STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

3  

Midhun babu

Classics Fantasy Inspirational

జలధీ

జలధీ

1 min
8


నువ్వంటే ఎంతిష్టమో..నా గుండెలమీద వాలి విని చూడు." అని చెప్పాలనుకుని ఎంతకాలమయిందో.. నిజానికి ఎన్ని జన్మలయిందో..ఇంకా సరిగా చెప్పాలంటే ఎన్ని యుగాలయిందో..మరలా నువ్వు ఎదుట పడితే కదా చెప్పడం. నీవు గానీ ఎదుటపడిన క్షణం జరిగిపోయిన కాలమంతా ఓ రెప్పపాటే..!

ఎదురుచూపుదేముంది.అసలైనప్రేమకు కాలంతో ఏంపని. 

నీ పేరు "జలధి". నేను మాత్రం "జలధీ..!" అని గొంతెత్తి పిలుచుకుంటాను..పిలుస్తుంటాను నా మౌనంలోంచే. అది నీ హృదయానికి తప్పకుండా చేరుతూనే ఉంటుందని తెలుసు. నీ పరవశం నాకింకా అలా పిలుస్తూపిలుస్తూ ఉండేందుకు శక్తినిస్తూ ఉంటుంది. నీ మైమరపు నాకు చందనకర్పూర పరిమళమే.ఎనలేని ఆకాశాలను ఒక చీరగా చుట్టుకున్న నువ్వు ఎన్ని పాలపుంతలకు కన్నతల్లివో ఎందరికి తెలుసు. నీవు కదా నా హృదయాకాశానివి. జలధీ..నీవు ఆకాశాలకే ఆకాశమంటే ఈ మాటలకే వింతగా ఉందట. ఆనందంగా వింటున్నాయి. ఉన్నట్టుండి అలా మౌనంలో మునుగుతుంటాయి. అనుకోకుండా దివ్యసంగీత స్వరాలలోకి ఒదుగుతుంటాయి. శతకోటి జలతరంగిణులవుతుంటాయి. వింటున్నకొద్దీ వినాలనే ప్రేమాసక్తి పూర్ణ బిందువులై అనంతానంత సింధువులుగా పరివర్తితం చెందుతుంటాయి. అక్షరాలను సమ్మోహనపరిచే వేణునాదాలై ప్రవహిస్తుంటాయి. కలాలకూ తెల్లకాగితాలకూనడుమ చెలిమి నెరపే వంతెనలవుతుంటాయి. నా మునివేళ్ళలోంచి జాలువారే నక్షత్రకాంతి ధారలవుతుంటాయి. భాసకాళిదాసాదుల దిగివస్తే వారి కావ్య ప్రాణోద్దీప్త కన్యకలవుతుంటాయి. యుగయుగాలకూ వన్నెతరగని శాంతి మహావాక్య సౌగంధికా సరసాగ్ని చంద్రికలవుతుంటాయి. ఓ నా అపూర్వ పుణ్య 'జలధీ'..! అపురూప విరూపా..


Rate this content
Log in

Similar telugu story from Classics