upendra bandi

Comedy Drama Romance

4.5  

upendra bandi

Comedy Drama Romance

అనుకోని ప్రేమ కథ

అనుకోని ప్రేమ కథ

5 mins
317


బైక్ స్టార్ట్ చేస్తూ చిన్నా త్వరగా రా examకి లేట్ అవుతుంది అంటూ పిలిచాడు శ్రీనివాస్ రావు 

ఇంట్లో నుండి అడుగులు వేసుకుంటూ బయటకు వస్తున్నాడు ఆకాష్ ,

ఏరా hallticket pens అన్ని పెట్టుకున్నావా ? అంటూ అడిగింది తల్లి 

ఆ అమ్మ అన్ని తీసుకున్నాను వెళ్తున్న bye అన్నాడు ఆకాష్ .

శ్రీనివాస్ రావు బైక్ start చేసాడు వెనుక ఆకాష్ కూర్చుని ఉన్నాడు .

అలా వారి ప్రయాణం తమ పల్లెటూరి నుండి city లో ఉన్న examhallకు మొదలైంది .


దారి మధ్యలో .....


శ్రీనివాస్ రావు: రేయ్ చిన్న ఎక్సమ్ కి బాగా prepare అయ్యావా ?

ఆకాష్ :హ నాన్న good 

శ్రీనివాస్ రావు :అయినా ఈ కరోనా ఏంటో happyగా మీ college  లో exams రాసేవాడివి ఇప్పుడు ఇలా రోజు గంట ప్రయాణం చేసి రాయాల్సి 

వస్తుంది . మళ్లీ మీ colleges ఎప్పుడు open చేస్తారో ఏంటో .

ఆకాష్ : పర్లేదు నాన్న మీరేం బాధ పడకండి .ఏది జరిగినా మన మంచికే అంటారు కదా . 

అయినా ఇప్పుడు కాలేజీ లేదని నేనేం feel అవ్వడం లేదు మీతో కలిసి ఇంట్లో ఉంటున్నందుకు happyగా ఉంది . పైగా నా చదువుకి ఎటువంటి ఇబ్బంది లేదు .

అన్ని నేను చూసుకుంటాను నాన్న .


శ్రీనివాస్ రావు: నా ఆశ మొత్తం నీమీదనేరా కొన్ని సంవత్సరాల నుండి వ్యవసాయం నష్టం వస్తున్నా అప్పు చేసి నిన్ను చదివించాను .ఇంకా ఈ కుటుంబాన్ని నడిపే ఓపిక నాకు లేదు .


ఆకాష్ :నాన్న మీరేం కంగారు పడకండి ఇపుడు ఎలాగో నా b.tech 3-2 exams అవుతున్నాయి .next semister placements vastai కచ్చితంగా job వస్తుంది .అప్పుడు మనకు ఎటువంటి బాధలు ఉండవు మీరు relax అవ్వండి.

ఆలా మాట్లాడుకుంటూ examhall వరకు వచ్చారు .

ఆకాష్ తన pocket లో ఉన్న mobile తీసి తన తండ్రికి ఇస్తూ 

సరే నాన్న ఇక మీరు వెళ్లి బావ shop దగ్గర కూర్చోండి exam అయ్యాక నేను ఎవరిని అన్న ఫోన్ అడిగి మీకు కాల్ చేస్తా నా ఫోన్ ఇక్కడ పెట్టాలంటే అనవసరంగా money కట్టాలి .

సరే అని తండ్రి అదే సిటీ లో ఉన్న తన మేనల్లుడు mechanic shop దగ్గరకు వెళ్ళాడు.

ఇంతలో ఆకాష్ classmate manindhar అక్కడకు వచ్చాడు .ఇద్దరు కలిసి examhall లోపలకి వెళ్లారు .

