Kishore Semalla

Drama Horror Inspirational

4.4  

Kishore Semalla

Drama Horror Inspirational

ఘోస్టల్ (G'Hostel) - పార్ట్ 4

ఘోస్టల్ (G'Hostel) - పార్ట్ 4

4 mins
1.4K



           కొత్త మలుపులు


                 తమతో వున్నది దెయ్యం అని తెలిసిన ముగ్గురు ఒక చోట చేరారు. కాసేపు వాళ్ళ ముగ్గురు ఏం మాట్లాడకుండా మౌన్నంగా కూర్చుండి పోయారు.

                మనం ఇంకా ఇక్కడే చనిపోతామా? అసలు దెయ్యాలే లేవు అనుకునే వాడ్ని ఇన్ని రోజులు. అసలు "ఆ కుర్రాడు ఎవడు?". "తనని ఎవరన్న ఇక్కడ చంపేశారా?". "తన ఆత్మ ఇంకా ఇక్కడ తిరుగుతుందా?" ఇది మనం తెలుసుకుంటే ఇక్కడ నుంచి బయట పడగలము అని బాగా ఆలోచించి సూరి, రవి మరియు నిఖిల్ తో చెప్పాడు.

                నువ్వు చెప్తుంది నిజమే. కానీ మనం తెలుసుకునే లోపు మనల్ని చంపేస్తాడు. ఎలా తెలుసుకునేది అని రవి తన మనసులో తిరుగుతున్న మాటని సూరి తో పంచుకున్నాడు.

               అదే నాకు అర్ధం కావడం లేదు అని ఆలోచించడం మొదలుపెట్టాడు సూరి.

               కానీ నిఖిల్ చాలా సేపటి నుంచి టాయిలెట్ వస్తున్నా భయానికి ఆపుకుని ఎవరితో చెప్పడం లేదు. కాసేపటికి ఇక భరించలేక సూరి తో - "రేయ్!, నా వల్ల కావడం లేదు రా," చాలా అర్జంట్ గా టాయిలెట్ వస్తుంది. వెళ్ళక పోతే ఇక్కడే పోసేలా వున్నా. ఎవడన్న తోడుగా రండి అని ఉక్కిరిబిక్కిరి అయిపోతు చెప్పాడు.

              ఇక్కడ టాయిలెట్ ఎక్కడ ఉందో కూడా మనకి తెలీదు. ఇప్పుడు మనం దాన్ని వెతుక్కుంటూ వెళ్తే దెయ్యానికి మనం ఆహారం అయిపోక తప్పదు. కాసేపు ఓపిక పట్టుకోరా అని రవి బ్రతిమాలడు.

             దానికి నిఖిల్- మీలో ఎవరు నాకు తోడు రాకపోయిన ఇక్కడే పోసేస్తా. తరువాత మీ ఇష్టం అని చెప్పి భయపెట్టాడు ఇద్దర్నీ.

             దానికి సూరి- ఆగు, తప్పదు కదా! వెళ్దాము పద ఇంకా. ఈ చీకటిలో దెయ్యాల మధ్య నీ టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో వెతుకుదాం అని నిఖిల్ కి కొంచెం భరోసా ఇచ్చాడు.

             నీ టాయిలెట్ మా ప్రాణం మీదకి వచ్చింది రా నిఖిల్ అని రవి గొణుక్కుని పైకి లేచాడు.

             సూరి ఫోన్ లో ఛార్జింగ్ తక్కువ వుంది. నేను ఫ్లాష్ లైట్ ఆన్ చేయలేను. రాజు ఇక్కడికి వచ్చాక కాల్ చేస్తాడు. అంత వరకు నా ఫోన్ ఆన్ లొనే ఉండాలి అని రవి కి ఆన్ చెయ్యమన్నాడు.

అక్కడ రాజు పరిస్తితి:

             తన ముగ్గురు స్నేహితుల ఇబ్బంది లో ఉన్నారని వెంటనే రాజు అక్కడికి బయల్దేరాడు. ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. తోడుగా తన స్నేహితుడైన జోసెఫ్ ని తనతో పాటు తీసుకుని బయల్దేరాడు.( జోసెఫ్ గురించి మళ్ళీ మాట్లాడదాం).

ఇక్కడ వీళ్ళ పరిస్థితి:

             

             ముగ్గురు టాయిలెట్స్ కోసం వెతకడం మొదలుపెట్టారు. రవి టార్చ్ వెలుగులో ముగ్గురు చేతులు పట్టుకుని వెళ్తున్నారు.

            పక్కన ఏదో పరిగెత్తుకు వేగంగా వెళ్ళింది. భయం తో ముగ్గురు అరిచి, "ఏం లేదు ఏం లేదు" అనుకుని , దయచేసి చేతులు మాత్రం వదలోద్దు రా అంటూ భయపడుతూ ముందుకు వెళ్తున్నారు.

          ఈసారి ఏకంగా పక్కనే వచ్చేసింది ఒక దెయ్యం. చూడడానికి చాలా భయంకరంగా వున్నా, " శ్రీ అంజనేయం, ప్రసన్నజానేయం" అంటూ ముగ్గురు ఆంజనేయ దండకం చదవడం మొదలుపెట్టారు..

         ఇంతలో ఎదురుగా టాయిలెట్స్ కనపడ్డాయి. రేయ్ నిఖిల్ మేము ఇక్కడే ఉంటాం. నువ్వు వెళ్లి త్వరగా పని పూర్తి చేసుకుని రా అని రవి చెప్పాడు.

        లోపల అంతా చీకటి గా వుంది. భయం వేస్తుంది. తలుపు తీసే ఉంచండి, నేను త్వరగా పని పూర్తి చేసేస్తా అంటూ నిఖిల్ ఇద్దర్ని బ్రతిమాలడు.

