దైవం
దైవం
అదో పట్టణం. అక్కడ ఎవరు ఎవరిని పట్టించుకోరు అనేది వాడుక. అలానే పల్లెల్లో లాగ ఇరుగు పొరుగు వాళ్లతో ఎవరు అంత సఖ్యం గా వుండరు. ఎవరి పనులలో ఉంటారు. పల్లెలో అందరు బంధువులే కానీ పట్టణం లో బంధువులు కూడా పరాయి వాళ్లే. కానీ పల్లె అయిన పట్టణం అయిన దైవం దగ్గర అందరు సమానమే అందుకే కోవెలకు వెళ్ళేటప్పుడు అందరు భక్తి, లేదా భయం ఈ రెండింటిలో ఏదో ఒకటి అందరిని కలుపుతుంది. గ్రామమైన అది పట్టణం అయిన కుల దైవం కోవెలకి కుటంబం అంతా కలిసే వెళతారు అలానే సుబ్బయ్య తన కుటుంబం తో కలిసి గ్రామానికి ఒక టెంపో బండిని తీసుకొని అందరినీ తీసుకొని వెళ్ళాడు కొడుకులు కదళ్ళు అందరు ప్రయాణమై త్రోవలో వంట చేసి తిని మరుసటి రోజు కోవెలకీ వెళ్లారు అక్కడ రెండు రోజులు అందరు సంతోషం గా గడిపారు. గ్రామం లో కొంతమంది ఓ సుబ్బయ్య పట్టణం వెళ్ళాక కూడా నువ్వేమి మారలేదు. అని అందరు పొగిడారు. కొడుకులు కోడళ్ళు అందరు కూడా చాలా సంతోషంగా గడిపి ప్రకానున్న చుట్టాలతో సంవత్సరమంటా శ్రమ పడితే ఇలా ఓ పది రోజులు అందరమూ కలిసికట్టుగా హాయిగా గడపోచ్చు అని చెప్పారు. వెంటనే అదే గ్రామం లో ఉండే రామయ్య నేను ఇక్కడే పొలంలో పనిచేస్తున్నాను న పిల్లలు పట్టణంలో వున్నారు అప్పుడప్పుడు వొస్తు ఉంటారు. అని చెప్పాడు. వెంటనే నీ భార్య ఎక్కడ అని అడిగాడు సుబ్బయ్య వెంటనే రామయ్య ఎదురుగ ఉండే నన్ను అడగడు కానీ వాడి స్నేహితురాలిని మ్సరం అడుగుతున్నాడు చూడండిర్ర మీ నాన్న అని ఎగతాళి చేస్తూ అందరు నవ్వుకున్నారు. కానీ రామయ్య మాత్రం ఆ చెరువులు కుట్టలు అన్నీ చూస్తూ పాత రోజులు భార్య తో ఎలా గడిపేడో ఆ జ్ఞాపకాలతో మళ్లి పట్టణానికి వెళ్ళాడు. ఎంతైనా పల్లె జ్ఞాపకాలు మధురనుభావాలు. అప్పుడు దైవాన్ని తలుచుకుంటూ దేవుడా నీ దర్శనానికి ఎప్పుడు సంతోషంగా కుటుంబం తో వచ్చేటట్లు చూడవయ్య అంటూ నిద్రపోతాడు రోజు.
