Kishore Semalla

Drama Inspirational

4.5  

Kishore Semalla

Drama Inspirational

బాధ్యత

బాధ్యత

4 mins
23.4K


        ఉదయం ఆరుగంటల వేళ సుమారు 100 కి.మీ. వేగంతో గోవా నుంచి బెంగళూరు వెళ్లే హైవే మీద ప్రతాప్ సుధీర్ ని బైక్ మీద తీసుకొస్తున్నాడు.

      

             సుధీర్ కి వేగం అంటే చాలా భయం. ఎవరి బైక్ కూడా ఎక్కడు అందుకే. కానీ ప్రతాప్ తనని ఒప్పించి ఒకసారి ఆటపట్టిదమ్ అని తన బైక్ ఎక్కించుకున్నాడు. ప్రతాప్ కి వేగం అంటే చాలా సరదా. వేగం ప్రదర్శించడం, బైక్ మీద విన్యాసాలు చెయ్యడం తనకి అలవాటు.

             భయపడుతున్న సుధీర్ వెనకనుంచి హెచ్చరిస్తూనే వున్నాడు...వేగం తగ్గించమని. అయినా సరే వినని ప్రతాప్ సుధీర్ ని ఇంకా భయపెట్టాలని అదే వేగం తో బైక్ ని అటూ ఇటూ తిప్పుతూ ఆట పట్టించడం మొదలుపెట్టాడు.

            సుధీర్ కి భయం ఎక్కువ అయ్యింది ఇక. వెనక రాడ్ ని గట్టిగా పట్టేసుకున్నాడు. కళ్ళు ని తెరవట్లేదు ఇంకా. కానీ ప్రతాప్ అద్దం లో సుధీర్ ని చూసి పిరికివాడా అని ఎక్కిరించాడు.

             ఇంతలో వెనక నుంచి ఒక లారీ వీళ్ళని క్రాస్ చేసి వెళ్ళింది. ప్రతాప్ కి అది నచ్చలేదు. ఎలా ఐన ఆ లారీ ని దాటాలని వేగం పెంచాడు ఇంకా. సుధీర్ భయపడుతూ బైక్ ని ఆపితే నేను దిగిపోతా అని చెప్పాడు. కానీ ప్రతాప్ వినిపించుకోవట్లేదు తన మాట.

             ప్రతాప్ దృష్టి అంతా ఆ లారీ ని ఛేదించాలనే వుంది. లారీ దగ్గరకి చేరుకున్నాడు. లారీ డ్రైవర్ కూడా తగ్గడం లేదు. బైక్ వెళ్ళడానికి వీలు లేకుండా లారీ ని అటూ ఇటూ తిప్పుతూ నడుపుతున్నాడు. ప్రతాప్ ఐనా సరే బైక్ ని డివైడర్ దగ్గర కట్ చేసి పోదాం అని ప్రయత్నించాడు. కానీ బైక్ అదుపుతప్పి డివైడర్ ని గుద్దుకుని ఎగిరి అవతల పడ్డాడు. హెల్మెట్ వుండడం వల్ల తలకి పెద్ద దెబ్బ ఏం తగలలేదు. ఇంతలో కళ్ళు మసక మసక గా కనిపిస్తున్నాయి. చుట్టూ జనం మూగిపోయినట్టు తెలుస్తుంది. అలా కళ్ళు మూసుకున్నాయ్.

            

               కళ్ళు తెరచి చూస్తే "హాస్పిటల్" లో వున్నాడు. పక్కనే సుధీర్ కూర్చుని వున్నాడు. మెలుకువ వచ్చిన ప్రతాప్ సుధీర్ ని చూసి, "నువ్వు బాగానే ఉన్నావ్ కదా?", నీకేం కాలేదు అదే సంతోషం. అనవసరంగా నువ్వు వద్దంటున్నా నేనె వేగంగా బైక్ నడిపాను. కొంచెం నేనె ఆలోచించి నడపాల్సింది అని కుమిలిపోయాడు.

   

              పరవాలేదు నువ్వు కోలుకున్నావ్ చాలు. నువ్వు బాగా విశ్రాంతి తీసుకోవాలి. నేను నీ పక్కనే తోడుగా వుంటా, ధైర్యంగా వుండు అని సుధీర్ ధైర్యం చెప్పాడు.

               ఇంతలో తలుపు తెరచిన అలజడి వినిపించింది. వేరు ఎవరో కాదు, ప్రతాప్ వాళ్ళ అమ్మ నాన్న. దగ్గర చేరి ప్రతాప్ ని ఓదార్చుతున్నారు. వాళ్ళ అమ్మ ఐతే బిడ్డ దగ్గర ఏడవొద్దని కన్నీరు ఆపుకుంటున్నా, ఆగనంటున్న కన్నీరు కళ్ళని దాటి బయటకి వచ్చేసాయి. నాన్న తలని నిమురుతూ తన ప్రేమని చూపిస్తున్నాడు. కుటుంబం తో కాసేపు ప్రతాప్ సమయం గడపాలని సుధీర్ బయటకి వచ్చేసాడు.

