Dr.R.N.SHEELA KUMAR

Drama

4.4  

Dr.R.N.SHEELA KUMAR

Drama

ఆషాడ విశిష్టత

ఆషాడ విశిష్టత

3 mins
237


జోత్స్నా అమ్మ జానకి కూరగాయలు కొంటూ అమ్మిన ఆమెతో గోరింటాకు ఎక్కడైనా ఉంటే పట్టుకురా కావేరి అని చెప్పింది. వెంటనే కావేరి ఏంటమ్మా విశేషం మీ కాలనీ లో ఉండే చాలామంది అడిగారు అని అన్నది. అలాగా ఎవరదిగారని ఆత్రుతతో అడిగింది జానకి. వెంటనే భర్త శంకర్ ఇంకెవరు మీ పల్లెటూర్ల నుండి వచ్చే వనితలు ఉన్నారు కద వాళ్లే అడుగుంటారు అని ఎగతాళి చేసాడు. అది విన్న జానకి అత్తగారు సుబ్బలక్ష్మి, బడుద్దాయ్ నీకేమి తెలుసు ఆషాడం లో గోరింటాకుకివిశిష్టత ఉంది. పెళ్లయ్యిన ప్రతి ఆడబిడ్డ మొదటి సంవత్సరం అమ్మగారింటికి వచ్చి స్నేహితులతో కలసిమెలసి పాత రోజులు గుర్తు చేసుకుంటూ గోరింటాకు పెట్టుకుంటారు. తమ భర్తల మీద ఉండే ప్రేమకు నిదర్శనంగా చెపుతారు.ఎవరి చెయ్యి ఎర్రగా పండుతుందో వాళ్ళ భర్త మీద ప్రేమ ఎక్కువ అని అంటారు.

వెంటనే శంకర్ అయితే మన పట్టణం లో ఉండే వాళ్ళకే ప్రేమ ఎక్కువ అమ్మ ఆ కోన్ వేసుకుంటారు గంటలో ఎంత ఎర్రగా పండుతుంది ఆ డిజైన్ లు చూడడానికి అందంగా ఉంటాయి అన్నాడు.

వెంటనే జానకి జోత్స్నా ను కూడా పిలచి గోరింటాకు రుబ్బి పెట్టుకోవటం వలన మన ఒంటిలో ఉండే వీడిని తగ్గిస్తుంది, క్రిమి సంహారిని. కోన్ గోరింటాకు మూడు రోజులలో వెలిసిపోతుంది కానీ ఆకు రుబ్బయినది పెట్టుకుంటే ఒక నెల వరకు ఉంటుంది. అ వాసనయే వేరు అని చెప్పింది. అత్తగారికి చాలా సంతోషంగా ఆవిడకి చిన్న వయసు జ్ఞాపకం వచ్చింది రెండు చేతులు కళ్ళకు గోరింట పెట్టి అమ్మ అందరికి నోటిలో బువ్వ పెట్టేది ఒకే చోట కుర్చీలలో వరుసగా కూర్చో పెట్టి కధలు చెప్పేది. చిన్నాన్న పెదనాన్న పిల్లలందరూ చావడిలో కూర్చొని ముచ్చటించు కుంటాము. ఆ గోరింటాకు కడిగిన చేయి లో తెల్లటి పెరుగన్నం ముద్ద ఆ ఎర్రటి చేయిలో ఆహా చూడటానికే కన్నులకు ఎంత ముచ్చటగా ఉంటుందో అని కంటి తడి తో మానవరాలికి చెపుతున్న ఏడుస్తూ ఉండే అత్తగారిని జానకి అత్తయ్య ఏంటిది ఇప్పుడు మీరు ఇలా ఏడవటం ఎందుకు ఊరికి వెళ్లాలని వుందా చెప్పండి మనం వెళ్లి మీ స్నేహితులనందరిని చూసి వద్దాం అని అన్న వెంటనే ఆ ముఖంలో ఓ ఆనందం. జోత్స్నా ఏంటీ అమ్మమ్మ తాతయ్య కు తెలియకుండా ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు మీ ఉతిలో అని అడిగిన వెంటనే తాతయ్య రాములు అవును బుజ్జి అక్కడ మీ నానామ్మకు బోలెడు ఫ్రెండ్స్ అక్కడకి నేను వెళితే నన్ను చూడడానికి ఓ 50మంది వస్తారు. అందులోని సుమతి అని నన్ను చూసి కన్ను కొడుతుంది అని మొదలు పెట్టారు. వెంటనే శంకర్ నాన్న చిన్నపిల్లదగ్గర ఏంటీ ఈ మాటలు. అని ఆపాడు. వెంటనే జోత్స్నా నానమ్మతో మనం ఊరికి వెళదాం అని బయలుదేరారు. సుబ్బలక్ష్మి చాలా సంతోషంగా ఊరికి వచ్చింది

