శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

4.1  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

25.కొత్త వసంతం

25.కొత్త వసంతం

2 mins
589



   కొత్త ప్రారంభానికి పాత ముగింపు ఇచ్చుకోక తప్పదేమో...? మనసులో ఎన్నోసార్లు అనుకుంది భూమిక.

పెళ్లీడుకొచ్చిన శ్రీజకు ఎన్ని సంబంధాలు చూస్తున్నా...ఒక్క విషయంలో మాత్రం నచ్చక వెళ్లిపోతున్నారు...


  ఆనాడు తను చేసిన పనిలో ఎంత పొరపాటయ్యిందో ...ఇప్పుడర్థమవుతుంది భూమికకు.

   

  ఇరవై ఏళ్ల క్రితం...ఆకాష్ ని ఆఖరిసారిగా కలిసి మాట్లాడుకున్న సంఘటన లీలగా గుర్తుకొస్తుంది....


    పెళ్ళైన కొత్తలోనే భూమిక నెలతప్పడం....నెల తప్పిన కొద్దిరోజులకే వారిద్దరి మధ్యా వివాదాలు తలెత్తడంతో... ఎవరికి వాళ్ళు విడిగా ఉన్నారు. కలిసి బ్రతుకుతామని చేసుకున్న పెళ్ళినాటి ప్రమాణాలని తుడిపేసుకోవాలను కంటున్నా.... వారిద్దరి మధ్యా జన్మించిన పాప కోసమైనా కలిసివుండమని ఇరువైపుపెద్దలూ అదేపనిగా చెప్పడంతో...ఒకసారి ఇద్దరూ మనసువిప్పి మాట్లాడుకుందామని ...   రామకృష్ణా బీచ్ లో కలుసుకున్నారిద్దరూ.


  ఇద్దరిమధ్యా నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ...

   

  "నువ్వు...ఆ ఉద్యోగం మానేసి ఇక్కడికి వచ్చేస్తే పాపతో పాటూ ఇక్కడే హాయిగా ఉండొచ్చు కదా ."...ఎప్పటిలాగే భార్య భూమికతో చెప్పాడు ఆకాష్. 

    

   ఎన్ని రోజులు గడిచినా...భర్త మాట అదే కావడంతో...భూమిక కూడా బెట్టుచేయక మానలేదు. 

   

   "పెళ్లప్పుడు ..మీకు ఏదో కంప్యూటర్ సెంటర్ వుందని చెప్తే...హైదరాబాద్ లో జాబ్ మానేసినా.. మన కంపెనీ లో జాయిన్ అవ్వచ్చు కదా అనుకున్నా. కానీ అది అమెరికా లోని మీ అన్నయ్య కంపెనీ అనీ,అందులో మీకు ఇచ్చే జీతం పదివేలని తెలిసాకా....నాకు హైదరాబాదులో యాభై వేలు జీతం వచ్చే జాబ్ ని మానేసుకుని ఇక్కడికి రావడంలో అర్థం లేదనిపించింది. మీరు మీ తల్లిదండ్రుల్ని కనిపెట్టుకుని ఉండటం కోసం,మీ అన్నయ్య వాళ్ళ కంపెనీని దగ్గర వుండి మేనేజ్ చేయడం కోసం మిమ్మల్ని పావుగా ఉపయోగించుకుంటున్నారంతే. పాపతో ఒంటరిగా అయినా...నేను జీవితంలో గెలుచుకురాగలనన్న నమ్మకం నాకుంది. ఎప్పటికైనా మీరు హైదరాబాద్ వచ్చి చిన్న ఉద్యోగమైనా చేసి మీ కాళ్ళమీద మీరు నిలబడండి" చివరిసారిగా మందలించింది భర్త ఆకాష్ ని.

    

   సెకన్లు నిషాలుగానూ...నిమిషాలు గంటలు గానూ మారిపోతున్నాయి....

    

   ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కెరటాల్లా వున్నాయి వారి మనసులు. ఎవరి పంతంలో వాళ్ళు నిండా మునిగిపోయి వున్నారు.

    

   అలా ఆ ఒక్క రోజుతో అయిపోలేదు.సంవత్సరాలు గడిచి..పాప కాలేజీ చదులకు వచ్చేసింది. రబ్బరు బ్యాండ్ లా పంతాన్ని ఎవరిమట్టుకు వారే సాగదీస్తున్నారు. ఎటూ తెగడం లేదు. ఎవరో ఒకరు వదిలితేనే...ముగ్గురూ ఏకమయ్యేది.


   అందుకే...కూతురు శ్రీజ కోసమైనా...ఇరవైయేళ్లుగా ఇద్దరిమధ్యా స్థంభించిపోయిన నిశ్శబ్దగోడను ఇప్పుడు చేధించాలనుకుంది. 


   పెళ్లీడుకొచ్చిన కూతురుకు తండ్రి దూరమవ్వడంతో సంబంధాలు కుదరటం కష్టంగానే వుంది.ఇప్పటివరకు చదువుకున్నాననే అహంతో...తన కాళ్ళమీద తాను నిలపడి ఎంతో డబ్బు సంపాదించినా గానీ...మగ దిక్కు లేకుండా బతకడం ఎంత నరకమో ఇన్నాళ్లుగా బాగా అర్థం అయింది.

   

    భూమిక తన భర్త కోరికమేర ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి....కూతురు భవిష్యత్తే ధ్యేయంగా తన భర్త దగ్గరకు ప్రయాణం అయింది. భార్య భూమికని మనస్ఫూర్తిగా స్వీకరించి...కూతురును ఆప్యాయంగా తల నిమిరాడు ఆకాష్. 

     

   ఇద్దరూ ఏకమైన కొద్ది రోజులకే కూతురు శ్రీజకు  మంచి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది .బాహాటంగా పెళ్లి చేశారు.పార్వతీ పరమేశ్వరుల్లా ఆ కొత్త దంపతులను దీవిస్తుంటే...ఇద్దరి కళ్ళలోనూ ఆనంద భాష్పాలు.

    

   ఇన్నాళ్లూ... ఎవరి పంతాలతో వాళ్ళు భారంగా జీవించడం వల్ల ఎన్ని వసంతాలు కోల్పోయారో ఇప్పుడర్ధమైంది వారికి.

   

    "అహాన్నివీడిన రెండు ప్రాశ్చాతాప హృదయాలు పరస్పరం క్షమాకుసుమాలతో అభిషేకించుకున్నాయి.


   ఆకాష్ తన తప్పును అంగీకరిస్తూ....

    

   "నువ్వు ఆనాటి నుంచీ మంచి ఉద్యోగంలో ఉండి బాగా సంపాదించబట్టే...మన కూతురుకి ఇంతమంచి సంబంధంతో ...ఆర్భాటంగా పెళ్లి చేయగలిగాము. లేదంటే...ఆర్థిక ఇబ్బందుల్లో పడేవాళ్ళం. ఇకనైనా.. కొత్తప్రారంభానికి పాతముగింపు ఇద్దాం" అనుకున్నారు. 

    

    మనస్పర్థలు పోయి...ఆకాష్ భూమికలు  కొత్త వసంతంలోకి అడుగు పెట్టారు..!!*


      ***          ***           ***




   






   

  


Rate this content
Log in

Similar telugu story from Drama