RA Padmanabharao

Drama

4  

RA Padmanabharao

Drama

గురువందనం

గురువందనం

2 mins
330


కందుకూరు ప్రభుత్వ కళాశాల స్వర్ణోత్సవ సంబరాలు ఘనంగా ఏర్పాట్లు చేశారు

పూర్వవిద్యార్ధులు వెయ్యిమంది దాకా వస్తామని చెప్పి ఉత్సాహం చూపిస్తున్నారు

కమిటీ అధ్యక్షులు పాతలెక్చరర్ లందరికీ స్వయంగా ఫోన్లు చేసి బస ఏర్పాట్లు చెప్పారు

తప్పకుండా రావాలని కోరాడు

జులై 14 న అంగరంగవైభవంగా వేదిక మీద అతిధులు ఆసీనులైనారు

కార్యదర్శి రామయ్య మైక్ ముందు కు రాంగానే గద్గద స్వరంతో మాటలు రాలేదు

మంచినీళ్లు తాగి చేతిలో కాగితాలు వొణుకు తుండగా గొంతుసవరించుకొని మాట్లాడాడు:

'మిత్రులారా! ఈరోజు నిజానికి స్వర్ణాక్షరాలతో లిఖించవలసిన రోజు. మొదటగా తొలి ప్రిన్సిపాల్ కృష్ణస్వామి గారిని స్మరించుకుంటూ ఒక్క నిముషం మౌనం పాటిద్దాం.'

సభలో అంతా గౌరవంగా లేచి నుంచున్నా రు

రామయ్య గొంతు సవరించుకుంటూ తన సహజ రాజకీయ నాయకుని ధోరణి లో గంభీరోపన్యాసం మొదలెట్టాడు

'రేకుల షెడ్లలో1966 లో ప్రారంభమైన ఈ మనకాలేజి ఈరోజు సగర్వంగా చెప్పుకునే విద్యార్ధులను సమర్పించింది. ఒకరు రాష్ట్ర మంత్రి. ఆయన వేదిక మీద ఉన్నారు. సభలో చప్పట్లు మారు మోగాయి. మరొకరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆయన నా క్లాస్ మేట్. మరొకరు విక్రమసింహా పురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్.మరొకరు పోలీసు ఐ.జీ. ఇలా ఈలిస్టును సాయంత్రం దాకా పొడి గించను. మన అధ్యాపకుల లో ప్రముఖులు అనంతపద్మనాభ రావు గారు. వారు ఢిల్లీలో దూరదర్శన్ అడిషనల్ డెరైక్టర్ జనరల్ గా రిటైరయ్యారు. ఆయనకు రిటైర్మెంట్ లేదు. ఇప్పుడు కూడా ఐఏయస్ కోచింగ్ సెంటర్లో డీన్ గా సేవ అందిస్తున్నారు. ఆయన తన 22 వ ఏట మన కళాశాలలో తొలిసారి గా అష్టావధానం చేసి దేశవ్యాప్తంగా కీర్తి గడించారు. ఆయన పాఠం చెప్పటం నా చెవిలో ఇంకా వినసొంపుగా విని పిస్తోంది.'

సభలో అంతా గౌరవంగా లేచి చప్పట్లు కొట్టారు

వేదిక మీద కూచున్న మంత్రి పద్మనాభరావుగారికి పాదాభివందనం చేసి శాలువా కప్పి కూచున్నారు

వేదిక మీద అతిధులు మాట్లాడారు

ఒక పూర్వవిద్యార్ధి కర్రసాయంతో మైక్ ముందు కు వచ్చి ఈ కళాశాలలో తొలి సంవత్సరాలలో ఇంటర్ చదివాను. బడిపంతులు గా వందలమందిని తీర్చిదిద్దాను.

మా తెలుగు మేష్టారు నా కు చెప్పిన చందస్సు పది మంది కి నేర్పాను. నేను కవిగా శాలువా లు కప్పించుకోవడమేగాకపదిమందికవులను తయారుచేసి తెలుగు పద్యాన్ని బతికించాను

కళాశాల తీపి గురుతులు ఈ పద్యం వింటే మీరు ఆనందిస్తారు. అన్నాడు

సభలో చప్పట్లు



Rate this content
Log in

Similar telugu story from Drama