STORYMIRROR

Dr.R.N.SHEELA KUMAR

Drama

4  

Dr.R.N.SHEELA KUMAR

Drama

జాతర

జాతర

2 mins
205

అందమైన సెలయేరు ప్రక్కన ఉండే ఓ అందమైన గ్రామం. ఆషాడ మాసం లో జాతర 10రోజులు జరుగుతుంది.జానకి పట్టణంలో చదువుకుంటున్న ఈ జాతర సమయానికి అమ్మమ్మగారింటి కి తప్పకుండ స్నేహితులతో వెళుతుంది. ఇలా ఓ సారి జానకి తో కాలేజీ లో చదుకుంటున్న సుమీ, సుజి, అమృత, ఆముద అందరు జాతరకు వెళ్లారు.అక్కడ అంగడిలు రంగులరాట్నాలు, జనాలను చూసి ఆముద చాలా ఆశ్చర్యం గా జానకితో మీ ఊరు చాలా బావుంది అన్నది. వెంటనే సుమీ ఇక్కడ ఎవరైనా అబవాయిన్ చూసి ప్రేమించి పెళ్లి చేసేసుకో అని ఎగతాళి చేసింది అందరు నవ్వుతూ సెలయేటికి వెళ్లారు.అక్కడ కొంతసేపు ప్రకృతి ని చూసి ఆహ్లాదించి ఇంటికి వెళ్లారు. అమ్మమ్మ మానవరాళ్ళతో జాతర నుండి ఏంటి తెచ్చారు అని అదిగింది. వెంటనే జానకి తెల్లబోయి నిలుచుంది.. వెంటనే ఆముద చేతిలో ఒక పొట్లం తీసి ఇదిగో మామ్మ అని కాజ్జురపు పొట్లం ఇచ్చింది.

వెంటనే మామ్మ కధ చెప్పడం మొదలుపెట్టింది. జాతరలో చిన్న బుర్రప్పన్న, పెద్దబుర్రాప్పన్నలను చూసారా అని అడిగి నా చిన్నప్పుడు వాడిని చూస్తే భయం వేసేది. మీ తాతయ్యను మొట్ట మొదట ఈ జాతరలోనే కలిసాను. అని చెప్పిన వెంటనే సుమీ అయితేమీది ప్రేమ వివాహమా మామ్మ అని అడిగింది. జానకి వెంటనే కొట్టి ఆపుతావా నువ్వు మా మామ్మ కి మేనమావే తాతయ్య అని చెప్పింది. అయితే ఇంకేం రోజు ఈ ఊరిలో చట్టా, పట్టాలెసుకొని తిరిగే ఉంటారు అని అన్నది. ఆ కార్తీకమాసం లో నదీ స్నానం చెయ్యడానికి అందరం వెళతాం. అని మొదలు పెట్టె లోపే తాతయ్య రామయ్య వచ్చేరు సిగ్గుతో అక్కడి నుండి అందరు పరిగెడితే సుమీ మాత్రం తాతయ్య మీ ప్రేమాయణం కొద్దిగా చెప్పండి అని అడిగింది. అందులో ఏముందే మనవరాల ఇక్కడ కోనలు, కొండలు ఒక్కటి వదలలేదు అంతా తిరిగే వాళ్ళం సాయంత్రం 3గంటలకు బయలు దేరితే రాత్రి 7కే తిరిగి వచ్చేవాడిని అని అన్నారు. బలే బలే అని సుమీ ఇంకా ఆనందంగా విన్నది. ఈ విషయాలు విన్న ప్రతి ఒక్కరికి ఈ వూరే అత్తవారిలయితే బావున్ను అనిపిస్తుంది. తెల్లవారుజామున వాకిలి కడిగి ముగ్గు పెడుతున్నప్పుడు ఎవరైనా నన్ను చూడరా అనేటట్లు ఎదురు చూస్తూ ముగ్గు పెట్టేది సుమీ అలానే అవినాష్ ఆ పక్కింటబ్బాయి రోజు సుమీ ని చూస్తూనే ఉన్నాడు. జానకి తో సుమీ ని నాతో మాట్లాడించవా అని అడిగేడు అలానే అని సుమీ తో అవినాష్ గురించి చక్కగా చెప్పి సుమిని సెలయేటి దగ్గరకు తీసుకు వెళ్ళింది ఇద్దరు ఒకరి ని ఒకరు చూస్తూ ఉండిపోయారు.

మిగిలిన స్నేహితులందరు ఆ సాయంత్రం సుమిని ఓ ఈ ఊరికి కోడలు పిల్లవి అయిపోతా్వైతే అని ఏడిపించారు. సుమీ జానకి తో ఇప్పుడే నువ్వు ఎవరికి చెప్పకు కొంత కాలం అయ్యాక చెపుదాం అని చెప్పింది. అలానే జాతర అయ్యాక అందరు పట్టణానికి వెళ్ళరు. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాలలో చేరారు సుమీ అవినాష్ లు ఒకే కంపెనీలో ఉద్యోగం చేయటం వలన నెలకోసారి గ్రామానికి సుమీ జానకి లు వెళ్ళటం ఇలా కొంతకాలం తరవాత జానకి తాతయ్య సుమీ అవినాష్ ల వివాహం జరిపించారు అందరు సంతోషం గా ఉన్నారు.


Rate this content
Log in

Similar telugu story from Drama