D v

Comedy Romance Inspirational

4.5  

D v

Comedy Romance Inspirational

భార్య భర్తల గిల్లికజ్జాలు

భార్య భర్తల గిల్లికజ్జాలు

3 mins
476


సాయంత్రం ఆఫీస్ నుంచి అలసటగా ఇంటికి వచ్చాడు గౌతమ్.....అప్పుడే ప్రేమగా కిచెన్ లో నుంచి గౌతమ్ కోసం వాటర్ ఒక కప్ కాఫీ పట్టుకొని తీసుకొనివచ్చి సోఫా లో కూర్చుని ఉన్న గౌతమ్ దగ్గరికి వెళ్లి "కాఫీ తీసుకోండి శ్రీవారు..." అని ప్రేమగా ఇస్తుంది గౌతమ్ భార్య నందు అలియాస్ నందిక.....


నందుని అలా చూడగానే గౌతమ్ ఆశ్చర్యపోయి వాటర్ గ్లాస్ తీసుకుని వెంటనే తాగి కాఫీ కప్ తీసుకుంటూ "ఈరోజు ఏంటి ఇలా వరం ఇస్తున్నావు??? డైలీ నేను వచ్చే సరికి ప్రపచమంతా ఏదో మునిగిపోయినట్టు టీవీ సీరియల్ చూస్తూ కూర్చుంటావు కదా!!!! మరి ఈ రోజు ఏంటి టీవీ కి రెస్ట్ ఇచ్చావు??? పైగా ఇంత ప్రేమగా కాఫీ తీసుకు వచ్చి ఇస్తున్నావు??? ఏమైంది బాగానే ఉన్నావా???" అని అనుమానంగా అడుగుతాడు


నందు వెంటనే అలక గా మొహం పెట్టి "మీకన్నీ వేలకోలాలేనా గౌతమ్??? ఏదో అలసిపోయి ఆఫీస్ నుంచి వచ్చారని కాఫీ ఇస్తే ఇలా మాట్లాడుతారా??? నేను మీతో మాట్లాడను పోండి..... నేను అలిగి బుంగమూతి కూడా పెట్టుకున్నాను...." అని గౌతమ్ పక్కన కూర్చొని మొహం వేరే వైపు తిప్పుకొని అంటుంది


గౌతమ్ నవ్వుతూ నందుని పట్టించుకోకుండా కాఫీ తాగుతూ రిమోట్ తీసుకొని టీవీ ఆన్ చేస్తాడు.....


నందు అది చూసి "నేను అలిగానని చెప్పిన మీరు పట్టించుకోరా??? ఇంతేనా మీకు నా మీద ఉన్న ప్రేమ!!!" అని చిరుకోపంగా అడుగుతుంది


"హలో నందు గారు నేను డైలీ ఇలాగే ఆఫీస్ కి వెళ్లి వస్తాను.... నువ్వు డైలీ ఇలాగే చేస్తున్నావా???? నేను వచ్చేసరికి నువ్వు పాప్కార్న్ తింటూ సోఫాలో కూర్చుని టివి సీరియల్ చూస్తూ అందులోనే మునిగిపోయే దానివి....(జస్ట్ నార్మల్గా అన్నాను ఎవరినీ ఉద్దేశించి కాదు ఫీలవకండి.....) ఈ రోజు ఇలా చేశావంటే నాకు ఏదో టెండర్ పెట్టావు అని అర్థమవుతుంది..... అనవసరంగా నీతో మాట్లాడి నేను ఎందుకు నా పర్స్ కి పంచర్ వేయించుకోవాలి??? అందుకే నేను సైలెంట్ గా క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను.... డిస్టర్బ్ చేయకు...." అని కాళ్ళు టీపాయ్ మీద పెట్టి రిలాక్స్గా కూర్చొని క్రికెట్ ని చూస్తూ ధోని సిక్స్ కొట్టు ఫోర్ కొట్టు అని చేతులు ఊపుతూ యాక్టింగ్ చేస్తూ అంటాడు


