gowthami ch

Tragedy

5.0  

gowthami ch

Tragedy

చెరవాణి

చెరవాణి

3 mins
217


పల్లెటూరి నుండి పట్నం కి వచ్చిన తండ్రిని తీసుకు రావడానికి బస్టాండ్ కి వెళ్ళాడు సుదీప్.


" ప్రయాణం బాగా జరిగిందా నాన్న?" అంటూ తండ్రి చేతిలోని బ్యాగ్ అందుకున్నాడు సుదీప్.


"హే ఆటో అంటూ తండ్రి అరవడం విని నాన్న ఇది పట్నం ఇక్కడ అలా అరవకూడదు ఒక్క నిముషం ఉండండి వస్తుంది." అంటూ ఫోన్ తీసి ఏదో నొక్కుతున్న కొడుకుని చూసి "అదేంటిరా ఆటోని పిలవరా అంటే ఫోన్ నొక్కుతున్నావు?" అడిగాడు తండ్రి.


5 నిముషాల తరువాత ఒక కార్ వచ్చి వాళ్ళ ముందు ఆగింది. "పదండి నాన్న" అంటూ కార్ డోర్ ఓపెన్ చేసి ఎక్కమని సైగ చేసాడు సుదీప్.


కార్ ఎక్కి కూర్చుని "అదేంటిరా సుదీప్ నువ్వు అసలు ఏమి పిలవకుండానే కార్ వచ్చి ఆగింది?" అని విచిత్రంగా అడిగాడు వాళ్ళ నాన్న.


"అది అంతే నాన్న ఇందాక నేను ఫోన్లో ఏం చేసాను అనుకున్నావు మరి, కార్ బుక్ చేసాను. ఇలా ఫోన్లో మనం ఉన్న ప్రదేశం పేరు రాసి ఎక్కడికి వెళ్లలో రాస్తే కొన్ని నిముషాలలో కార్ మన ముందుకు వచ్చి ఆగుతుంది."


కొడుకు మాటలకి ఆశ్చర్య పోయాడు తండ్రి. కొంత సేపటికి రూమ్ కి చేరుకున్నారు. కార్ దిగి మొబైల్ లో ఏదో నొక్కేసి నేరుగా లోపలికి వెళ్లిపోతున్నాడు కొడుకు.


"అదేంటిరా వాడికి డబ్బులు ఇవ్వలేదు? "అడిగాడు తండ్రి.


"ఇచ్చాను నాన్న ఫోన్ ద్వారా." అంటూ లోపలికి వెళ్ళిపోయాడు సుదీప్.


"ఆకలేస్తుంది రా త్వరగా తయారయ్యి వస్తాను దగ్గర్లో తినడానికి ఏమైనా ఉంటే చెప్పు బయటకి వెళ్లి తినేసి వద్దాం." అంటూ స్నానం చేయడానికి లోపలికి వెళ్లిపోయాడు తండ్రి.


వాళ్ళ నాన్న స్నానం చేసి వచ్చేలోపు తినడానికి అన్నీ సిద్ధం చేసిపెట్టాడు సుదీప్. "అదేంటిరా ఇప్పుడేగా అలా వెళ్ళాను ఈలోపు బయటకి వెళ్లి ఇవన్నీ ఎలా తెచ్చావు?"


"నేను వెళ్లలేదు నాన్న ఫోన్లో ఆర్డర్ పెడితే వాళ్లే తెచ్చి ఇచ్చారు."


ఆశ్చర్యపడడం మాములు అయిపోయింది వాళ్ళ నాన్నకి.


"సినిమాకి వెళదామ నాన్?"


"సరేరా ఎంతసేపు రూంలో కూర్చొని బోర్ కొడుతుంది."


"పద నాన్న వెళదాం. అదేంటిరా ఇప్పుడేగా అడిగావు? అంతలోనే వెళదాం అంటున్నావు?"


"ఆన్లైన్లో చూసాను నాన్న ఇంకొక గంటలో సినిమా మొదలవుతుంది సీట్లు కూడా కాళీగా ఉన్నాయి అంతే బుక్ చేసేసాను."


ఇంటర్వెల్ లో స్నాక్స్ ముందుగానే ఆర్డర్ ఇవ్వడంతో టైం కి తెచ్చి ఇచ్చారు.


"ఇది కూడా ఫోన్లోనే చేసావా?"


ఫోన్ చూపించి అవును అన్నట్లు నవ్వాడు కొడుకు.


రాత్రికి తిరిగి రూమ్ కి చేరుకున్నారు ఇద్దరూ.