          

               కొన్ని రోజులు గడిచాక ప్రతాప్ పూర్తిగా కొలుకున్నాడు. తన నాన్నగారి వ్యాపారం తానే స్వయంగా చూసుకుంటున్నాడు. తొంభై లో వెళ్లే బండి అరవై దాటకుండా జాగ్రత్త పడుతున్నాడు. చాలా మార్పు వచ్చింది ప్రతాప్ లో మునుపటి తో పొలిస్తే.

                ఒకరోజు ప్రతాప్ ఆఫీస్ లో ఉండగా సుధీర్ అక్కడికి వచ్చాడు. ప్రతాప్ చాలా ఆనందపడ్డాడు సుధీర్ రాకతో. ఇద్దరికి కాఫీ తెమ్మని పని వాడికి చెప్పాడు.

    

                ఇద్దరు కాసేపు మాటల ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇంకేంటి కబుర్లు సుధీర్ అని ప్రతాప్ అడిగాడు. ఈరోజు నువ్వు నాతో పాటు మా ఇంటికి రావాలి ప్రతాప్ అని సుధీర్ అడిగాడు. ఎప్పుడూ తీసుకు వెళ్లమన్నా ఏదో కారణం చెప్పి ఆపేసేవాడివి నన్ను, ఈరోజు నువ్వే రమ్మంటున్నావ్, "ఏదన్నా ఫంక్షన్ వుందా ఇంట్లో?" అని అడిగాడు. అలాంటిది ఏమి లేదు, ఊరికే మా ఇంట్లో నిన్ను పరిచయం చేసినట్టు వుంటుంది అని అడిగాను.

            దానికి ప్రతాప్- పద పోదాం, నువ్వు పిలవడం నేను రాకపోవడమ....ఎంత మాట అని ఇద్దరు నవ్వుకునే లోపు , సర్! కాఫీ అని పనివాడు పిలిచాడు. ప్రతాప్ ఒక కప్పు తీసుకుని సుధీర్ ని కూడా త్రాగమన్నాడు. కానీ సుధీర్, " నేను ఇప్పుడే త్రాగి వచ్చాను", తరువాత ఎప్పుడన్నా మళ్ళీ కలిసి తాగుదాం అని చెప్పాడు సుధీర్.

           

            ఇద్దరు బయల్దేరారు కాసేపటికి. ప్రతాప్ బైక్ నడుపుతూ...... గుర్తుందా సుధీర్, మనం సరిగ్గా ఆరు నెలల క్రితం ఇలానే బైక్ మీద తిరిగాం. దేవుడి దయవల్ల ఇద్దరం బయట పడ్డాం. మళ్ళీ చాలా రోజులకి ఇలా కలిసి ఒకే బైక్ మీద....... అని పాత రోజులని గుర్తుచేసుకున్నాడు.

              

             ఇంతలో సుధీర్ వాళ్ళ ఇల్లు వచ్చింది. చూడడానికి చాలా పాత ఇల్లు, రేకుల ఇల్లు అది. బయట ఒక బావి, పూల మొక్కలు ఉన్నాయి. పక్కనే మంచాన పడిన సుధీర్ వాళ్ళ నాన్న ని చూసాడు. నమస్కారం పెట్టాడు. కానీ స్పందించలేని ఆయన్ని చూసి బాధపడ్డాడు. దగ్గరకి పోయి పరామర్శించాడు.

     

            చిన్న గుమ్మం. దాన్ని దాటుకుని లోపల అడుగుపెట్టాడు. కుట్టుమిషన్ మీద బట్టలు కుడుతున్న ఆవిడే మా అమ్మగారు అని సుధీర్ చెప్పాడు. ప్రతాప్ ని చూసి సుధీర్ వాళ్ళ అమ్మగారు, నమస్కారం చెప్పి... కూర్చో బాబు, టీ తీసుకుని వస్తా అని లోపలికి వెళ్లారు.

            ప్రతాప్ చుట్టూ పరిసరాలు గమనిస్తూనే వున్నాడు. ఇంత పేదరికం లో వున్నారా వీళ్ళు అని ఆశ్చర్య పోయాడు ప్రతాప్.