నందు గౌతమ్ మాటకి షాక్ అయ్యి "నా మనసులో ఉన్నది గౌతమ్ కి ఎలా తెలిసింది??? ఇప్పుడు ఏం చేయాలి????" అని గారంగా గౌతమ్ మెడ చుట్టూ చెయ్యి వేసి గౌతమ్ అని ప్రేమగా పిలుస్తుంది


గౌతమ్ వెంటనే తలతిప్పి తన గుండెల మీద చెయ్యి వేసుకుని నందు వైపు చూస్తూ "నువ్వు ఇంత ప్రేమగా మాట్లాడుకు నాకు గుండెల్లో నొప్పి వస్తుంది.... ప్లీజ్" అని దీనంగా మొహం పెట్టి అంటాడు


నందు గౌతమ్ మాటలు పట్టించుకోకుండా గౌతమ్ బుగ్గ మీద ముద్దులు పెడుతూ "ఈ రోజు ఫస్ట్ తారీకు కదా!!!! మీకు సాలరీ వచ్చి ఉంటుంది తెచ్చారా???" అని ప్రేమగా అడుగుతుంది


గౌతమ్ నందు మాయలో పడిపోయిన వాడే శాలరీ అనగానే స్టిఫ్ గా కూర్చుని "ఎందుకు ఇంత చేస్తున్నావు అనుకున్నాను ఇందుకా??? అయినా నా సాలరీ తో ఏం పని??? నువ్వు ఇప్పుడు నా సాలరీ తో ఏం చేయాలని అనుకుంటున్నావు????" అని అనుమానంగా అడుగుతాడు


నందు నవ్వుతూ "పక్కింటి ఆంటీతో ఇంటికి వెళ్లాను కదా అక్కడ మాఘ మాసమని చందనాబ్రదర్స్ లో ఆఫర్ పెట్టారు!!! 25 వేల పట్టు సారీ జస్ట్ 10000 ఇస్తున్నారు!!! ప్లీజ్ గౌతమ్ నాకు ఒక టెన్ థౌసండ్ ఇవ్వవా నేను ఆ పట్టు సారీ కొనుక్కుంటాను.... నాకు ఆ సారి బాగా నచ్చింది" అని ముద్దుగా మొహంపెట్టి అంటుంది


గౌతమ్ వెంటనే పైకి లేచి పరిగెత్తుకుంటూ కిచెన్ లోకి వెళ్లి తను తాగిన కప్ కాఫీ వాంతి చేసుకుంటూ ఉంటాడు....


నందు కూడా కంగారుగా వెనకే వచ్చి గౌతమ్ అలా వాంతి చేసుకోవడం చూసి తన చెవులు మూసి పట్టుకుంటుంది....


నందు వాంతి చేసుకున్నాక మౌత్ వాష్ చేసుకుని నందు కంగారుగా "ఏమైంది గౌతమ్???" అని అడుగుతూ ఉంటే


"నీ కాఫీ నీకు ఇచ్చేశాను ఇక నువ్వు నన్ను డబ్బులు అడగకు.... అయినా 10 వేలు పెట్టి ఎవరైనా సారీ కొనుక్కుంటారా??? నువ్వు నీ పిచ్చి కాకపోతే!!!! ఈ మధ్య నీకు పైత్యం మరీ ఎక్కువ అవుతుంది...." అని సీరియస్ గా చెప్పి రూమ్ కి వెళ్ళిపోతాడు....


నందు గౌతమ్ చెప్పిన మాటకి షాక్ అయ్యి "ఇదేంటి ఇలా అనేసాడు??? గౌతమ్ ఏదైనా కనీ నేను మాత్రం ఆసారీ కొనుక్కోవాల్సిందే!!!" అని తనకి తాను శపధం చేసుకుని గౌతమ్ వెనకే వెళ్తుంది


ఎవరిని ఉద్దేశించి రాయట్లేదు.... మీరు దీనిని మీ మనసుకి తీసుకొని హార్ట్ అవ్వకండి....


ఇంకా ఉంది....


ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్....



Rate this content
Log in

Similar telugu story from Comedy