ఇంతలో examhall లోపల తన 10th ఫ్రెండ్  దుర్గ అక్కడ కనిపించింది .వాళ్ళ ఇద్దరి అడుగులు దుర్గ వైపు కదిలాయి . వాళ్ళు దుర్గ ని కలిసి సరదాగా మాట్లాడుతుండగా దుర్గ పక్కన ఒక అమ్మాయి కూర్చొని ఉంది ప్రపంచంతో తనకు సంబంధం లేనట్టుగా త ppts చదువుతూ న ఫోన్ లో మునిగిపోయింది . ఏమైందో తెలియదు ఒక్కసారిగా ఆకాష్ తనని తాను మర్చిపోయినట్లుగా అనిపించింది .ఒక్క నిమిషం తరువాత తేరుకుని మళ్ళీ ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నాడు.

ఇంతలో ఆ అమ్మాయి తన వైపు చూసింది .ఆకాష్ తన face ని తిప్పుకున్నాడు ఆ అమ్మాయి ఏమనుకుంటదో అన్న భయంతో .

exam time అవుతుంది అని manindhar చెప్పగా నోటీసు బోర్డు వైపు వెళ్లారు ఆ అమ్మాయి కూడా ఆకాష్ వాళ్ళ వెనుక వస్తుంది కానీ ఆకాష్ అది గమనించలేదు .

నోటీసు బోర్డు లో తమ college కి ఇచ్చిన room number చూసుకొని ఆ రూమ్ కి వెళ్లి కూర్చున్నారు .ఇంకా 10 నిమిషాల time ఉంది .ఆకాష్ తన pocket లో ఉన్న pens and hallticket ని టేబుల్ మీద పెట్టాడు .

అలా రూమ్ చూస్తూ ఉండగా తన పక్క వరుసలో వెనుక ఇంతకు ముందు చూసిన ఆ అమ్మాయి ఉంది ,అప్పుడు అర్థం అయింది ఆకాష్ కి తాను కూడా వాళ్ళ కాలేజీ అని .

ఇంతలో question papers వచ్చాయి కానీ ఆకాష్ ఆ అమ్మాయి ని చూస్తూ ఉండిపోయాడు ,అపుడు invigilator హే బాబు question paper తీస్కో తరువాత చూడొచ్చు అమ్మాయి ని అన్నాడు.ఇంతలో తేరుకొని ఆకాష్ question paper తీసుకుని 

exam start చేసాడు ఏమి ఆలా రాస్తూ ఉండగా answers తోపాటు ఆ అమ్మాయి తన మైండ్ లో తిరుగుతుంది ,ఒక exam ఇంత కష్టంగా రాయాల్సి బాస్తుంది అని అప్పటి వరకూ ఆకాష్ కి తెలియదు .

 exam అయిపోయింది బయటకు వచ్చారు అందరు ,ఆకాష్ చుట్టూ చూసాడు ఎక్కడ ఆ అమ్మాయి కనిపించలేదు .ఎదో తెలియని చిన్న అసంతృప్తి ఆకాష్ లో నెలకొంది . సరే అనుకోని examcenter బయటకు వచ్చాడు ఆకాష్ ,బయట తన తండ్రి బైక్ ,మీద కూర్చొని ఎదురుచూస్తూ ఉన్నాడు, ఆకాష్ తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు ,

ఆకాష్ : ఏంటి నాన్న నేను phone చేస్తా అన్నానుగా ముందే వచ్చి ఎండలో wait చేయడం ఎందుకు ?

శ్రీనివాస్ రావు : పర్లేదులే ఇక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఉంటారో లేదో అని ముందే వచ్చేసా .అయినా వ్యవసాయం చేసే నాకు ఎండ ఏమిటి వాన ఏమిటి .మీలా తరగతి గదుల్లో ఫ్యాన్ కింద కూర్చోడం అనుకున్నావా అన్నాడు నవ్వుతూ .

ఆకాష్ :హాహా ! సరే నాన్న పద వెళ్దాం .

శ్రీనివాస్ రావు ఇదిగో నీ phone తీసుకో అంటూ ఆకాష్ కి phone ఇచ్చాడు .

ఆకాష్ ఫోన్ తీసుకొని బైక్ ఎక్కాడు .

