Dr.R.N.SHEELA KUMAR

Drama

4  

Dr.R.N.SHEELA KUMAR

Drama

చదువులో సదువులు

చదువులో సదువులు

1 min
305


కొరానా మహమ్మారీ కాలం. జయ ప్రయివేట్ స్కూల్ లో 15సంవత్సరాలుగా పనిచేస్తుంది. ఈ కొరనా కారణంగా స్కూల్ తెరవలేదు కానీ క్లాసులు ఆన్లైన్ లో చెపుతుంది. ఉదయం 9గంటల నుండి 1గంట వరకు తన రూమ్ నుండి బయటకు రాదు ఉదయం 4గంటలస్కు లేచి టిఫన్, మధ్యాహ్నం వంట అన్నీ చేసి స్కూల్ కి వెళ్ళేటట్లు రెడీ అయ్యి తన రూమ్ లో ఓ టేబుల్ మీద లేప్ టాప్ పెట్టుకొని క్లాసులు తియ్యటం మొదలు పెట్టింది.

ఓ రోజు ప్రిన్సిపాల్ తో జయ చెపుతుంది sir పిల్లలు 5th చదువుతున్నారు క్లాస్ జరుగుతున్నప్పుడు తల్లితండ్రులు వచ్చి కూర్చుంటున్నారు చాలా కష్టంగా ఉంది సార్ అని చెప్పింది. ఓ రోజు క్లాస్ లింక్ పంపమని చెప్పి మరుసటి రోజు క్లాస్ కి వచ్చి పేరెంట్స్ తో దయచేసి పక్కన కూర్చోండి కానీ ఫ్రేమ్ లోకి రావొద్దు పిల్లలని తమ ఇష్టానికి వదిలేయండి మీరు వాళ్ళ జీవితాన్ని జీవించకండి అని చెప్పారు.

అంతే మరుసటి రోజు జయకి వరుసగా 30ఫోన్ లు ఏం మేడం మేము మీ క్లాస్ చూడకూడదా అని. అప్పుడు జయ మీరు ప్రక్కన వుండండి నేనడిగే ప్రశ్న లకీ మీరు జవాబులు చెప్పొద్దూ మీవపిల్లలకు ఆలోచించే అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పింది. ఓ ఆరు నెలలో ఎవరు రాలేదు పిల్లలు చాలా సంతోషంగా క్లాసులు చూసేరు.

పరీక్షలు లేకుండానే అందరు పాస్. గీత, సీత, మనోజ్ అందరు కోరానకు జై జై అంటూ ప్రమోట్ అయిపోయారు చదువులు సదువులాయి పొన్నాయి ఈ కొరనా వలన అని జయ ఇంటి పని చేసే రత్తాలు చెపుతు అమ్మ ఈ సంవత్సరం సదువు పూర్తి చేసుకున్న వారికీ ఉద్యోగాలు దొరుకుతాయా అని అడిగింది. పని చేసే ఉత్తమ గుణం ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఎక్కడైన దోరుకుతుంది అని చెప్పాడు. అలానే భర్త ప్రోత్సహించి ఆమెను గొప్ప ఉపాధ్యాయురాలిగా గుర్తింపు తెచ్చారు



Rate this content
Log in

Similar telugu story from Drama