Ambica Lakshmi

Drama Classics Inspirational

4.5  

Ambica Lakshmi

Drama Classics Inspirational

అందుకనే మాట వినాలి

అందుకనే మాట వినాలి

4 mins
672


ఒక్క చేతిలో పేపర్ పట్టుకొని మరొక చేతిలో చీర కొంగును అటు ఇటు తిప్పుతూ నోటితో విజిల్ వేస్తూ మిస్ ఇండియా రాంప్ వాక్ చేస్తునట్టు నడుచుకుంటూ ఒక్క కన్ను బొమ్మ ఎగరవేస్తు వస్తున్న అముల్యాని ....!!!!!!!


ఎంటోయి చాలా హుషారుగా ఉన్నావు ఎంటి సంగతి..ఆశ్చర్యంగా అడిగాడు అమూల్య భర్త సత్య..


ఇన్ని సంవత్సరాల నా కల చిట్ట చివరకు నెరవేరింది .....

కొన్ని వందల అప్లికేషన్స్ పెడితే రెండు సంవత్సరాల తరవాత నాకు జాబ్ వచ్చింది.... ఇది ఎమిటో తెలుసా నాకు కాల్ లెటర్.........సంతోషంగా చెప్పింది అమూల్య


కానీ నీకు కొంచం హెల్త్ ప్రాబ్లెమ్ ఉంది కదా ఈ టైమ్ లో జాబ్ చెయ్యడం అంత మంచిది అంటావా????

హెల్త్ ప్రాబ్లెమ్ ఏం ఉంది లే కాస్త నీరసంగా ఉంటుంది అంతే కదా పనిలో పడితే కొంచం నాకు కాస్త రిలీఫ్ గా ఉంటుంది అంతే కాకుండా ఇంట్లో ఉండి ఉండి నాకు బాగా బోర్ గా కూడా ఉంటుంది జాబ్ చేస్తే ఇవి అన్ని మర్చిపోవచ్చు...........


సరే కానీ ఇంతకీ ఎం జాబ్ ఎంటి????

నేను బైపిసి కదా కాబట్టి ఫార్మా కంపెనిలో జాబ్ వచ్చింది...


ఫార్మా కంపెనీ ఆ????

నీకు అసలు నీరసంగా ఉంటుంది అందులో ఫార్మా కంపెనీ అంటే అక్కడ మెడిసిన్స్ వల్ల నీ ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది ఒక్క సారి నా మాట విను ....

నీకు హెల్త్ ఒకసారి నార్మల్ అయితే అప్పుడు హ్యాపీగా మళ్లీ ట్రై చేసుకుందువు సరే నా.....

అక్కడి గాసేస్ వల్ల లేని రోగాలు వస్తాయి ఇవి మనకి అవసరమా చెప్పు హ్యాపీగా ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా......


ఎంటి నాకు జాబ్ వచ్చింది మీకు బాధ వస్తుందా ......లేకపోతే నిజంగానే నా మీద ప్రేమా?????

నీకు జాబ్ వస్తె నాకు బాధ ఎం ఉంటాది చెప్పు ఇంటి కర్చులు కూడా కలిసివస్తాయి అయిన నేనే కదా రెండు సంవత్సరాల ముందు నిన్ను జాబ్కి అప్లయ్ చెయ్యమని చెప్పింది.... మరి నీకు జాబ్ వస్తె నాకే కదా హాపీ....

సరే ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నాకు ఏ ప్రాబ్లెమ్ లేదు .......


అమూల్య బ్లైండ్ గా ఫిక్స్ అయిపోవడంతో భర్త అంతలా చెప్పిన వినకుండా జాబ్ లో జాయిన్ అయిపోయింది....

వెళ్ళిన కొన్ని రోజులు చాలా సరదాగా గడిపేస్తుంది ఒక పది రోజులు సంతోషంగా వెళ్లి వచ్చేసింది ఆ తరవాత నుంచి కొంచం బెట్టు చూపిస్తు వెళ్తుంది ఆల్మోస్ట్ నెల అయ్యేసరికి ఇంక చిరాకు ముదిరిపోయింది ఒక్క వైపు నీరసం మరొక వైపు వర్క్ ప్రెషర్ భర్తకు చెప్పుధము అంటే తిడతాడు అని భయం ఏమీ చెయ్యలేని పరిస్తితిలో అలా వెళ్తూ ఉండేది........