రూంకి వచ్చేసరికి గది బయట తలుపు దగ్గర ఏదో పార్సెల్ ఉండడంతో దాన్ని చేతిలోకి తీసుకొని లోపలికి వెళ్లిపోయాడు సుదీప్.


"ఏందిరా అది?" అడిగాడు తండ్రి.


"చేతి గడియారం నాన్న ఆన్లైన్లో బుక్ చేసాను ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్లారు."


"ఎరా అయ్యా ఈ పూటకి ఇంక చాలు రేపు ఉదయం లేచి వెళ్లిపోవాలిగా ఇక పోయి పడుకుంటాను. "


"సరే నాన్న" అంటూ ఫోన్లో ఏదో నొక్కుతున్న కొడుకుని చూసి దగ్గరకి వచ్చి. "ఇప్పుడేమి చేస్తున్నావు నాన్న ఫోన్లో?"


"ఈ నెల ఇంటర్నెట్ బిల్ కడుతున్నాను నాన్న."


"సర్లేరా ఏదో చేసుకో." అని వెళ్ళిపోయాడు తండ్రి.


నిద్ర పోయితున్న సుదీప్ వాళ్ళ నాన్నకి మధ్యలో మెలకువ వచ్చి చూసేసరికి కొడుకు ఫోన్లో ఏదో నొక్కుతూ ఉండడం చూసి "ఎరా ఇంకా నిద్రపోలేదా?"


"లేదు నాన్న ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను."


ఉదయం నిద్రలేచి చూసేసరికి కొడుకు పక్కన లేడు ఎక్కడకి వెళ్ళాడో అని వెతుకుతుండగా బయట కూర్చొని ఫోన్ నొక్కుతూ కనిపించాడు సుదీప్.


"ఇంత ఉదయాన్నే ఏం చేస్తున్నావు నాన్న?" అడిగాడు తండ్రి.


"ఉదయాన్నే మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి అత్యవసరంగా డబ్బు కావాలి పంపమన్నారు నాన్న అందుకే పంపుతున్నాను."


స్నానం చేసి బయటకి వచ్చి చూసేసరికి మరలా ఫోన్లో ఏదో నొక్కుతూ ఉన్నడే సుదీప్.


"ఇప్పుడు ఏం చేస్తున్నావు నాన్న?"


"ఫ్రెండ్స్ కి good మార్నింగ్ చెప్తున్నాను."


"ఒకమాట చెప్తాను ఏమనుకోవుకదా సుదీప్?" అడిగాడు వాళ్ళ నాన్న.


"ఏంటి నాన్న అది?" అడిగాడు సుదీప్.


"ఒక్కరోజు ఈ ఫోన్ తో పనిలేకుండా ఉండగలవా?"


"అదెలా కుదురుతుంది నాన్న? "


"నేను వచ్చిన దగ్గర నుండి ప్రతి దానికీ ఫోన్ లోనే చేస్తున్నావు. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఏదో ఒకటి చూస్తూనే ఉన్నావు. కాస్త తగ్గించుకొ నాన్న." అంటూ సలహా ఇచ్చాడు తండ్రి.


"అలానే నాన్న కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫోన్ అనేది ఒక ముఖ్య అవసరం గా మారింది నాన్న. అది అలా అలవాటు అయిపోయింది అంతే."


"అలవాటు వరకు ఐతే పర్లేదు నాన్న కానీ వ్యసనంగా మాత్రం మారకుండా చూసుకో లేకపోతే చాలా ఇబ్బంది పడతావు."


"ఛి ఛి అలా ఏం లేదులే నాన్న అది వ్యసనం ఎలా అవుతుంది?"


"ఇప్పుడు అలానే అనిపిస్తుంది. ఇందాక నేను అడిగినప్పుడు నువ్వే అన్నావుగా ఫోన్ లేకుండా ఉండడం కుదరదు అని, అదే నాన్న వ్యసనం అంటే.."


"అందులో ఉండే వాళ్ళకి అది ఒక అలవాటు లాగానే అనిపిస్తుంది ఆ తరువాతే అర్ధమవుతుంది అది ఒక వ్యసనం అని కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయుంటుంది. అందులో నుండి బయట పడడం చాలా కష్టం అందుకే ముందుగానే హెచ్చరిస్తున్నాను. జాగర్త. "


"అలాగే నాన్న మీరు చెప్పినట్లు ఇప్పటి నుండి ఫోన్ వాడటం తగ్గిస్తాను." అని వాళ్ళ నాన్న ని బస్ ఎక్కించేందుకు బస్టాండ్ కి తీసుకెళ్లాడు.


Rate this content
Log in

Similar telugu story from Tragedy