        సూరి మరియు రవి ఇద్దరూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ. ఇక ఏం చేయలేము, నువ్వు పని కానీ మేము ముక్కు ముసుకుంటాం అని చెప్పి తలుపుని తెరిచేపెట్టారు.

        సూరి అలా ముక్కుముసుకుని ఇంకా ఎంత సేపురా? అంటూ తలని పక్కకి తిప్పి చూసాడు. అక్కడో ఒక గది తెరిచే వుంది.

        రవి నువ్వు ఇక్కడే వుండు. నాకు ఆ లైట్ ఇవ్వు. ఇప్పుడే వస్తా అని ఆ గది వైపు తిరిగాడు సూరి. జాగ్రత్త, త్వరగా వచ్చేయి నేను ఇక్కడ ఒక్కడినే వున్నా, అసలే చీకటి అని రవి భయం తో చెప్పాడు.

        మెల్లగా రవి ఆ ఫోన్ ఫ్లాష్ లైట్ ని వేసి లోపలికి వెళ్ళాడు. అక్కడ చుట్టుపక్కల లైట్ వేసి చూసాడు. మొత్తం పుస్తకాలు, కొన్ని బట్టలు, క్వశ్చన్ పేపర్లు పడి వున్నాయి.

        బుక్స్ ఓపెన్ చేసి చూసాడు. కొన్ని పేజీలలో అకౌంట్స్ ప్రోబ్లేమ్స్ చేసి, ప్రతి పేజీ చివర కూడా ఒక కవిత్వం రాసి వుంది..

        అందులో ఒక కవిత ఇలా రాసి వుంది.

" నా జీవితం ఒక యుద్ధం, ఆ యుద్ధం లో నా కల ని చంపేసాను, నా ఆశలని మట్టుబెట్టాను, నా యుద్ధం నాదే. నాకు ఎవరు లేరు, నా తోడు ఎవరు రారు. గెలిచినా నేనె, ఓడిన నేనె''.

       ఇలా ప్రతి పుస్తకం లో కవితలు, పాటలు, కథలు బోలెడు వున్నాయి. ఎవరిది ఈ పుస్తకం అని మొదటి పేజీ తిప్పి పేరు చూద్దాం అనుకున్నాడు. వెంటనే తన చేతిలో పుస్తకం కాలిపోవడం మొదలయ్యింది. అక్కడ అన్ని పుస్తకాలు అంటుకున్నాయ్.

      సూరి వెంటనే అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేసాడు. తలుపు పడిపోయింది. లోపల మంటలు. తలుపుని గట్టిగా కొడుతున్నాడు, రావట్లేదు. తన అరుపులు విన్న రవి వెంటనే అక్కడికి వెళ్లి తలుపుని ఇటు వైపు నుంచి కొట్టి సూరి ని బయటకి తీసుకు వచ్చాడు.

                పొగ వల్ల దగ్గు వచ్చేసింది సూరి కి. సూరి కి ఆస్తమా అసలే. వెంటనే జేబులోంచి ఆస్తమా స్ప్రే తీసి నోట్లో పెడధామ్ అనుకున్నాడు. తన చేతిలోంచి జారి పాడిపోయింది. అలా అది అక్కడ నుంచి వెనక్కి వెళ్లిపోతుంది. సూరి అక్కడే దగ్గుతూ పడిపోయాడు.

              రవి ఆస్తమా స్ప్రే వెనకాలే పరిగెత్తుకుని వెళ్ళాడు. అది దొర్లుకుంటు, దొర్లుకుంటూ వెళ్లి ఒక చోట ఆగింది. పరిగెత్తుకుని వెళ్లి ఆ స్ప్రే చేతితో తీసుకున్నాడు. హమ్మయ్య! అనుకునే లోపు ముందు ఒక ఆవిరి రూపం లో ఒక ఆకారం. భయం తో మెల్లగా తలని పైకి లేపాడు. దెయ్యం మొఖం లో మొఖం పెట్టి గట్టిగా అరిచింది. వెంటనే ఆ స్ప్రే పట్టుకుని పరిగెత్తుకుని వచ్చేసాడు.

              స్పృహ తప్పి పడిపోయి వున్న సూరి ని లేపడానికి ప్రయత్నించాడు. గట్టిగా తనని ఊపుతున్నాడు. ఏడుస్తూ, సూరి లే లే అంటూ తనని లేపే ప్రయత్నం చేస్తున్నాడు..

              ఒక్కసారిగా ఊపిరి గట్టిగా వదిలి సూరి మేలుకున్నాడు. వెంటనే రవి తనకి ఆ స్ప్రే ఇచ్చాడు. దాంతో సూరి తేరుకున్నాడు.

              ఇద్దరు వెనక్కి పడిపోయి ఎదురెదురుగా కూర్చుని, హమ్మయ్య! అనుకుని ఒక్కసారిగా, రేయ్! నిఖిల్ ఎక్కడ రా ? అని ఇద్దరు ఒకేసారి భయం తో నోరు తెరిచారు................


-------------------------*--------------*-------------------------

అసలే భయస్థుడు నిఖిల్. నిఖిల్ ఏమయ్యాడు?🙄

కిషోర్ జోసెఫ్ ని ఎందుకు తీసుకు వస్తున్నాడు? అసలు జోసెఫ్ ఎవరు?🤔

గదిలో సూరి కి ఇంకేం విషయాలు తెలిశాయి?🤔

ఇవన్నీ తెలియాలి అంటే తరువాత భాగం లో చూడండి.😊


Rate this content
Log in

Similar telugu story from Drama