నెల అయింది చేతికి సాలరీ వచ్చింది.....

ఏవండీ నా ఫస్ట్ సాలరీ ఈరోజు బయటకు వెళ్లి డిన్నర్ చేద్దామా నేనే పే చేస్తాను ....ప్లీజ్.....

ఓకే అయితే నాకు సాలరీ వచ్చేసింది కాబట్టి ముందు మూవీకి వెళ్లి ఆ తరవాత డిన్నర్ కి వెళ్దాము నడు....

అని చెప్పి అముల్యాకి దెయ్యం మూవీస్ అంటే చాలా భయం అలా అని తెలిసి కూడా లైట్స్ ఔట్ అనే హారర్ మూవీ కి తీసుకోని వెళ్ళాతాడు........

మామూలు మూవీ అనుకొని వెళ్ళిపోతాది తరవాత మూవీ చూస్తున్నంత సేపు భర్తను పికుకొని తినేసింది....

ఆ తరవాత డిన్నేర్ చేస్తునంత సేపు కూడా భర్తను దెప్పుతూనే ఉంది....సత్య మనసులో భార్యకు ఇష్టం లేని పని చేస్తే తరవాత జీవితం మొత్తం ఆ పని కోసం దెప్పుతునే ఉంటారు...కర్మ కర్మ అని అనుకుంటాడు...

ఎంత బాధ పెట్టిన భయ పెట్టిన సరే భర్త భార్య కలయిక ఈ ప్రపంచానికే ఆదర్శం ఆధారం కూడా.....


ఆ తరవాత రోజు ఉదయం రోజులానే సత్య ఆముల్యని తన కంపనీ దగ్గర డ్రాప్ చేసి సత్య తన కంపెనీ కి వెళ్ళిపోయాడు....

కంపెనీ కి వెళ్లి తన సీట్లో కూర్చున్న వెంటనే ఒక్క ప్రైవేట్ నంబర్ నుంచి కాల్ వచ్చింది....

ఎవరా..???అని అనుమానంగా లిఫ్ట్ చేశాడు

హెల్లొ.....????

సర్ మీరు అమూల్య హస్బెండ్ రైట్????

ఎస్ సర్ మీరు???

సర్ మేడం ఇప్పుడే కళ్ళు తిరిగి పడిపోయారు..

దగ్గరలో ఉన్న కిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ చేసాము సో మీరు ఒక్కసారి రండి అని చెప్పి కాల్ కట్ చేసేశాడు...


వెంటనే బండి తాళాలు తీసుకోని ఫాస్ట్ గా హాస్పిటల్ కి వెళ్ళాడు తీరా వెళ్లి చూస్తే అమూల్య బెడ్ మీద పడుకుని ఉంది..దగ్గరకి వెళ్లి ఎలా ఉంది బాగానే ఉందా?????

హా బాగానే ఉంది ఎందుకు కళ్ళు తిరిగాయి అనేది అర్థం కాలేదు....సరే నేను వెళ్లి డాక్టరుతో మాట్లాడి వస్తాను నువ్వు రెస్ట్ తీసుకో.....


సర్ మీ వైఫ్ చాలా వీక్ గా ఉన్నారు అది ఫార్మా కంపెనీ లో జాబ్ చెయ్యడం వల్ల ఆమె ఇంకా నిరాసడిపోయారు బ్లడ్ ఫోర్ పాయింట్స్ కు వచ్చేసింది ఆమె రికవరీ అవ్వాలి అంటే సుమారు రెండు నెలలు పట్టవచ్చు అంతే కాకుండా మీ వైఫ్ కి విటమిన్ డెఫషియన్సీ కూడా ఉంది సో కొంచం బాగా కేర్ తీసుకోండి......

విని సరే సర్ ఇదిగో మీ ఫీస్...

మీ వైఫ్ ని రెండు రోజులు అబ్జర్వేషన్ లో ఉంచాలి ...

ఓకే డాక్టర్ అని చెప్పు తన వైఫ్ దగ్గరకు వెళ్లిపోయాడు....


