కాంట్రాక్టు ఉద్యోగం
కాంట్రాక్టు ఉద్యోగం


ఏమైనా ఈ కాంట్రాక్టు ఉద్యోగాలను నమ్మలేంరా. ఎవరో తుమ్మితే మన ముక్కు ఊడినట్లు ఉంటుంది వ్యవహారం.
సురేష్ తన స్నేహితుని దగ్గర కొత్తగా చేరిన కాంట్రాక్టు ఉద్యోగం గురించి వాపోయాడు.
సురేష్ స్నేహితుడు కూడా చేసేది ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగమే.
పేరుకే ప్రభుత్వ ఉద్యోగం కానీ రోజులో ఒక్క గంట తీరిక ఉండదు.జీతం డబ్బులు ఎప్పుడు పడతాయో తెలియదు.
ఎప్పుడో ఒక సారి రెగ్యులర్ చేస్తారని ఆశతో జీవితం ముందుకు నడుస్తూ ఉంటుంది.