వెలుగు...
వెలుగు...
చిరుగాలి ఊసులాడే.............
చిలుకమ్మ పాటపాడే.............
చిగురెరుపు తొణికిసలాడే............
చిక్కని తూరుపునిపుడే............
చిన్నారి భానుడితడే..............
చిరుచెమటలు పట్టిస్తాడే.............
చిరపుంజి వర్షపు జాడే..............
చిత్రంగా అటకెక్కిస్తాడే.............
చిత్తడి నేలపైన పుత్తడి పండిస్తాడే............
చిక్కడు ఏ మబ్బులకి దోబూచులాడుతాడే............
చిట్టి తామర మది దోచాడే.............
చిచ్చు పెట్టే ప్రేమికుడితడే.............
చివరికి తానే అస్తమిస్తాడే.............
చిత్తమున ఏముందీ తెలియనీయడే.............
చిత్రమైన పయనాన మేటి వీరుడే...............
చిమ్మ చీకటి తరిమి వెలుగునిచ్చాడే..............