అంతా బాగానే ఉంది కానీ నిన్ను రెండు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు సో నువ్వు జాబ్ క్విట్ చెయ్యాలి .....

అయిన అంతా నా తప్పే మీరు చెప్పిన వినకుండా జాబ్ జాబ్ అని మీ ప్రాణాలు తీశాను నన్ను క్షమించండి ...

పరవాలేదు నువ్వు కూడా తప్పు ఏమీ చెయ్యలేదు నాకు సహాయం చెయ్యాలి అని అనుకున్నావు కాకపోతే ఇలా అయింది అంతే లే.......

కంపనీ వాళ్ళు కూడా అమూల్య రికవరీ అయినంత వరకు సెలవలు ఇచ్చారు...

నీకు మొత్తం తగ్గిన తరవాత మళ్లీ కంపనీ లో జాయిన్ అవుదువు సరే నా...... అప్పుడు నీకు కాస్త రిలీఫ్ గా ఉంటాది అని చెప్పి......


అది నేను నీకొక విషయం చెప్పాలి అది.....

అటు ఇటు తిరుగుతూ చేతిలో ఒక కవర్ పట్టుకొని మరొక చేతిలోని వేళ్ళను తడుముతూ ....

ఎంటి విషయం ఏదో చెప్పాలి అనుకుంటున్నారు కదా చెప్పేయండి....

అది ఈ కవర్ లో టికెట్ ఉంది పుణె వెళ్ళడానికి...

నీకు తెలుసుగా నా ఫ్రెండ్ సురేష్ వాడు నాకు చెప్పకుండా టికెట్స్ బుక్ చేసేశాడు ఇప్పుడు వెళ్లకపోతే బాగోదు నువ్వు మీ అమ్మని ఇక్కడికి రమ్మను రేపు వెళ్తున్నా ఒక్క టూ డేస్ లో వచ్చేస్తా...

వెళ్ళడం ఎం తప్పు లేదు కానీ మీకు ప్రాజెక్ట్ ఇస్తారు ఒక టూ డేస్ లో అని చెప్పారు కదా.....

ఎం ఇచ్చేలా కనిపించడం లేదు అందుకనే...

ఎందుకు రిస్క్ చెప్పండి అదే పోస్ట్ పోన్ చేసుకోండి గొడవ ఉండదు కదా మీరు లేకపోతే మీ ప్రాజెక్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు .....



ఎం కాదు లే వెళ్లి వచ్చేస్తాను టూ డేస్ లో సో ప్రాబ్లెమ్ ఎం ఉండదు....అని చెప్పి వెళ్ళడానికి రెఢీ అయిపోయాడు వెళ్లిపోయాడు కూడా.....


వెళ్ళిన మరుసటి రోజునే తెలిసింది ఏమిటంటే ప్రాజెక్ట్ ఇచ్చేశారు అని...సత్య లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ను వేరే వారికి ఇచ్చేయడం జరిగింది....

ఇంటికి వచ్చిన తరువాత అమూల్య .....

భర్తను గుర్రును చూస్తూ ఏమీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఒక్క టూ డేస్ పోస్ట్ పోన్ చేసుకోమని అలా చేసుకొని ఉంటే కనక మీకు ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ గా ఇచ్చేదురు ......

నువ్వు చెప్పింది నిజమే నీ మాట విని ఉంటే ఈ బాధ లేకుండా పోధును....

అవును నేను మీ మాట కనక విని ఉంటే హాస్పిటల్ లో చేరవలసిన అవసరం లేకుండా ఉందును...


అప్పటినుంచి ఒక్కరి మాట ఒక్కరూ వినడం మొదలు పెట్టారు బాధగా ఉన్నా సరే బంధం కోసం బంధుత్వం కోసం ఏనాడు కూడా ఒక్కరి మాట ఒక్కరూ తప్పకుండా వినేవారు...అప్పటినుంచి ఇద్దరు సంతోషంగా జీవించడం మొదలు పెట్టారు....ముందుకన్నా ఎక్కువగా...


మీకు కనక కథ నచ్చినటు అయితే మీ సందేశాలను కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు




Rate this content
Log in

Similar telugu story from Drama