శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

3.5  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

2.ఆగదీ ప్రయాణం

2.ఆగదీ ప్రయాణం

2 mins
677         


    మొదటి ప్రయాణం అంటే మాటలు కాదు. జీవితం లో మరుపురాని అనుభూతిగా మిగిలిపోవాలి.


    తన వెంట పుట్టింటి వారిచ్చిన సారెతో ...పెళ్ళైన ప్రతి ఆడపిల్లా... భర్తతో కలిసి అత్తింటికెళ్లడమే మొదటి ప్రయాణం.

     

    ఆ ప్రయాణం ఎంతో సాఫీగా సాగుతుందనీ... తన భర్తతో వేసే ప్రతీ అడుగూ...పూల బాటేనని ఎన్నో కలలుగంది భూమిక.

     

   సిగ్గు దొంతర్ల మధ్య...అత్త గారింట్లో కాలు పెట్టింది .


    తనకు ఆకాష్ తో పెళ్లి కుదిరినప్పుడే తెలిసింది. అత్తగారు చాలా గయ్యాళి మనిషని. ఆఇంట్లో ఎలా గెలుచుకు రావాలో ఏంటోనని...కొంచెం భయం పట్టుకున్నా... జీవితాంతం తనకు తోడుండే భర్త సహచర్యంలో గెలుచుకు రాగలననే ధీమాతో ...తీయగానే ఊహించుకుంది భూమిక. 


    కాపురానికొచ్చిన కొత్తలోనే...అత్తగారింట్లో కలివిడిగా కలిసిపోయింది. అత్తగారు పిలవడమే తరువాయి...ఎదుట ప్రత్యక్షమయ్యేది. పల్లెటూరులో పుట్టి పెరిగిందేమో... అత్తగారు చెప్పే ప్రతిపనినీ క్షణాల్లో చక్కబెట్టేసేది. అందుకేనేమో....అత్తగారితో ఆమె ఎలాంటి మాటా పడలేదు. ఇద్దరూ అన్యోన్యంగా ఉండటం ....చూసేవారికి వింతగానే ఉంది. 


   భూమిక అత్తగారి మనసును గెలవడానికి ఎంతో కాలం పట్టలేదు. మావగారు కూడా కోడలి వంటా వార్పులంటే రుచి మరిగారు. సరైన కోడల్ని తెచ్చుకున్నందుకు ఎంతో సంతోషించారు. 


   భూమికకు అత్త మామలతో...తనకు ఎలాంటి ఇబ్బందీ లేదు.

   ఇబ్బందల్లా...భర్త ఆకాష్ తోనే. 

   

   పెళ్లై మూడు నెలలైనా....వారి మధ్య ఉండాల్సిన సంబంధం దగ్గరవ్వలేదు. దగ్గరకు చేరినప్పుడల్లా...భర్త ఎడంగా పడుకోవడం భూమిక సహనాన్ని పరీక్షిస్తున్నట్టుగా ఉంది.


   తానెన్ని కలలు కంది...? చిలకా గోరింకల్లా కాపురం చేస్తూ...సంతోషంగా గడపాలని. ఆ కలలన్నీ కూలిపోయినట్టేనా...? లేదు...అలా కాకూడదు. సిగ్గు విడిచైనా నేనే చొరవతీసుకోవాలి...ప్రేమతో తానే భర్తకు దగ్గరవ్వాలనుకుంది భూమిక.


    అది అమావాస్య రాత్రే అయినా...ఓ మధురమైన రాత్రిగా మిగిలిపోవాలని ....భర్తను తన అందాలతో కైపెక్కించాలని చేసిన తన ప్రయత్నమంతా నీరుగారిపోయింది.


   భూమిక నుంచి దూరంగా జరుగుతూ....సారీ...నాకు పెళ్లి వద్దంటున్నా...నీతో నాకు మావాళ్ళు బలవంతంగా పెళ్లిచేశారు. నేను ఎప్పటికీ సంసార సుఖానికి పనికి రానని నీకు చెప్పలేక నాలో నేనే కుమిలిపోతున్నాను...అంటూ ముఖం చాటేశాడు ఆకాష్. 


    భూమిక భర్తను చూసి చిన్నగా నవ్వింది.

    "ఎందుకండీ...మీలో లేని లోపాన్ని ఉందని చెప్పుకోవడానికి మగాడుగా సిగ్గెయ్యడం లేదూ...? మీరు నాదగ్గరెంత దాచాలని ప్రయత్నించినా...ప్రేమ వ్యవహారానెప్పుడూ దాయలేరు. ఇలాంటి విషయాలు దాచాలన్నా దాగవు. వారి ద్వారా వీరి ద్వారా తెలుస్తూనే ఉంటాయి.  మీరొక అమ్మాయిని ప్రేమించారనీ...ఆమెతో పెళ్లికాక భగ్నప్రేమికూడయ్యారని నాకు మన పెళ్లికి ముందే తెలుసు. అయినా...మిమ్మల్ని పెళ్లి చేసుకుని....మీతో మొదటి ప్రయాణానికి సిద్ధమై వచ్చానంటే....మిమ్మల్ని నాప్రేమతో మాములు మనిషిగా మార్చుతాననే నమ్మకంతోనే. ఎంతో గయ్యాళిగా వుండే మీ అమ్మ గారి మనసులోనే నేను స్థానం సంపాదించుకోగా లేంది...మీ మనసులోనూ స్థానం సంపాదించుకోగలననే ధీమా నాకుంది. మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీతో నేనడుగులేసిన ఈ మొదటి ప్రయాణంలో ఎన్ని ఒడిదుడికలు వచ్చినా...చివరివరకూ సాగుతూనే ఉంటుంది గానీ.. ఆగదీ ప్రయాణం"  అంటూ చెప్పేసరికి... భార్య భూమికను అలా చూస్తూ ఉండిపోయాడు ఆకాష్.*


          ***       ***       ***

     

    


 

   


    

    

  

   


 


     


    


    


    


    


   


    


     


     


   


Rate this content
Log in

Similar telugu story from Drama