ఆలా వెళ్తూ 

ఏరా time 1:30 అయింది మనం వెళ్లేసరికి ఇంకో గంట పైనే పడుతుంది పైగా ఎండ ఎక్కువగా ఉంది ఎమన్నా తింటావా అన్నాడు శ్రీనివాస్ రావు .

ఆకాష్ కి అప్పటికే ఆకలి చంపేస్తుంది కానీ ఆరోజు ఉదయం పెట్రోల్ కి money లేక పక్క ఇంటి uncle ని అప్పు అడగడం చూసాడు ఆకాష్ ,బయట తింటే ఇద్దరికీ అదొక ఖర్చు అనుకొని 

వద్దు నాన్న అసలే కరోనా time ఎందుకు లే risk అన్నాడు .

పర్లేదు రా ఖర్చు గురించి ఆలోచించకు నిన్ను ఒక్కసారి కూడా ఆ బిర్యానీ దొరికే హోటల్ కి తీసుకువెళ్ళలేదు అంటావుగా ఇప్పుడు వెళ్దాం అన్నాడు .

అయ్యో నాన్న అది బిర్యానీ దొరికే హోటల్ కాదు restaurent అంటారు అన్నాడు ఆకాష్ . 

ఎదో ఒకటి లేరా వెళ్దాం అన్నాడు .

లేదు నాన్న కరోనా అనే కదా మీరు నన్ను బస్సు లో వెళ్లనివ్వకుండా ఇలా బైక్ మీద దింపుతున్నారు మల్లి బయట food అంటారు ఏంటి,ఎం వద్దు ఇంటికి పోనివ్వండి అన్నాడు ఆకాష్ .

సరే అని శ్రీనివాస్ రావు ఇంటి వైపు బైక్ తిప్పాడు .

ఆలా ఆ ప్రయాణంలో 

విపరీతమైన ఎండ,ఉదయం ఎప్పుడో తిన్నాడు ఆకాష్ కానీ 

ఇవేమి ఆకాష్ mind లో లేవు అంత ఎండలో కూడా తన mind లో ఆ అమ్మాయి తిరుగుతుంది .

అసలు ఎవరు ఈ అమ్మాయి ?

ఎందుకు నాకు ఇంతలా గుర్తొస్తుంది ?

నేనేమన్నా thanaki atrract అయ్యానా ?

ఇప్పటి వరకు చాల మంది అమ్మాయిలను చూసాను చాల మంది అమ్మాయిలు నాకు friends ఉన్నారు వాళ్ళు ఎవ్వరు నాకు ఇంతలా గుర్తు రాలేదు కదా తాను మాత్రం ఎందుకు పదే పదే గుర్తొస్తుంది ?

అసలు ఇంతకి ఆ అమ్మాయి పేరు ఏంటి ?

ఇలా ఆకాష్ తనని తాను ప్రశ్నించుకుంటున్నాడు .

అలా కొంత సమయం తరువాత ఇల్లు చేరుకున్నారు ఆ తండ్రి కొడుకులు .

ఆ వచ్చేసారా మీకోసమే ఎదురు చూస్తున్న కాళ్ళు చేతులు కడుక్కొని రండి అన్నం వడ్డిస్తాను అంది ఆకాష్ వాళ్ళ అమ్మ 

ఇద్దరు అన్నం మీద కూర్చున్నారు ,

ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ నెమ్మదిగా తినే ఆకాష్ ఈరోజు ఎం మాట్లాడకుండా త్వరత్వరగా తినడం చూసి ఆకాష్ వాళ్ళ అమ్మ నాన్న ఆశ్చర్యపోయారు .

exam రాసి బాగా అలసిపోయాడేమో అందుకే బాగా ఆకలిగా ఉన్నాడు పైగా time 3:00pm అయింది అనుకున్నారు అమ్మ నాన్న .

కానీ ఆకాష్ కి తాను ఏం తింటున్నాడో కూడా పట్టించుకోనంతగా ఆ అమ్మాయి ఆలోచనల్లో మునిగిపోయాడు .

