ఏంటో ప్రణయమా
ఏంటో ప్రణయమా


నే నిన్ను మళ్ళీ నమ్మీస్తే.నే నిన్ను మళ్ళీ ప్రేమిస్తే.నీ నవ్వుకి నన్ను నేను మర్చిపోతే.నీ కన్నీళ్ళకి నే కరిగిపోతే.
నీ తలపుల్లో నే ప్రపంచాన్ని మరిచిపోతే.ప్రణయమా నువ్వంటే భయం.నువ్వు చేసే మాయలంటే భయం.
నువ్వు నన్ను కంట్రోల్ చేసే విధానం అంటే భయం.నన్ను నేను నీకోసం వదిలేస్తానేమో అనే భయం.
నీతో మాట్లాడాలని నా క్షేమం వదిలేసుకుంటానేమో అనే భయం.
మళ్ళీ ప్రేమలో పడతానేమో అనేదే నా అతి గొప్ప భయం.ఏంటో ప్రణయమా నీ ఆటలు అర్థం కావు కదా నాకు.