           ఇంతలో సుధీర్ వాళ్ళ చెల్లి స్కూల్ లో పిల్లలకి పాఠాలు చెప్పి అప్పుడే వచ్చింది. ప్రతాప్ ని చూసి నమస్తే చెప్పి, "కూర్చోండి, అమ్మా! టీ పెట్టావా? అన్నయ్య ఫ్రెండ్ ఎవరో వచ్చారు" అంటూ పిలిచింది.

           ప్రతాప్ ఆ ఇంటిని, వాళ్ళ పరిస్థితి ని చూసి ఇంత చిన్న ఇంట్లో ఇన్ని కష్టాలతో ఎలా బ్రతుకుతున్నారని ఆశ్చర్యపోయాడు. అలా లోపల అన్ని వైపులా చూసుకుంటూ గోడ మీద సుధీర్ ఫోటో ని పూలమాల తో చూసాడు. అంతే ఆక్కడిక్కడే షాక్ అయ్యాడు. పక్కన చూస్తే సుధీర్ లేడు.

   

          ఇంతలో సుధీర్ వాళ్ళ అమ్మ, చెల్లి వచ్చారు. వీళ్ళని చూసి సుధీర్ ఫోటో ఏంటి గోడ మీద.... అని అడిగాడు. దానికి వాళ్ళ అమ్మగారు కంట్లో కన్నీరు తీశారు, వాళ్ళ చెల్లి ఊర్కో అమ్మ అని ఓదార్చింది. కళ్ళని తుడుచుకుని సరిగ్గా ఆరునెలల క్రితం వాడు బైక్ ఆక్సిడెంట్ లో చనిపోయాడు బాబు అని చెప్పింది.

           ఆ వార్త విన్న వాళ్ళ నాన్నగారికి పారాలిసిస్ స్ట్రోక్ వచ్చి మంచాన పడ్డారు. తన చెల్లి ఇంజినీరింగ్ మద్యలో మానేసి స్కూల్ లో పాఠాలు చెప్పుకుంటూ ఇంటి బాధ్యతని తీసుకుంది. తనకో చెయ్యి సహాయంగా వుండాలని నేను కుట్టుమిషన్ కొనుకున్నాను.

  

          చెట్టంత కొడుకు చేయి జారిపోయాడు అయ్యా. నా కొడుకు బ్రతికి వుంటే అన్ని సవ్యంగా సాగేవి ఈరోజు. కానీ వాడ్ని దేవుడు ముందే తీసుకుపోయాడు. వాడి రాత అంతే అనుకుంటా అని బాధ పడింది సుధీర్ వాళ్ళ అమ్మ.

           ఇదంతా విన్న ప్రతాప్ లేచి అక్కడ నుండి బయల్దేరాడు. బైక్ మీద వెళ్తూ, నేను చేసిన చిన్న తప్పు వల్ల ఒక కుటుంబం రోడ్డున పడింది. వాళ్ళని నేనె చూసుకోవాలి, అవును వాళ్ళు ఇంకా నా బాధ్యత, వాళ్ళు ఇంకా నా కుటుంబం అని అప్పుడే నిర్ణయించుకున్నాడు ప్రతాప్.

    

            వెంటనే వెనక్కి వెళ్ళాడు. జరిగిన విషయాన్ని మొత్తం చెప్పాడు. ఈరోజు నుంచి మీకు సుధీర్ లేని లోటు నేను తీరుస్తా అమ్మా, నన్ను మీ కొడుకు అనుకోండి అని సుధీర్ వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకుని మాటఇచ్చాడు.

  

           కొన్నాళ్ళకు నాన్నకి ఆపరేషన్ చేయించి మాములు మనిషిని చేసాడు. చెల్లి బి.టెక్ పూర్తయింది. తనకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసాడు. అమ్మకి తోడుగా మంచి కొడుకు గా మిగిలిపోయాడు ప్రతాప్.

           ఒకరోజు ప్రతాప్ కి సుధీర్ కనిపించి, నేను బ్రతికి వున్నా, ఇంత చేస్తా అని ఎప్పుడు అనుకోలేదు. నువ్వు చాలా చేసావు నా కుటుంబానికి, నా కుటుంబానికి తోడుగా వుండు అని చెప్పి తన ఆత్మ ని సంతృప్తిగా ఇప్పుడు స్వర్గానికి చేర్చాడు.

నీతి:

మనం రోడ్డు మీద వాహనం నడిపేటప్పుడు చాలా బాధ్యతగా వుండాలి. ఒక ఆక్సిడెంట్ లో పడిపోయేది మనమే కాదు. మనతో పాటు కుటుంబం కూడా రోడ్డున పడిపోతుంది.

వేగం ప్రమాదకరం. దయచేసి జాగ్రత్తలు పాటిస్తూ నడపండి.

 

          

              

     



Rate this content
Log in

Similar telugu story from Drama