలి అందరూ బయట కు వెళ్తారు. విక్రమ్, శశికళ వద్ద వచ్చి తను ఎవరో ఏంటో అన్ని చెప్పి హారం కూడా చూపగా ఆమె విక్రమ్ చేతిలోని మ్యాప్ తీసుకొని అన్నీ సైగలతో చెప్తుంది. వెంటనే విక్రమ్, ప్రశాంత్ మరియు కమలకు వాళ్ళను బంధించమని చెప్తాడు. ప్రశాంత్, రామకృష్ణ మరియు కమల బంధించడానికి ప్రయత్నిస్తూండగా సునీత మారుతి పటేల్ లోపలికి వస్తారు.మారుతి పటేల్, సునీత రాణీ బాధ్యత తీసుకుంటామని చెప్పగా విక్రమ్ సరే అని ఫాదర్ ను అరెస్ట్ చేద్దామని వెళ్లి బంధిస్తూండగా ఫాదర్ రాణిని చంపడానికి ప్రయత్నించగా, రాణిని కాపాడే యత్నం లో సునీత గాయలపాలవుతుంది. రాణికి తానెవరో అన్ని చెప్పి, విక్రమ్ తో తనకు బ్రతికే హక్కు లేదని చెప్పి, సంతోషంగా కనుమూస్తుంది.


విక్రమ్ నారాయణ రావును,ఫాదరను అరెస్ట్ చేసి, ఊరిలో రమేష్ చౌదరిని, శంకర శర్మ ను అరెస్ట్ చేస్తాడు. ప్రశాంత్, రామకృష్ణ దోషులను తీసుకవెళ్తారు.కమల భర్త వస్తువులను చూసి చాలా బాధపడుతుంది.విక్రమ్ శశికళతో జరిగివి చెప్పగా, శశికళ విక్రమ్ తో ఆ ఫాదర్ లా కనిపిస్తున్న అతను పీటర్ పాల్. లండన్ లో మన ఇంటి పక్కన ఉండేది అతని ఇల్లు. మనకెంతో ఆప్తుడిలా ఉండేవాడు. ఒకసారి మనతో పాటు ఇక్కడికి వచ్చాడు. మన ఆస్తి మీద కన్నేసాడు. ఇక్కడ సునీత నాన్న అయిన నారాయణరావుతో కలిసి మీ పెద్దమ్మ, పెద్దనాన్నలను చంపేసాడు. కార్తికేయ వర్మ స్నేహితుడు రమేష్ చౌదరి కూడా కార్తికేయవర్మ, మరియు సునీత తాత బ్రతికి ఉంటే రాజు కుటుంబాన్ని ఏమిచేయలేమని వాళ్ళను చంపడానికి ప్రయత్నించగా కార్తికేయ చనిపోయాడు. నన్ను గది తలుపు తెరవడానికి మాత్రమే బ్రతికించారు అని చెప్పి ఆ హారం చూపి ఇది ఆ గది తాళం తీయడానికి ఉపయోగపడే కీ అని చెప్తుంది.


అందరు కోట మీదకు వెళ్తారు. అక్కడ ఉన్న సింహాల పై ఆ హారం ఉంచి ఒకదాన్ని సవ్య మరోటి ఆపసవ్య దిశలో తిప్పగా అంతఃపురం తలుపులు తెరుచుకుంటాయి. వెంటనే పక్కన ఉన్న సొరంగాలు మూతబడతాయి. అప్పుడే హనుమంతుడి చేతిలో కూడా పర్వతం నిలుస్తుంది.ఆ గదిలో రాజు, రాణి,మరియు తన అమ్మ నాన్న ఫోటో లు చూసి ఎవరు ఎవరో వాళ్ళతో ఉన్న బాంధవ్యం తెలుసుకొని, తన తల్లితో పార్వతమ్మ కనిపించిన సంగతి చెప్పిన మాటలు అన్ని చెప్తాడు.


శశికళభూపతి గుడిలో కూడా నంది వద్ద హారంతో సొరంగాలు తెరవనిస్తుంది. అప్పుడు గర్భగుడి ద్వారం తెరుచుకొంటుంది.మహేంద్రవర్మ అక్కడ జరుగుతున్న దారుణాలని తెలుసుకుంటాడు.


ఊరి జనం కు వర్మ, మారుతిపటేల్, దేవరమ్మ నిజాన్ని తెలుపుతారు. రాజు రాసిచ్చిన భూములను ప్రజలకు ఇచ్చి, మూలికలను కొండను కాపాడే బాధ్యత కూడా ఇస్తారు. ఊరి జనం రాణికి నమస్కరించి వెళ్ళిపోగా, విక్రమ్ తన విలువైన విజ్రాల సంపదను గవర్నమెంట్ కు అప్పగించి తన తల్లిని తీసుకొని పట్నం వెళ్ళిపోతాడు. వెళ్లిపోతున్నపుడు ఫోటోలు తీసుకొనిదుకు కోటకు రాగా పార్వతమ్మ సంతోషం గా ఉంది అని చెప్పి వెళ్ళిపోతుంది. విక్రమ్ పట్నం లో ఇలాంటి ఎన్నో సమస్యలను తీరుస్తూ మంచి ఆఫీసర్ అనిపించుకుంటాడు.






Rate this content
Log in

Similar telugu story from Horror