STORYMIRROR

My Blog

Comedy Romance Fantasy

3  

My Blog

Comedy Romance Fantasy

ఎన్నెన్నో జన్మల బంధం

ఎన్నెన్నో జన్మల బంధం

3 mins
24

ఇది ఒక శృంగార ప్రేమ కథ .ఇందులోని పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితాలు మాత్రమే .ఎవరిని ఉద్దెశించినవి కావు ,ఎవరిని కించపరచాలని రాసినవి కావు .ఇది ఒక కథ మాత్రమే .శృంగారం జీవితం లో భాగమే కానీ శృంగారమే జీవితం కాదు .శృంగార కథలు చదవడం ఆసక్తి ఉన్నవారి కోసం మాత్రమే ఈ కథ .పెద్దలకు మాత్రమే .వీడు బోల్డ్ స్టోరీ తో వచ్చాడు అని తిట్టుకుంటున్నారా.తిట్టుకోకండి బోల్డ్ స్టోరీస్ కూడా నేను బూతులు లేకుండానే రాస్తున్నాగా .ఇలాంటివే OTT సంగతి దేవుడెరుగు ,మామూలు సినిమాలలో కూడా వస్తున్నాయ్ .


ఇక కథ లోకి వెళ్తే ,ఆ అమ్మాయి పేరు వల్లి,ఊరిలో మంచి పేరున్న కుటుంబం .ఆస్తి కూడా బానే వుంది .కానీ ఒకటే ఆమెకి పెళ్లి మీద ఆసక్తి కలగడం లేదు .పెళ్లి అంటే ససేమీరా అంటుంది .

ఇన్నాళ్లు ఈమె ఆస్తి చూసి కొందరు ,ఈమెని అనుభవించాలని కొందరు పెళ్ళికి బారులు తిరిగారు .కానీ ఇప్పుడేమో అబ్బా ఇంత అందం పూజకి పనికిరాని పువ్వు అయిపోతుందే అని ఒకటే గుసగుసలు ఊరిలో,ఆమె ఎందుకు ఇలా చేసింది అనుకుంటున్నారా ,కారణం

ఆమె ఇద్దరు అక్కలు భర్తలతో తెగతెంపులు చేసుకొని పుట్టింటిలోనే వుంటున్నారు .ఒక పెద్ద అక్కకి ఇల్లరికం అల్లుడిని తెచ్చుకుంటే ఆమె అనారోగ్యం తో చనిపోయింది. అక్కలు పెళ్లిళ్లు చేసుకొని ఏమి సుఖపడ్డారు అని ఆమె భావన .పైగా నా పెళ్లి అయి నేను అక్క లని అలా చూస్తూ నా మొగుడితో సుఖాలు అనుభవిస్తుంటే ,అక్క వాళ్ళు కూడా నన్ను చూసి ఓర్చుకోలేని పరిస్థితి వస్తుంది అనింది వల్లి . ఇక వీళ్ళ ఫామిలీ విషయం కి వస్తే ముగ్గురు ఆడపిల్లలకి రెండు తరాల వరకు తరగని ఆస్తి .ఇక పొలం కి సంబంధించిన పనులన్నీ పెద్ద బావ చూసుకుంటూ ,వచ్చిన ఆదాయం నలుగురు కి సమానంగా పంచుతాడు .కల్మషం లేని మనిషి .ఎందుకు బావ ఒకే ఇంట్లో వుంటూ మమ్మల్ని వేరు చేస్తున్నావ్ అంటే ,మీ ప్రతి అవసరానికి నన్ను అడగలేరు కదా ఎవరి ఎవరి పొలం మీద వచ్చిన ఆదాయం వాళ్ళ దగ్గరే ఉంచండి అనేవాడు .మరి ఇంత మంచి బావ వాళ్ళని సుఖపెట్టలేదా అనుకుంటున్నారా .ఆ ఆడపిల్లలు పద్దతిగా పెరిగిన వాళ్ళు .ఆయన వీళ్లందరి ముద్దుల బావ కానీ ఇంట్లో పనుకోడు,పక్కన వున్న తన ట్రాక్టర్ షెడ్ లో ఉంటాడు .నలుగురు నాలుగు రకాలుగా తన మరదళ్ళని అనుకోడం ఆయన అసలు సహించలేడు.వీళ్ళకి ఎలా అయినా పెళ్లి చేయాలి అనుకుంటాడు కానీ వాళ్ళు పెళ్లి అంటేనే భయపడతారు .చివరికి చిన్న మరదలు కూడా ఉద్యోగం చేస్తున్న కూడా పెళ్లి వద్దు అంటుంది.ఇక అందానికి వస్తే ఇద్దరు అక్కా చెల్లెల్లు అందం లో మీనా సుహాసిని లకి తగ్గరు .జఘన నితంబముల సొగసులు కూడా అద్భుతం .ఇక వల్లి ఏమో వయసు 28 చూడడానికి హీరోయిన్ అనుసితార ల ఉంటుంది .ఇక గూగుల్ లో చుడండి ఆమె అందం ఎలాంటిదో .ఇక వీళ్ళ పెద్ద బావ వయసు 55. భార్య కాలం చేసింది పిల్లలు లేరు .ఆ మిగిలిన ఇద్దరు మరదళ్ళు మీనా 42 ,సుహాసిని 48 సుహాసిని కొడుకు చదువులకి అమెరికా వెళ్ళాడు .మీనా కూతురు ఇంజనీరింగ్ అయిపోయి ఉద్యోగం కి వెల్లింది .పెద్ద బావకి మూడో మరదలు వల్లి ఎప్పుడూ చిట్టి మరదలే.ఫోన్లులో గంటల తరబడి మాట్లాడుతుంది .ఈమె ఫోన్ రాగానే ఆయన ఎంతో మురిసిపోతారు .ఎంత పొలం పనులు వున్నా సరే ట్రాక్టర్ నడుపుతూనే మాట్లాడుతాడు అంత లా మాట్లాడుకుంటున్నారు .కానీ పెళ్లి విషయం అడిగితే మాత్రం ఉలుకు పలుకు ఉండదు ,ఇక తన బావ అడగడమే మానేసాడు .

వీళ్ళకి ఒక మేనత్త కొడుకు(వరుణ్) వున్నాడు అండోయ్ .అల్లరి పిల్లోడు వాడి వయసు 24 వీడు కూడా ఇంజనీరింగ్ అయిపోయి జాబ్ చేస్తున్నాడు .వీడు వల్లి కంటే నాలుగేళ్లు చిన్న .వల్లి సరదాకి అంటుండేది నాలుగేళ్లు ముందే పుట్టింటే నిన్నే చేసుకునే దాన్ని అని .మరి వల్లి వాడు చిన్నప్పుడు నుండే కలిసి పెరిగారు కదా ఆ మాత్రం చనువు వుండొచ్చుగా .మిగతా ఇద్దరు అక్క చెల్లెళ్లని వదిన అనే వాడు వల్లి ని మాత్రం పేరు పెట్టె పిలుస్తాడు .


కాలం ఎవరిని ఎలా కలుపుతుందో ఎవరికీ తెలుసు తరువాయి భాగం లో చూద్దాం .మీరు అనవసరం గా కంగారు పడి నేను వల్లి ని వరుణ్ తో కలుపుతా అనుకునేరు అలా ఏమి అనుకోకండి .


Rate this content
Log in

Similar telugu story from Comedy