తెల్లవారుజామున శ్రీధర్ తో వాళ్ళావిడ మంగ ఏమండోయ్ మీ ఫ్రెండ్ వచ్చింది ఇదిగో తనకిష్టమని చేగోడీలు చేశాను తీసుకొని వీళ్ళండి అన్నది. శ్రీధర్ మంగని కౌగలిస్టు ఇన్నేళ్ళైనా నువ్వు మరిచిపోలేదే అని నవ్వుతూ బుగ్గ గిల్లి అ చేగోడీలు తీసుకొని నువ్వు రావా అని అడిగాడు. మీరు వెళ్ళండి ఇంటి పని పూర్తి చేసుకొని వస్తాను అని చెప్పింది. శ్రీధర్ సుబ్బు అని పిలుస్తూ తలుపు తీసాడు అంతే జోత్స్నా వచ్చి నాన్నమ్మ నీకోసం ఎవరో వచ్చారు అని చెప్పింది అంతే చుసిన వెంటనే శ్రీధర్ ఎలా ఉన్నారు మంగను తీసుకురాలేదా అని అడిగింది. ఇంటి పని పూర్తి చేసుకొని వస్థానని చెప్పింది. అంటూ జానకి అని పిలిచిన వెంటనే కాఫీ కప్పుతో ఎలావున్నారు మావయ్య అంటూ వచ్చింది. బావున్నానమ్మ శంకర్ రాలేదా అని అడిగి చేతులో ఉన్న చెగోడిలు ఇచ్చాడు ఇవి నాకు కాదుకదా మావయ్య మీ ఫ్రెండ్ కి కదా అని నవ్వింది. ఈ లోపు మంగ వచ్చి సుబ్బు ని కౌగలించు కొని ఎన్నేళ్లు అయ్యింది నిన్ను చూసి అంటూ జానకి నువ్వు వండకు నేను వండేశాను మా ఇంటిలోనే భోజనాలు సరే సుబ్బు రా బయటకు వెళదాం అని పిలుస్తూ ఏవండీ రండి అంటూ శ్రీధర్ ను కూడా నది ఒడ్డుకు తీసుకొని వెళ్ళింది గంట సేపు మౌనంగ ఉండి సరే వెళదామా అంటూ ముగ్గురు బయలుదేరి ఇంటికి వచ్చేరు. అందరు భోజనాలు చేసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. మరుసటి రోజు అందరు కలిసి సినిమా కు వెళ్లారు.. పాత రోజులు జ్ఞాపకాల తో అందరు వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్లిపోయారు

సుబ్బు మంగ తో ఆ రోజు రాత్రి శ్రీధర్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా. అని అడిగిన వెంటనే మంగ ఐదుగురి పిల్లల తల్లినే నేను ఇప్పుడిలా అడుగుతున్నావు. అని నవ్వింది. సరేలే నువ్వు బాధపడకు అందరమూ బాగున్నాము అప్పుడప్పుడు వస్తూ ఉండు సరేనా అని సర్ది చెప్పి మంగ ఇంటికి వెళుతు రేపే ప్రయాణమా అని అడిగింది అవును తెల్లవారే వెళ్లిపోతాం చెప్పి శ్రీధర్ తో అని అన్నది తెల్లవారి కోడి కుయకముందే బయలుదేరి వచ్చేసారు. పట్టణ వాసం మళ్లి ప్రారంభం.



Rate this content
Log in

Similar telugu story from Drama