STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

వెన్నెలమ్మ.....

వెన్నెలమ్మ.....

1 min
260

మనసునల్లుకున్నావూ 

మరు మల్లి తీగలా !!

ఎదవీణను మీటావూ

మాటల ముత్యాలతో !!

చిరు చినుకుల తాకిడికి

మేను పరవశించే!! జల

తారు జల్లుల్లో చిరు

గాలుల సవ్వడిలో !!

జడను తురిమిన 

సన్నజాజుల పరిమళాలు!!

మనసును దోచేస్తుంటే !!

వెన్నెల వానలో !!

తడిసిపోతున్న 

జాబిలమ్మ విరహంలో !!

విరిసిన విహంగమై !!

సొగసు సొయగాలు

కనువిందు చేస్తూ !!

ఆహా కన్నులదెంత

అదృష్టం కదా !!

ఆటల పాటలతో

వెన్నెల తీరాలలో !!

చక్కని జంటని చూసి

కొమ్మన కోయిల 

సరాగాల పాటలతో

సరిగమలై పలకదా !!

వన్నెల శోభను

తెచ్చిన చిలకల జంటను

చూసి పులకించదా ప్రకృతి !!!

    

           


Rate this content
Log in

Similar telugu poem from Romance