Surekha Devalla

Tragedy

2  

Surekha Devalla

Tragedy

ఎన్నెన్నో మోసాలు తస్మాత్ జాగ్రత్త

ఎన్నెన్నో మోసాలు తస్మాత్ జాగ్రత్త

2 mins
239


సంహిత, సుమన్ ఆలుమగలు వారికి ఇద్దరు పిల్లలు సన, రియా . పిల్లలు ఇద్దరు చదువుకుంటూన్నారు .

ఒకరోజు అందరూ బయటకు వెళ్లారు. సంహిత ఫోన్ ఇంటి దగ్గర మరిచిపోయింది. ఇంటికి వచ్చి చూసేటప్పటికి మిస్డ్ కాల్ ఉంది తెలియని నెంబర్ తో సుమన్ ఫోన్ చేసాడు ఆ నంబర్ కి అవతలి వారు హిందీ లో మాట్లాడుతూ, మాది బీహార్ అని, మీ నంబర్ ఎవరో ఇచ్చారు, మీతో పర్సనల్ గా మాట్లాడాలి అన్నారు .

మర్నాడు మళ్ళీ కాల్ వచ్చింది. వాళ్ళు కూలీలు అని ,ఎవరిదో ఇల్లు కడుతుంటే నిధి దొరికింది అని, అది ఎలా అమ్మాలో మాకు తెలియటం లేదు, మీరు సాయం చేయండి అంటూ ప్రాధేయపడ్డారు. మా ఫోన్ నంబర్ మీకు ఎలా తెలుసు అడిగాడు సుమన్. ఎవరో మాకు తెలియదు, మా కష్టం చెప్పి సాయం చేయమంటే మీ నంబర్ ఇచ్చారు అన్నారు. సరే ,మీకు ఎలా సాయం చేయాలి, నాకేంటి లాభం అడిగాడు సుమన్. మాకు దొరికిన నిధిని ఇద్దరం తీసుకుందాం అన్నారు వాళ్ళు. సరే ఎక్కడ కలవాలని అడిగాడు సుమన్. మీరు రండి ఇక్కడికి వచ్చి తనిఖీ చేసుకున్న తర్వాతనే మాకు డబ్బులు ఇవ్వండి అన్నారు, సరే రేపు చెప్త ఏ విషయం అని కాల్ కట్ చేశాడు.

చివరికివెళ్ళటానికి నిశ్చయించుకుని వెళ్ళి కలిసాడు వాళ్ళని వాళ్లు విరిగిన ఇటుకల వంటి రెండు బంగారం రంగులోవి చూపించారు. దాన్ని వాళ్ళే కొంచెం పగలకొట్టి చెక్ చేసుకోమన్నారు . నిజం బంగారం అని తేలింది. అక్కడి నుండి బేరం మొదలయింది. వాళ్ళు ఇరవై లక్షలు అడిగారు . సుమన్ పది కి ఒప్పించి ఊరికి బయలుదేరి వెళ్లాడు.

          ఒక వారం తర్వాత డబ్బు తీసుకెళ్లి ఇచ్చి, బంగారం తీసుకున్నాడు . ఇంటికి  వచ్చాక ఆ బంగారంని చూసుకుని మురిసిపోయారు ఇద్దరూ. పదిహేను రోజులు తర్వాత మంచిరోజు చూసుకుని ఆ బంగారం తీసుకుని నగలు చేసే షాప్కి వెళ్ళారు. ఆ షాపతను దాన్ని గీటు పెట్టి చూసి ఇది నకిలీది సార్ అన్నాడు. అంతే వీళ్ళిద్దరికి గుండెపోటు వచ్చినట్లు అయింది . ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ ఒకసారి చెక్ చేయమన్నారు అదే రిజల్ట్ వచ్చింది. ఇక చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళి బోరుమన్నారు.

  బంగారం ఇచ్చిన వాళ్ళకి కాల్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది ఎన్నిసార్లు చేసినా. చివరికి ఆ వూరు వెళ్లి రావడానికి నిశ్చయించుకున్నాడు సుమన్ అక్కడికి  వెళ్లి ఎంతమంది ని అడిగినా వాళ్ల ఆచూకీ చెప్పలేకపోయారు . చేసేదేమీ లేక పోలీస్ కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్ళాడు. వాళ్ళకి జరిగినదంతా చెప్పాడు. ఇక్కడ ఇదంతా మామూలే సార్,మాకే అటువంటి కాల్స్ చాలావస్తుంటాయి సార్ అని,మీరు కంప్లైంట్ ఇవ్వండి మా ప్రయత్నాలు మేం చేస్తాం,కానీ వాళ్ళు దొరుకుతారనే గ్యారెంటీ ఇవ్వలేం అన్నారు. చేసేదేమీ లేక కంప్లైంట్ రాసిచ్చి ఇంటికి తిరుగుముఖం పట్టాడు.

     జరిగిన దానిని మార్చలేం, ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి,మనకి జీవితంలో ఇది ఒక గుణపాఠం!ఇంకెప్పుడు ఈజీ మనీ కోసం ఆశపడకూడదు అనుకుంటూ ఒకరినొకరు ఓదార్చుకున్నారు.!!!!!!!!!!!Rate this content
Log in

Similar telugu story from Tragedy