అన్నం తినేసి పడుకుందాం అని మంచం మీద అలా తల వాల్చాడు .

కానీ రోజు sleeping టాబ్లెట్స్ veskunna వాళ్ళ కన్నా ఎక్కువగా నిద్రపోయే ఆకాష్ కి ఆరోజు నిద్ర పట్టడం లేదు .

ఆ అమ్మాయి ని మల్లి చూడాలన్న కోరిక మొదలైంది .కానీ ఎలా తాను ఎవరో ఏంటో ఎలా మాట్లాడుతుందో ?ఒకవేళ ధైర్యం చేసి ,మాట్లాడిన తప్పుగా తీసుకుంటుందో ? అసలు next exam రోజు కనిపిస్తుందో లేదో ?

ఆకాష్ mind మొత్తం ఇవే ఆలోచనలు .

ఇంతలో ఆకాష్ అమ్మ వచ్చి ఏరా చిన్నా రోజు కుంభకర్ణుడిలా నిద్ర పోయేవాడివి ఈరోజు ఏంటి ఎదో ఆలోచిస్తున్నావు అంది ?

ఏం లేదు అమ్మ ఊరికే నిద్ర రావడం లేదు అన్నాడు .

పర్లేదు చిన్నా చెప్పు exam బాగా రాయలేదా మాకు చెప్పడానికి భయపడుతున్నావా ? అంది .

లేదు అమ్మ exam సూపర్ గా రాసా అలాంటిది ఏం లేదు అన్నాడు ఆకాష్ .

నీ మీదనేరా మా ఆశ మొత్తం ,మీ నాన్న కొన్ని సంవత్సరాల నుండి నీ హాస్టల్ ఫీజులు కట్టలేక ,ఇల్లు నడపలేక ,నా మందుల ఖర్చు పెట్టుకోలేక ,నీకు చెప్తే బాధపడతావు అని నీకు చెప్పకుండా అని ఎలాగోలా అప్పు తెచ్చి నిన్ను చదివిస్తున్నాడు 

ఎలాగోలా నువ్వు job తెచ్చుకొని మన కుటుంబాన్ని ఒడ్డుకు తీసుకురావాలి ,సరే పడుకో అని చెప్పి room లో నుండి వెళ్లిపోయింది .

ఒక్కసారిగా ఆకాష్ మనసు బరువెక్కినట్లుగా అనిపించింది .

అవును అమ్మ చెప్పింది correct మా కుటుంబాన్ని నేనే చూసుకోవాలి ఎలాగైనా కస్టపడి job తెచ్చుకోవాలి ముందు ఈ exams బాగా రాయాలి అనుకొని next exam ppts ఓపెన్ చేసి పక్కనే తన bag నుండి rough book and pen తీస్కొని చదవడం start చేసాడు .

కానీ మల్లి ఆకాష్ mind ఆ అమ్మాయి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది .

అప్పటిదాకా చదువు తప్ప వేరే ఆలోచన రాని ఆకాష్ కి ఏం అర్థం కాలేదు చదవాలి అని ఎంత ప్రయత్నించినా తన వల్ల కావట్లేదు.

తన కుటుంబానికి అండగా ఉండబోయే ఆకాష్ జీవితంలోకి ఈ అమ్మాయి రావడం తన జీవితాన్ని మార్చబోతుందా ?

అసలు ఆ అమ్మాయి మల్లి ఆకాష్ ని కలుస్తుందా ?

అసలు ఆకాష్ ఈ exams బాగా రాస్తాడా ?లేదా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ time waste చేస్తాడా ?

ఒకవేళ ఆకాష్ exams బాగా రాయలేకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి ?

ఆకాష్ వాళ్ళ అమ్మ నాన్న ఆకాష్ మీద పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయా ?

దీనికి సమాధానం కాలమే నిర్ణయించాలి .


Rate this content
Log in

Similar telugu story from Comedy